Chay and Sam: అక్కినేని నాగచైతన్య, సమంత (Naga Chaitanya And Samantha) వీళ్ళు ఇద్దరు కలిసి నటించిన తొలి చిత్రం ఏం మాయ చేసావే చిత్రం నుండి ప్రేమలో మునిగితేలుతూ అలా పది సంవత్సరాల తర్వాత ఇరు కుటుంబంలోని పెద్దలను ఒప్పించి ఒకటయ్యారు. ఎంతో ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్న వీళ్ళు నాలుగు సంవత్సరాలు కూడా కలిసి కాపురం చేయలేక విడాకులు తీసుకున్నారు. ఎంతో మంచి జంటగా గుర్తింపు పొందిన సామ్ చైతు విడిపోవడం అటు సినీ ప్రముకులకే కాకుండా ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో బాధ మిగిల్చింది. అసలు వీరు ఎందుకు విడిపోయారు అన్న కారణం ఇప్పటి వరకు బయటకు మాత్రం రాలేదు.
కానీ విడాకుల తర్వాత సమంత ఓ షోలో పాల్గొన్నప్పుడు ఆమె కొన్ని విస్తుపోయే విషయాలు వెల్లడించింది. సమంతకు అవి చీకటి రోజులు అని అసలు నాకు వాటిని గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టం లేదు. మరి అదే కాకుండా.. సమంత, నన్ను చైతును ఒక్క రూమ్ లో ఉంచితే కచ్చితంగా అక్కడ పదునైన వస్తువు లాంటివి ఏవి ఉంచకూడదు అంటూ నాగచైతన్య మీద ఉన్న తన ద్వేషాన్ని స్వయంగా తనే బయటపెట్టింది. అయితే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడం వెనక చాలామంది నాగచైతన్యది, అక్కినేని కుటుంబం దే తప్పని చెప్తుంటే.. మరి కొంతమంది తప్పంతా సమంతాది అంటూ ప్రతిరోజు ఏదో ఒక వార్త వైరల్ చేస్తున్నారు.
ఇక ప్రస్తుత తాజా విషయానికి వస్తే తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. . అదేంటంటే.. సమంతతో నాగచైతన్య (Naga Chaitanya And Samantha) డివోర్స్ తీసుకున్న తర్వాత వెక్కి వెక్కి ఏడ్చాడంట.. ఇదేకాక సమంతతో ఉన్న ప్రతి జ్ఞాపకాన్ని ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ ఎంతో కుమిలిపోయాడట. నాగచైతన్య కుటుంబంలోని వాళ్లే కాక చైతు స్నేహితులు, సన్నిహితులు ఎంతమంది ఓదార్చినప్పటికీ ఆ బాధ నుండి తేరుకోలేకపోయాడట.. ప్రస్తుతం ఈ విషయం వెలుగులోకి రావడంతో సమంత చేసిన పనికి చైతు అంతలా కుమిలిపోయి వెక్కి వెక్కి ఏడ్చాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
ఇక ఇదే కాక సమంత చేసిన పని వల్లే చైతు ఆమెకు విడాకులు ఇచ్చాడు. సమంతనే విడాకులు కావాలని మరీ తీసుకుంది. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీలో పద్ధతి గల కోడలిగా ఉండమంటే అది నచ్చకనే విడాకులు ఏరి కోరి మరి తీసుకుందంటూ మరికొందరు నెట్టింట రచ్చ చేస్తున్నారు. సమంత ఇప్పటివరకు వచ్చిన అన్ని ఇంటర్వ్యూలలో ఏ ఇంటర్వ్యూలలో కూడా చైతు గురించి మంచిగా మాట్లాడలేదు. బట్.. చైతు మాత్రం ఆయన పాల్గొన్న ఏ ఇంటర్వ్యూ లోనైనా సమంత గురించి టాపిక్ వస్తే చిన్నగా స్మైల్ ఇచ్చి ఆమె గురించి పాజిటివ్ గా మాట్లాడుడాడే తప్ప ఏ రోజు సమంతని ఒక్క మాట కూడా అనలేదు. విడాకులు తీసుకోవడానికి అసలు కారణం.. తప్పు.. మొత్తం సమంతదే అంటూ అక్కినేని అభిమానులంతా సమంతను విమర్శిస్తున్నారు..