Home Cinema Sharwanand: చాలా సింపుల్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న శర్వానంద్ పెళ్లికి బుక్ చేసుకున్న ఆ...

Sharwanand: చాలా సింపుల్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న శర్వానంద్ పెళ్లికి బుక్ చేసుకున్న ఆ ప్యాలెస్ ఒక రోజుకి ఎన్ని కోట్లో తెలుసా.?

Sharwanand: మనందరికీ తెలిసిన విషయమే.. శర్వానంద్ రక్షిత రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను ప్రేమించి చాలా సింపుల్ గా నిశ్చితార్థం చేసుకున్న సంగతి మనం చూసాము.. నిశ్చితార్థం అయితే చాలా సింపుల్ గా చేసుకున్నాడు గానీ పెళ్లి విషయంలో మాత్రం తగ్గేదే లేదంటున్నాడు. కాగా ఇప్పటి వరకు తన పెళ్లి విషయంలో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా పరంగా వైరల్ గా మారాయి. అంతెందుకు నిన్నగాక మొన్న శర్వానంద్ అక్కినేని అఖిల్ లానే ఎంగేజ్మెంట్ ను బ్రేక్ చేసుకున్నాడని.. వీళ్లిద్దరి మధ్య ఏవో గొడవలు తలెత్తాయని లేనిపోని ప్రచారాలు సైతం నెట్టింట వైరల్ చేశారు ఆకతాయిలు.. (Sharawanand marriage venue)

See also  Sreeleela : బాలకృష్ణతో అలాంటి వేషాలు వెయ్యద్దని పెద్దలెందరు చెప్పినా శ్రీలీల వినకపోవడం వలన చివరికి ఇలా..

sharawanand-marriage-venue-is-going-to-cost-crores-per-day

ఇక ఈ విషయాలన్నింటినీ క్లారిటీ తెలిపింది శర్వానంద్ టీం.. అసలు అలాంటి విషయం ఏమీ లేదని వీళ్లిద్దరు త్వరలో ఏడడుగులు వేస్తారని క్లారిటీ ఇవ్వడంతో ఇలా లేనిపోని వార్తలను వైరల్ చేసే ఆకతాయిలు ఒక్కసారిగా కామ్ అయిపోయారు. అయితే మనకు తెలిసిన తాజా సమాచారం ప్రకారం.. శర్వానంద్ రక్షిత రెడ్డి వీళ్లిద్దరూ జైపూర్ లోని లీలా ప్యాలెస్ (Sharawanand marriage venue) లో రెండు, మూడు తేదీల్లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరగబోతుంది అంటూ వెబ్ మీడియాలో కొన్ని వార్తలు అయితే వినబడుతున్నాయి. అయితే వీరి పెళ్లి డేట్స్ నిజమో కాదో తెలియదు కానీ రెండో డేట్ రోజు వీళ్ళిద్దరూ ఘనంగా ఫ్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకుంటారని..

See also  Prabhas & Gopichand: ప్రభాస్ సినిమాలో విలన్ గా గోపీచంద్.. అధికారిక ప్రకటన వచ్చేసింది..

sharawanand-marriage-venue-is-going-to-cost-crores-per-day

ఆ తర్వాత మూడో తారీకున రక్షిత రెడ్డి శర్వానంద్ వీళ్ళిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవుతారని మనకు వార్తలు అయితే వినబడుతున్నాయి. ఇక ఇంత ఘనంగా వివాహ వేడుకను జరుపుకుంటున్న శర్వానంద్ పెళ్లికి మాత్రం కేవలం తన స్నేహితులని అలాగే కుటుంబ సభ్యులకు మాత్రమే హాజరవుతున్నారని సమాచారం.. వివాహం అనంతరం గ్రాండ్ గా సినీ సెలబ్రిటీలకు కూడా రిసెప్షన్ పార్టీ ఇస్తారో లేదో మరి ఎదురు చూడాలి. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెట్టి మన అసలు విషయానికి వచ్చినట్లయితే.. శర్వానంద్ తన పెళ్లిని ఓ స్టార్ సెలబ్రిటీ రేంజ్ లో చేసుకోబోతున్నారని సమాచారం.. ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకునేది లీలా ప్యాలెస్ ఖర్చు కొన్ని కోట్లలో ఉంటుందని తెలుస్తుంది.

See also  Varun Tej - Lavanya Tripathi : ఎంగేజ్మెంట్ కార్డు పై అనుమానాలు.. పవన్ కళ్యాణ్ కూడా..

sharawanand-marriage-venue-is-going-to-cost-crores-per-day

జైపూర్ లోని లీలా ప్యాలెస్ ఖరీదు రోజుకి నాలుగు కోట్ల రూపాయలని సమాచారం.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవ్వడంతో తన పెళ్లికి రెండు రోజుల ఖర్చు ఎనమిది కోట్లని తెలుస్తుంది. ఇక పెళ్లికే ఇన్ని కోట్లు పెట్టి లీలా ప్యాలెస్ ని బుక్ చేసుకున్నారంటే.. ఇక మిగతా వాటికి ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు చేస్తాడు అని ప్రతి ఒక్కరూ షాక్ లో మునిగిపోయారు. ఇక వీళ్ళ పెళ్లి త్వరలో అంగరంగ వైభవంగా చేసుకోబోతున్నారు అన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్ లో ఆర్టిస్టుగా నటిస్తూ ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ ఎదిగిన శర్వానంద్ కి చాలామందికి ఆదర్శం.