Animal : ప్రస్తుతం ఎక్కడ చూసినా అనిమల్ సినిమా పేరు వినిపిస్తూనే ఉంద. ఈ సినిమాపై సామాన్యుల నుంచి సెలబ్రెటీస్ వరకు పాజిటివ్గా మరో పక్కన నెగటివ్ గా కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే ఎవరు ఎన్ని కామెంట్లు ( Rajamouli and Mahesh about the Animal ) చేస్తున్నా సినిమా కలెక్షన్స్ మాత్రం కుంభ వృష్టిలా కురుస్తూనే ఉన్నాయి. అనిమల్ సినిమాలో ఎంత వైలెంట్ ఉందనేది కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇప్పటికే చాలామంది ఆ సినిమా చూడడం జరిగింది. ఇంకా చాలామంది ఆ సినిమా గురించి వినడం కూడా జరిగింది. ఆడదాన్ని అస్లీలంగా చూపించడం, ఆడదాన్ని అవమానించేలా ఉన్నాయని కామెంట్లు విపరీతంగా ఈ సినిమాపై నెగిటివ్గా రావడం జరిగింది.
అయితే తమ్మారెడ్డి భరద్వాజ్ సీనియర్ దర్శకనిర్మాత.. సినిమాలు గురించి ఆయన ఒపీనియన్ ఎవరికి భయపడకుండా చెప్పుకుంటూ వెళ్తారు. అందుకే ఆయన చెప్పిన అభిప్రాయాన్ని అందరూ నమ్ముతారు, గౌరవిస్తారు. సినిమా ఇండస్ట్రీలో ( Rajamouli and Mahesh about the Animal ) జరిగే ప్రతి మార్పులని చూసి ఆయన స్పందిస్తూ ఉంటారు. లో బడ్జెట్లో తీసిన సినిమాల్ని ఆయన ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు. వాటి గురించి ఆయన మంచి ప్రమోషన్ చేస్తారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. నీలాంటి మంచి దర్శకుడు ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదు, సినిమా సినిమాకి అంత గ్యాప్ తీసుకోకూడదు అని చెప్పడం జరిగింది.
అలాగే ఇప్పుడు అనిమల్ సినిమా గురించి కూడా ఆయన కొన్ని కామెంట్లు చేశారు. ఇటీవల ఆయనతో ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన అనిమల్ సినిమా గురించి అడగగా.. అనిమల్ సినిమా ఆల్రెడీ బాగా ప్రూవ్ అయిన హీరో, దర్శకుడు కలిసి చేసిన సినిమా అది. ఆ హీరో మంచి ఫామ్ లో ఉన్న హీరో.. అలాగే ( Rajamouli and Mahesh about the Animal ) దర్శకుడు ఇప్పటికే రెండు సినిమాలు తీసి వాటిని బ్లాక్ బస్టర్ చేసిన దర్శకుడు. అందుకని ఈ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. కనుక అంత హై బడ్జెట్లో ఆ సినిమాను తీయడానికి నిర్మాతలు ముందుకు వచ్చారు తప్పా.. ఆ సినిమాలో అంత హై బడ్జెట్ పెట్టి తీయాల్సినంత గొప్ప కథ గాని, గొప్ప గాని ఏమీ లేదని ఖణాఖండీగా చెప్పారు.
అయితే అనిమల్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో రాజమౌళి, మహేష్ బాబు ఇద్దరు కూడా సినిమాని విపరీతంగా కొనియాడారని అడగ్గా.. దానికి తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పిన సమాధానం ఏమిటంటే.. వాళ్ళిద్దరూ ఆ సినిమా రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లారు. ఎవరినైనా ఒక ఫంక్షన్ కి గెస్ట్ గా పిలిస్తే.. వాళ్ళ సినిమా గురించి హైప్ క్రియేట్ చేసి మంచి చెప్తారు కానీ.. చెడు చెప్తారా? మహేష్ బాబు ఆ సినిమా ట్రైలర్ చూడగానే మెంటల్ ఎక్కింది అంటే.. నిజంగా ఆ సినిమా అంత మెంటల్ ఎక్కేంత నచ్చేసింది అని కాదు.. ఆ సినిమా గురించి ఏదో రకంగా మంచి మాట్లాడాలి, హైప్ క్రియేట్ చేయాలి కాబట్టి మాట్లాడారు అంతే.. అని చెప్పారు. చివరికి అనిమల్ సినిమా అయితే ఆయనకు పెద్ద నచ్చలేదని, ఆ సినిమాలో చెప్పుకోదగ్గ అంత గొప్పవేవి లేవని ఆయన కచ్చితంగా చెప్పేశారు.