Sai Pallavi comments on harassment of women: సాయి పల్లవి అంటే కొత్తగా పరిచయం అవసరం లేదు. డాన్స్ ను అదరగొట్టే సాయి పల్లవి, నటనలో కూడా నంబర్ వన్ గా నటిస్తాది. తన పాత్రను తాను అద్భుతంగా నటిస్తాది. సాధారణంగా ఏ పాత్ర తనకు వస్తే, ఆ పాత్రకు న్యాయం చెయ్యడం అనేది చాలామంది హీరోయిన్స్ చేస్తూనే ఉంటారు. కానీ సాయి పల్లవి అలా కాదు, తన మెంటాలిటీకి ఏది న్యాయమైన, ఇష్టమైన పాత్ర అనుకుంటే ఆ పాత్రను మాత్రమే ఒప్పుకుని ఆ పాత్రకు 100 పర్సెంట్ న్యాయం చేస్తాది. అందుకే సాయి పల్లవి నటించిన సినిమాలు హిట్ ఫ్లాప్ తో ఆమెకు సంబంధం ఉండదు. ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆమె పై ఉన్న క్రేజ్ కి ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండదు. ఎక్కువ మేకప్ జోలికి, ఖరీదైన కాస్ట్యూమ్ జోలికి వెళ్లకుండా చాలా సింపుల్ గా ఉంటాది సాయిపల్లవి.
అవకాశాలు కోసం ఎలాంటి పాత్రనైనా నటించేలా ఆమె సెలక్షన్ ఉండదు. ప్రతీ ఎంపికలో ఒక ప్రత్యేకత ఆమె అభిప్రాయం కనిపిస్తాది. అలాగే సాయి పల్లవి మాటల్లో కూడా ఖనాఖండీగా మాట్లాడే మనిషి. ఎం మాట్లాడితే ఎలాంటి సమస్య వస్తాది అని భయపడే మనిషి కాదు. తాను ఏ విషయం గురించి అయినా, తాను మనసులో అనుకున్న మాటను భయం లేకుండా బయటకు చెప్పేస్తాది. సినిమా అవకాశాలు వస్తే చేస్తాను, లేకుంటే ఎలాగైనా బ్రతకగలను అనే కాన్ఫిడెన్స్ సాయి పల్లవిలో బాగా కనిపిస్తాది. పైగా ఒక మోస్తరు హీరోతో నటిస్తే మాత్రం తప్పకుండా హీరోని డామినెట్ చేసేస్తాది. సాయి పల్లవి అన్న ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. అంతే కాకూండా దాని మీద కామెంట్స్ కూడా బాగా వస్తున్నాయి.
ఆడవారిని గౌరివించడమే మన భారతదేశ సంప్రదాయం అని మన పెద్దలు చెప్పారు. అయినా కూడా ఇప్పటికీ ఆడవారి మీద అనేక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతీరోజు ఆడవారి పై లైంగిక వేధింపుల గురించి వార్తలు వింటూనే ఉంటాము. అయితే బలవంతంగా రేప్ చేస్తేనే ఆడవారిని రేప్ చేసినట్టు కాదని, మానశికంగా క్రుంగదీసిన అది రేప్ తో సమానం అని సాయి పల్లవి చెప్పింది. మాటలతో ఆడవారిని గుచ్చి గుచ్చి అవమానిస్తే, అది కూడా వేధింపే అవుతుందని చెప్పింది. నిజమే మాటలతో హింసించేవారిని కూడా రేపిస్ట్స్, సైకోలుగా పరిగణంలోకి తీసుకోవాలి. అలాంటి నినాదానికి ఎంతమంది సపోర్ట్ చేస్తారో తెలీదు కానీ, ఆడవారిని గుచ్చి గుచ్చి మాటలతో వేధించకూడదు.
ఇంతకీ ఈ మాట సాయి పల్లవి ఎందుకు అన్నాదంటే.. నిజం విత్ స్మిత ప్రోగ్రాం కి సాయి పల్లవి గెస్ట్ గా వెళ్లబోతుంది. దానికి ప్రోమో రిలీజ్ చేసారు. అందులో స్మిత సాయి పల్లవిని మీటూ (Sai Pallavi comments on harassment of women) గురించి తన అభిప్రాయం చెప్పమని అడిగింది. ఒకప్పుడు మీటూ అనే ప్రోగ్రాం సోషల్ మీడియాలో సంచలనం రేపింది. సోషల్ మీడియాలో ఆడవారు తమకు జరిగిన వేధింపులు గురించి చెప్పుకునే వారు. దాని గురించి సాయి పల్లవి మాట్లాడుతూ.. కేవలం శారీరకంగా టార్చర్ చేస్తేనే అది మీటూ వివాదం అవుతుందా..? మాటలతో గుచ్చి గుచ్చి మనిషిని క్షోభ పెట్టినా అది మీటూ కిందకే వస్తుందని చెప్పింది.