Home Cinema Naga Chaitanya – Samantha : నాగచైతన్య సమంతలకు మళ్ళీ పెళ్లా?

Naga Chaitanya – Samantha : నాగచైతన్య సమంతలకు మళ్ళీ పెళ్లా?

will-naga-chaitanya-samantha-get-married-again

Naga Chaitanya – Samantha : నాగచైతన్య సమంత వీళ్లిద్దరూ ఇప్పుడు జంటగా లేకపోయినప్పటికీ.. వీళ్ళ జంట గురించి మాత్రం అందరూ మాట్లాడుకుంటూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఈ జంట అంటే.. ఇష్టమో ( Naga Chaitanya Samantha marriage ) ఏమిటో తెలియదు కానీ విడిపోయి కాలం గడుస్తున్నా కూడా వీళ్ళిద్దరికీ సంబంధించిన ప్రతి వార్త చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ముఖ్యంగా అభిమానులంతా వీళ్ళిద్దరూ మళ్లీ కలవాలని, ఎప్పుడూ కలిసి ఉంటే బాగుండునని కోరుకునేలా చేసే చూడముచ్చటైన జంట ఇది. నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకుని ఎన్నో సంవత్సరాలు కలిసి ఉండలేక.. కొన్ని కారణాల వల్ల విడిపోయారు. వీళ్ళు విడిపోవడానికి కారణం ఏమిటి అనేది ఇంతవరకు ఎవరు తెలియదు.

will-naga-chaitanya-samantha-get-married-again

నాగచైతన్య సమంత ఎప్పుడూ కూడా వాళ్ళు విడిపోవడానికి అసలైన రీజన్ ఇదే అని చెప్పలేదు. ఇటీవల కస్టడీ సినిమా ప్రమోషన్ కోసం నాగచైతన్య అనేక ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ సమయంలో చైతుని సమంత ( Naga Chaitanya Samantha marriage ) గురించి కొన్ని ప్రశ్నలు అడగ్గా.. అందులో దేనికి కూడా చైతు నెగిటివ్ గా స్పందన ఇవ్వకుండా.. నార్మల్ గా సమాధానం చెప్పాడు. దీనితో నాగచైతన్యకి సమంత పైన ప్రేమ ఉందో లేదో తెలియదు గాని కోపం అయితే పెద్దగా లేదు అని.. నెటిజనులు కామెంట్ చేసుకోవడం మొదలుపెట్టారు. మే 12వ తేదీ శుక్రవారం నాగచైతన్య సినిమా కస్టడీ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గురించే మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది.

See also  Hrithik - Nayanthara : బయట పడ్డ సీక్రెట్.. హృతిక్ మరియు నయనతారకి ఉన్న స్పెషల్ బంధం..

will-naga-chaitanya-samantha-get-married-again

కొందరు బాగుందని, కొందరు బాలేదని.. కానీ నాగచైతన్య పర్ఫామెన్స్ చాలా బాగుందని టాక్ వచ్చింది. సినిమా గురించి రివ్యూస్ కామెంట్ రావడం సహజమే కానీ ఈ తరుణంలో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంతకీ అదేమిటంటే.. నాగచైతన్య సినిమా కస్టడీ గురించి సమంత ( Naga Chaitanya Samantha marriage ) కామెంట్ చేసిందని పైగా ఆ కామెంట్ చాలా పాజిటివ్ గా చేసింది అని.. సినిమాలో చైతు చాలా బాగా నటించాడని, పోలీస్ గా చైతు అదరగొట్టాడని.. ఈ సినిమా వలన చైతు కెరియర్ ఫ్యూచర్ లో చాలా బాగుంటుంది అని సమంత కామెంట్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ఈ వార్త చూడడమే మొదలు..

See also  Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆస్థి ఎంతో.. అది ఎలా వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు.

will-naga-chaitanya-samantha-get-married-again

అయితే సమంత, నాగచైతన్య మళ్ళీ కలుస్తారని.. వీళ్ళిద్దరికీ మళ్లీ పెళ్లి జరుగుతుందని.. ఏవేవో కలలుగంటున్నారు అభిమానులు. ఇద్దరు మనుషులు ప్రేమించుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుందేమోగానీ.. విడిపోవడానికి ఎంతో టైం పట్టదు. అలాగే విడిపోయిన వాళ్ళు మళ్లీ పెళ్లి చేసుకోవడం అనేది అసాధ్యం, అసంభవం అనే పదాలు వాడేట్టుగానే ఇంతవరకు ఎన్నో జంటలు నిరూపించాయి. అలాంటిది ఇప్పుడు నాగచైతన్య సమంత మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అనే ఊహాగానాలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నాగచైతన్య, సమంత ఎవరి కెరియర్ లో వాళ్ళు నిలదొక్కుకునే బిజీ లో ఉన్నట్టు కనిపిస్తున్నారు గాని, వాళ్ళు కలిసే దారి ఉన్నట్టు ఎక్కడా కనిపించడం లేదని మరి కొందరు నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.

See also  Manchu Lakshmi: ఆ భాగం మొత్తం మారిపోయింది అంటూ మంచు లక్ష్మీ సంచలనమైన కామెంట్స్..