Home Cinema Ram Charan: ఒకప్పుడు అవమానించిన వారే..!! ఇప్పుడు దండం పెడుతున్నారు. అది మెగా పవర్ స్టార్...

Ram Charan: ఒకప్పుడు అవమానించిన వారే..!! ఇప్పుడు దండం పెడుతున్నారు. అది మెగా పవర్ స్టార్ అంటే..

RRR OSCAR: ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్ప పేరు సంపాదించిందో మనందరికీ తెలిసిన విషయమే.. అలాంటి ఆర్ఆర్ఆర్ నిర్మించింది దర్శక ధీరుడు రాజమౌళి.. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేషనల్ కాదు ఏకంగా ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. అంతటితో ఆగకుండా గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ఇక రామ్ చరణ్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.. ప్రస్తుతం పాన్ ఇండియా కాదు కదా.. పాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్-రణం రౌద్రం రుద్రం ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ నామినేట్ అవ్వడంతో గత కొద్ది రోజుల నుంచి అమెరికాలోనే ఉంటున్నాడు రామ్ చరణ్. దాంతో అక్కడే ఉన్న హాలీవుడ్ మీడియాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ టు నైట్ మరి అదే విధంగా ఈజీ టాక్ వంటి వాటికి వరుసగా ఇంటర్వ్యూ లు ఇస్తూ అక్కడివారిని బాగా ఆకర్షిస్తూ ఆకట్టుకున్నాడు.

See also  Lavanya Tripathi : విజయకచవితి పండుగలో పెళ్లి కాకుండానే నిహారికని బాధపెట్టిన లావణ్య త్రిపాఠి.. నిజమా?

after-rrr-oscar-who-scolded-ram-charan-are-now-praising-him

ప్రస్తుతం రామ్ చరణ్ కి హాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. మరదే కాకుండా  నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకోవడంతో రామ్ చరణ్ పేరు ఓ రేంజ్ లో మార్మోగిపోతుంది. దాంతో హాలీవుడ్ డైరెక్టర్లే కాక ఇతర భాషల హీరోయిన్లు కూడా రామ్ చరణ్ తో కలిసి పనిచేయడానికి మోగ్గు చూపుతున్నారు. దీంతో ఒకప్పుడు రామ్ చరణ్ కి నటన రాదంటూ బాలీవుడ్ ఘోరంగా అవమానించింది. ప్రస్తుతం ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. (RRR OSCAR)

See also  Samantha: ఓరి నాయనో.. సమంతా విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఇమేనా.??

after-rrr-oscar-who-scolded-ram-charan-are-now-praising-him

రామ్ చరణ్ బాలీవుడ్లోకి జంజీర్ అనే సినిమాతో ఎంట్రీంచాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన ఇదే సినిమా తెలుగులో తుఫాన్ అనే పేరుతో విడుదలైంది. 2013లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో చరణ్ యాక్టింగ్ స్కిల్స్ పై బాలీవుడ్ క్రిటిక్స్ తీవ్రమైన విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు ఆర్ఆర్ సినిమాతో సీన్ మొత్తం మారిపోయింది.. ఈ సినిమాలో రామ్ చరణ్ చేసిన నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంది.

See also  Kalyan Ram - NTR: కళ్యాణ్ రామ్ పరిస్థితి వేరేలా ఉండేది.?? ఆ రోజు ఎన్టీఆర్ సాయం చేయకుంటే..

after-rrr-oscar-who-scolded-ram-charan-are-now-praising-him

ప్రపంచంలో అతి గొప్ప చిత్రాలైన టైటానిక్ మరియు అవతార్ సిరీస్ లను వంటి అద్భుతమైన దృశ్య కావ్యాలను తెరకెక్కించినటువంటి డైరెక్టర్ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ కూడా రామ్ చరణ్ పై ప్రశంసలు గుప్పించారు. దీంతో బాలీవుడ్ సైతం చరణ్ నటనకు ఫిదా అయ్యారు. రాంచరణ్ కు నటన రాదంట గోరంగా అవమానించిన వారే ఇప్పుడు రామ్ చరణ్ కు చేతులెత్తి దండం పెడుతున్నారు. రాంచరణ్ గురించి ఆయన నటన గురించి గొప్పగా ప్రశంసిస్తూ రాతలు రాస్తున్నారు. దీంతో మెగా అభిమానులకు పండగ వాతావరణం ఏర్పడి ఎగ సంతోషంలో ఉప్పొంగిపోతున్నారు. రామ్ చరణ్ అంటే ఇది అని గొప్పగా కాలర్ ఎగరేస్తున్నారు.