Rice Cooker: ఉరుకుల పరుగుల జీవితం, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, మారుతున్న కాలం, సరి చేసుకోలేని జీవన విధానం వీటన్నిటిని అధిగమించి ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించి అలా మన రోజువారి అవసరాలను తీర్చుకుంటూ జీవనం సాగిస్తున్నాము.. అలా మన రోజు గడవడం కోసం ఆహార నియమాలను, ఆహారం తయారు చేసుకునే విధానానికి కూడా సమయం లేకుండా పోయింది. నిత్యం మనం తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ చూపించక చాలా పెద్ద పొరపాట్లు చేస్తున్నాం.చాలామంది అన్నం ఉండడనికి కరెంటు రైస్ కుక్కర్లు వాడుతున్నారు. ఇలా కరెంటు పరికరాలలో వండిన అన్నాన్ని లేదా ఆహారాన్ని తినడం వల్ల చాలా అనారోగ్యాల పాలు అవుతామని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైస్ కుక్కర్ లో కరెంటు ద్వారా వచ్చే అధిక ఉష్ణోగ్రత వద్ద అల్యూమినియం గిన్నెలో ఆహారాన్ని ఉడికించడం వల్ల తయారవుతుంది. అలా ఆ వేడి కారణంగా అల్యూమినియం గిన్నెలో నుంచి కొన్ని విష వాయువులు వెలుపడతాయి.అవి మనం ఉండే ఆహారంలో కలుస్తాయి. ఆ కారణం చేత మనం తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో అది విషపూరితమవుతుంది. ఇలా కరెంటు పరికరాల ద్వారా వండిన ఆహారాలను ఏళ్ల తరబడి తింటే మనలో జీవితాంతం వెంటపడే సమస్యలను ఉంటాయని చెప్తున్నారు. జీర్ణక్రియకు సంబంధించిన ఎన్నో వ్యాధులు, గుండెకు సంబంధించినవి అలాగే కీళ్లవాతం, కాలెయానికి సంబంధించినవి మరియు అధికంగా బరువెక్కి పోవడం.అనారోగ్య సమస్యలకు కరెంటు పరికరాలలో వండిన ఆహార పదార్థాలు కారణమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకని మనకు వీలైనంతవరకు ఈ కరెంటు పరికరాలలో వండిన ఆహారాన్ని తినడం పూర్తిగా దూరంపెట్టేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.