Home Cinema Nagarjuna: నాగార్జున ఆ స్టార్ డైరెక్టర్ కి అన్ని కోట్లు ఇవ్వడానికి కారణం అఖిల్...

Nagarjuna: నాగార్జున ఆ స్టార్ డైరెక్టర్ కి అన్ని కోట్లు ఇవ్వడానికి కారణం అఖిల్ సినీ కెరియర్ కోసమేనా..

Nagarjuna Akkineni: అఖిల్ అక్కినేని ప్రస్తుతం అదృష్ట రేఖకు దూరంగా ఉన్నాడని చెప్పాలి. ఎందుకంటే తను నటించిన చిత్రాలన్నీ వరుసగా ప్లాప్ అవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇక అఖిల్ తన తదుపరి చిత్రం కూడా ఫ్లాప్ అయితే ఇక ఇండస్ట్రీలో అఖిల్ కథ ముగిసినట్టే అని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలోనే బడా ఫ్యామిలీ అయినా అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరో మాత్రం ఇండస్ట్రీలో తానంత నిరూపించుకోలేక పోతున్నాడు అంటూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అందులో కొంతమంది ఏమో అఖిల్ కి యాక్టింగ్ రాదని అంటుంటే.. మరికొందరేమో ఎంచుకునే కథలు విషయం బాగా లేదని అంటుంటే..

See also  Rashmika: ఆఖరికి రష్మిక పనిమనిషి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి రావడానికి కారణం అతనేనా?

nagarjuna-akkineni-gave-money-to-a-star-director-to-make-a-film-with-his-son-akhil

మరి కొందరేమో డైరెక్టర్ చేసే తప్పుల వల్లే ఇలా జరుగుతుందని రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇక ఏది ఏమైనప్పటికీ.. అఖిల్ నటించిన చిత్రాలు అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఇటీవలే విడుదలైన ఏజెంట్ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక ఈయన నటించిన ఒకే ఒక హిట్ అయిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కానీ ఈ సినిమా హిట్ అయినప్పటికీ క్రెడిట్ మొత్తం పూజ హెగ్డే ఖాతాలో వెళ్లిపోయింది. ఇటీవల విడుదలైన ఏజెన్ సినిమాతో భారీ హిట్ కొట్టబోతున్నాడు అని అందరూ భావించారు. కానీ ఈ చిత్రం కూడా నిరాశే మిగిలించింది. ఇక కొడుకు సినీ కెరియర్ ఇలా ఉండడంతో అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడట..

See also  OTT : ఈ ఒక్క ప్లాన్ తో ఇన్ని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లా.. ఒక్కసారి తెలుసుకోండి.

nagarjuna-akkineni-gave-money-to-a-star-director-to-make-a-film-with-his-son-akhil

మరి అదేంటో తెలుసుకుందాం.. తన కొడుకు సినీ జీవితాన్ని ఒక దారిలో పెట్టడానికి ఓ స్టార్ డైరెక్టర్ కి ముందుగా 10 కోట్లు అడ్వాన్స్ డబ్బులు ఇచ్చాడట. అయితే ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు కాదు పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న రాజమౌళి. ఇక రాజమౌళి దర్శకత్వంలో చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆయన డైరెక్షన్లో ఒక్క సినిమా చేస్తే చాలు ఆ హీరో రేంజ్ మారిపోతుందని అందరూ భావిస్తుంటారు. అందుకే అక్కినేని నాగార్జున తన కొడుకు అఖిల్ ఎలాగైనా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలని తన కొడుకు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రాజమౌళి గారికి 10 కోట్ల అడ్వాన్స్ ఇచ్చారట.

See also  Skanda: స్కంద ఈవెంట్ లో భాగంగా రామ్ పోతినేని గురించి ఓ సీక్రెట్ వెల్లడించిన నటసింహం బాలయ్య..

nagarjuna-akkineni-gave-money-to-a-star-director-to-make-a-film-with-his-son-akhil

ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త.. కాగా ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ వర్గాల నుండి వస్తున్న ఈ సమాచారం ప్రకారం రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత అఖిల్ తోనే సినిమా తీయబోతున్నారు అంటూ వార్త వినిపిస్తూనే ఉంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే మహేష్ బాబు చిత్రం విడుదల అయిన తర్వాత మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సి వస్తుంది. ఏది ఏమైనాప్పటికీ నాగార్జున తన కొడుకు భవిష్యత్తు కోసం ఎంతలా ఆరాటపడుతున్నాడో ఈ చిన్న విషయం చూస్తే మనకు అర్థమవుతుంది.