స్వయంకృషి అనే సినిమా టైటిల్ చిరంజీవిని హీరోగా అనుకున్నాకే.. విశ్వనాధ్ గారు ఆ పేరు పెట్టారేమో అనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి నిజంగానే ఆయన స్వయంకృషితో పైకి వచ్చారు. సినిమా రంగంలో ఎటువంటి అండ లేకుండా, ఒక్కడుగా ఎంటర్ అయ్యి, ఈరోజు మెగా హీరోలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఏలుతున్న మహారాజు చిరంజీవి.
చిరంజీవికి సినిమా రంగంలో ఎవ్వరూ లేకపోయినా.. ఒక్కరు వచ్చి తన డాన్స్, ఫైట్స్ తో ఒక సెన్సేషన్ 2 తరాలకు సరిపడా సృష్టించడమే కాకుండా.. తన పిల్లకు, తన తోబుట్టువులకు, బంధువులకు,వాళ్ళ పిల్లలకు అందరికీ మెగా ఫ్యామిలీ అంటూ ఒక ప్లాట్ఫార్మ్ క్రియేట్ చేసి ఇచ్చారు. నిజంగా చిరంజీవి లాంటి పెద్ద దొరకడం మెగా ఫ్యామిలీ అదృష్టం.
అలాగే సినిమా రంగంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా.. ఒక పెద్దగా ఆయన మంచి సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా.. చేయగలిగిన సాయం కూడా చేస్తారు. అలాంటి చిరంజీవికి ఇప్పుడు ఆయన ఇంట్లోనే సమస్యలు మొదలయ్యాయంట. శ్రీజ ఇంట్లో వాళ్లకి చెప్పకుండా మొదటి పెళ్లి చేసుకుని, కొంత కాలానికి భర్తను వదిలేసింది. చిరు శ్రీజని క్షమించి చేరదీసి మల్లి పెళ్లి చేశారు. కానీ ఇప్పుడు రెండవ భర్తకి కూడా దూరంగా ఉంటుంది. శ్రీజకి ఇప్పుడు ఇద్దరు కూతుర్లు.
శ్రీజ అంటే ఎంతో ప్రేమ ఉన్న చిరంజీవి.. ఆమె జీవితం పై బెంగ తో సగం ఆస్తి ఆమెకు ఇవ్వాలని అనుకుంటున్నారట. కొడుకు రామ్ చరణ్ ఎలాగూ బాగా సంపాదించుకుంటున్నాడు. అయితే ఆ నిర్ణయానికి చిరు పెద్ద కూతురు ఒప్పుకోవడం లేదంట. తనకి కూడా సగం ఇమ్మని అంటుందట. మరి కూతుర్లే ఇలా ఉంటె, కోడలు ఉపాసన ఏమంటుందో? ఏది ఏమైనా శ్రీజ వలన చిరు చిక్కుల్లో పడినట్టే అని అభిమానులు ఫీల్ అవుతున్నారు.