Love Marriages : ప్రేమ ఈ రెండు అక్షరాల పదం మనిషి జీవితాన్ని నడిపిస్తుంది. ఈ రెండు అక్షరాలే ప్రతి ఇద్దరి మనుషుల మధ్యన ఉంటాది. కాకపోతే అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క రకమైన ప్రేమగా కలిగి ఉంటది. ప్రేమించుకోవడం ప్రేమ పిల్లలు చేసుకోవడం అనేది ఎప్పటినుంచో చాలా సహజంగా జరుగుతున్నదే. పూర్వకాలంలో ( About Love marriages supreme court ) ఎవరైనా ప్రేమించుకుంటే వాళ్ల ప్రేమకి పెద్దలు అంత సులభంగా ఒప్పుకునేవారు కాదు. వాళ్ళని ఒప్పించడానికి ఎన్ని కష్టాలు పడినా, ఎంత చెప్పినా కూడా చాలామంది ఆశీర్వదించి పెళ్లిళ్లు చేసేవారు కాదు. ధైర్యం లేని వాళ్ళు అలాగే జీవితాన్ని వేరే వాళ్ళతో ఇష్టం లేకపోయినా అడ్జస్ట్ అవుతూ బ్రతికేసేవారు.
ధైర్యం ఉన్నవాళ్లు పెద్దల్ని ఎదిరించి పారిపోయి పెళ్లిళ్లు చేసుకొని బ్రతికేవారు. ఇంతకుముందు ప్రేమ వివాహాలు చేసుకోవడం అంటే అంత కష్టం. ఇప్పటి జనరేషన్ కి ప్రేమ వివాహం అనేది పెద్ద కష్టం కాదు. ఫస్ట్ అఫ్ ఆల్ అసలు ( About Love marriages supreme court ) ఇద్దరు ప్రేమించుకుంటే.. వాళ్ళు ఆ ప్రేమ మీద నిలబడి.. పెళ్లి వరకు వెళ్లడమే కష్టంగా ఉంది. వీళ్ళని ఎవరు విడగొట్టాల్సిన పనిలేదు.. వీళ్ళకి వీళ్లే బ్రేకప్ లంటూ విడిపోతున్నారు. అయితే కొందరు పెళ్ళి వరకు వెళ్తున్నారు.. పెద్దవాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పించి చేసుకుంటున్నారు.. ఒప్పుకోకపోతే వాళ్లకు వాళ్లే చేసేసుకుంటున్నారు. కానీ పెద్దవాళ్లు ఒప్పుకోకపోవడం అనే పెళ్లిళ్లు చాలా తక్కువగా ఉన్నాయి.
పేరెంట్స్ కూడా పిల్లల మీద ఇష్టంతోనో, నమ్మకంతోనో, చేసేదేమీ లేదనే ఉద్దేశంతోనే, తెలియదు కానీ.. ప్రేమించుకున్నామని పిల్లలు వస్తే ఒప్పుకొని నాలుగు అక్షింతలు వేసి.. ఘనంగా పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మార్పుకి చాలామంది ఆనందించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త సమస్య ఏంటంటే.. పెళ్లి తర్వాత విడాకుల కేసులు ఎక్కువవుతున్నాయి. ఒక పెళ్లి చేయాలంటే.. తల్లితండ్రులు ( About Love marriages supreme court ) జీవిత కాలంలో ఎంతో కష్టపడి ప్లాన్ చేసి చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఈజీగా సెలెక్ట్ చేసేసుకొని.. పెళ్లిళ్లు చేసుకొని అతి తొందరలోనే విడిపోతున్నారు. అయితే ఈ విడిపోతున్న పెళ్లిళ్లు కూడా ఎక్కువగా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కంటే.. ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్లిళ్లలో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
పోనీ పెద్దలు కుదిర్చిన పెళ్లి అంటే.. అబ్బాయికి, అమ్మాయికి మధ్య ఎలాంటి అవగాహనా లేదు, పెద్దలు కట్నం గురించో, లేక కుటుంబ సాంప్రదాయం గురించి బలవంతంగా పెళ్లి చేశారు.. అందుకే అడ్జస్ట్ అవ్వలేదు అని అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎక్కువమంది విడిపోవడానికి కారణం ఏమిటో అర్థం కావడం లేదు. వివాహ వివాదం కారణంగా తలెత్తిన ఓ బదిలీ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ క్రమంలో ఈ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని కేసులో న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. ”చాలా విడాకులు ప్రేమ వివాహాల నుంచి మాత్రమే ఉత్పన్నమవుతున్నాయి” అని పేర్కొన్నారు. అయితే మీ చుట్టూ కూడా చాలామంది గురించి తెలుస్తాదిగా.. విడాకుల్లో లవ్ మ్యారేజ్ లు ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటో మీ ఉద్దేశం చెబుతూ.. మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వాళ్ళని కూడా అడిగి అభిప్రాయాలూ చెప్పండి..