Home Cinema Mangalavaaram : మంగళవారం మేకింగ్ వీడియో లో మంచం మీద పాయల్.. ఆ సీన్ వైరల్..

Mangalavaaram : మంగళవారం మేకింగ్ వీడియో లో మంచం మీద పాయల్.. ఆ సీన్ వైరల్..

payal-rajput-mangalavaaram-movie-making-video-viral

Mangalavaaram : ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైనా పాయల్ రాజ్ పుత్.. మంగళవారం అనే సినిమాతో రేపు అందరి ముందుకి రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. ఆర్ఎక్స్ 100 ( Mangalavaaram Movie Making Video Viral ) కాంబినేషన్లోనే ఇప్పుడు అదే దర్శకుడుతో అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ నటిస్తున్న సినిమా ఇది. గ్రామీణ కథాంశంతో థ్రిల్లర్ మూవీగా రూపుదిద్దుకుంది. ఈ సినిమా ట్రైలర్ చూసి సినిమాపై విపరీతమైన హైటు వచ్చింది. రేపు 17వ తేదీన రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కూడా థ్రిల్లర్ సినిమాల్లాగే కనిపిస్తున్నాయి. మరి అందులో వాటన్నిటినీ దాటుకొని మంగళవారం సినిమా మీదే ఎక్కువగా క్రేజ్ ఉంది.

Mangalavaaram-movie-making

మంగళవారం సినిమా మేకింగ్ వీడియో ని రిలీజ్ చేశారు చిత్ర బృందం వాళ్ళు. ఈ మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేకింగ్ వీడియోలో ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక ఇల్లు మంటలు అంటిస్తున్నట్టు.. అలాగే ( Mangalavaaram Movie Making Video Viral ) అమ్మవారి జాతరలు ఇక ఆ జాతరలైతే ఎంత నాచురల్ గా గ్రామీణ ప్రాంతాల్లో ఎలా జరుగుతాయో చూపించాడు. ఇక ఈ సినిమా స్టోరీని పాయల్ రాజ్ పుత్ వినేటప్పుడు.. ఆమెకు నిజంగా నాలుగైదు సార్లు అది విని ఆమె శరీరమంతా ఒకలాగా గగుర్పాటు వచ్చిందంట. ఆ కథ అలా ఉందని ఆమె చెప్పుకొచ్చింది.

See also  Siddharth-Kiara: సిద్ధార్థ్ మల్హోత్రా కియారా అద్వానీల పెళ్లి ఆగిపోవడానికి కారణం అదేనా?

Mangalavaaram-movie-making-video-payal-rajput

ఇక మేకింగ్ షాట్ చూస్తూ ఉంటే నీటిలో దూకుతున్న షాట్స్ చాలా కష్టపడి తీసామని దర్శకుడు చెప్పుకొచ్చాడు. నీళ్లలో మనుషులు ఒరిజినల్ గా దూకడం కాకుండా చివరికి కెమెరాను కూడా నీళ్లలోకి పంపించాల్సి వచ్చిందని.. అంత ( Mangalavaaram Movie Making Video Viral ) నేచురల్ గా అంత బాగా తీశామని.. దానికి చాలా కష్టపడ్డామని దర్శకుడు చెప్పుకొచ్చాడు. అలాగే దర్శకుడు రొమాంటిక్ సీన్స్ ని ఎలా చేయాలో కూడా చూపించిన మేకింగ్ షాట్స్ ని రిలీజ్ చేశారు. పాయల్ రాజ్ పుత్ తడిచిన తలతో తడిచిన డ్రెస్ తో కనిపించగా.. దర్శకుడు ఆ షాట్ లో వాళ్ళందరూ నటించిన నటనకి పొగుడుతూ మాట్లాడిన మాటలు చూపించారు.

See also  Nayanthara : అర్ధరాత్రి నడిరోడ్డు పై అలా నయనతార.. వీడియో వైరల్!

Mangalavaaram-movie-making-video

ఈ సినిమాలో రెండు మూడు ఎకరాల్లో మంటలు మండించి చాలా రిస్క్ గా తీశారు అంట. అలాగే షూటింగ్ తీసే టైములో చాలా కష్టాలు పడ్డామని, విపరీతమైన సమ్మర్లో కూడా ఎంతో కష్టపడి చేశామని, ఈ సినిమాలో పాయల్ రాజ్ చాలా బోల్డుగా, చాలా ధైర్యంగా నటించిందని చెప్పుకొచ్చారు. అలాగే ఎకరాల ఎకరాల భూముల్లో మంటలు మండించి.. ఆ రియల్ మంటల్లో ఆర్టిస్టులు పరుగు పెడుతుంటే ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా కూడా.. ఆ ఆర్టిస్టులకు ఏమైనా అయ్యే అవకాశం ఉందని.. అలాంటి రిస్కులను కూడా బేర్ చేశామని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో ఉన్న థ్రిల్లింగ్ విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని నటీనటులు చెప్పుకొచ్చారు. అలాగే సినిమా మొత్తాన్ని అక్కడక్కడ టచ్ చేస్తూ చాలా మేకింగ్ సీన్స్ ని చూపించడం జరిగింది. పాయల్ రాజ్ పుత్ మంచం మీద పడుకుని ఉండగా చేసిన మేకింగ్ సీన్స్ కూడా చూపించారు. అలాగే నీటిలో మనుషులు దూకి అందులో కెమెరామెన్ కూడా కెమెరాతో సహా నీటిలో దూకి చూపించిన కొన్ని సీన్స్ మాత్రం అందరికీ నచ్చి ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.