Actress Laya: తెలుగు చిత్ర పరిశ్రమలోకి స్వయంవరం అనే చిత్రంతో పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ..లయ చూడడానికి అచ్చం మన తెలుగు అమ్మాయిలా చాలా సాంప్రదాయంగా కనిపిస్తుంది. లయ చిన్నతనం నుంచే చదరంగంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించి రాష్ట్ర స్థాయిలో ఏడుసార్లు, జాతీయ స్థాయిలో ఒకసారి పతాకాలు కూడా గెలుచుకుంది. నాలుగవ తరగతి చదువుతున్నప్పుడే మొదటి సినిమాలో నటించే అవకాశం తనకు దక్కింది. ఇక హీరోయిన్ గా 1999లో తాను నటించిన మొదటి సినిమా స్వయంవరం మంచి హిట్ అవడంతో తనకు వరుస అవకాశాలు వచ్చాయి.
లయ (Actress Laya) అందరి హీరోయిన్ల లా కాకుండా ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలలో నటించకుండా, గ్లామర్ పాత్రలకి దూరంగా ఉంటూ.. అచ్చ తెలుగు అమ్మాయిలా ఎన్నో సంప్రదాయక గుర్తింపు పొందే సినిమాల్లో మాత్రమే నటించింది. అనధికాలంలోనే సావిత్రి, సౌందర్య లకు ఉన్న మంచి గుర్తింపు తాను పొందింది. ఇక లయ నటించిన ప్రేమించు అనే చిత్రంలో అందురాలిగా నటించి తన నటనతో అందరిని మైమర్చిపోయేలా చేసింది. అలా వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఎన్నారై గణేష్ రెడ్డిని వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడింది.
లయకు 2006లో వివాహం జరిగింది. ఆ తర్వాత పెళ్లయ్యాక అమెరికాకి వెళ్లిన లయ కొన్ని రోజులు ఇంటి దగ్గరే ఉంటూ 2011 నుండి ఐటీ సెక్టర్ లో జాబ్ చేసిందట. ఆమె ముఖ్యంగా మన ఇండియాలోని ప్రముఖ ఐటీ సంస్థకు పనిచేసిందట. అయితే ప్రస్తుతం ఆమె జీతం గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె జీతం నెలకు అన్ని వేల డాలర్ల అంటూ నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ లయ ఒక నెల జీతం అన్ని టాక్స్లు పోగా 12,000 డాలర్లు వచ్చేవట మన భారతీయ కరెన్సీ ప్రకారం పన్నెండు వేల డాలర్లు అంటే దాదాపు కోటి రూపాయలతో సమానం..
అలా నాలుగు సంవత్సరాల పాటు ఐటీ సెక్సర్లు పనిచేసి ఆ తర్వాత జాబ్ కు రిజైన్ చేసిందట. జాబ్ రిజైన్ చేశాక తను ఓ డ్యాన్స్ స్కూల్ పెట్టింది.. కానీ కరోనా కారణంతో ఆ స్కూల్ మూసేసిందట.. ఇక ఆ తర్వాత కరోనా కాళీ సమయంలో ఇంట్లోనే ఉంటూ టైం దొరికినప్పుడు సోషల్ మీడియాలో బాగా చురుగ్గా ఉంటూ ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ మళ్లీ చాలా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం అయితే లయ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరి చూడాలి తెలుగులో తనకు ఏసినిమాలో అవకాశం దక్కుతుందో..