Lavanya Tripathi : గత కొంతకాలంగా లావణ్య త్రిపాఠి గురించి విపరీతంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంతకు ముందు లావణ్య త్రిపాఠి గురించి హీరోయిన్గా ఒక ప్రాముఖ్యత ఉండేది తప్పా.. ఆమె గురించి పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఎప్పుడైతే మెగా కుటుంబానికి కోడలు కాబోతుంది అన్న విషయం బయటపడిందో.. అప్పటినుంచి ( Lavanya Tripathi reception saree ) ఆమె గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వస్తూనే ఉంది. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్.. మిస్టర్ సినిమాతో పరిచయం ఏర్పడి.. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం పెరిగి.. ప్రేమగా మారి ఈరోజు పెళ్లి చేసుకొని జంట అయ్యే దగ్గర వరకు ప్రయాణం చేశారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమ ఎప్పటినుంచో మొదలైందని.. వీళ్లిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో ఉందని అభిమానులు ఎంత చెప్పినా కూడా.. వాళ్ళిద్దరూ మాత్రం వాళ్ళ మధ్యన స్నేహం మాత్రమే ఉందని చెబుతూ తప్పించుకుంటూ ( Lavanya Tripathi reception saree ) వచ్చారు.ఇది సర్వసాధారణంగా ప్రతి సెలెబ్రిటీ సినిమా రంగంలో ప్రేమించుకున్న వాళ్ళిద్దరూ మొదట్లో ఇదే చెప్తారు. ఆ తర్వాత వాళ్లలో వాళ్లు కన్ఫర్మ్ అయిన తర్వాత.. అప్పుడు బయటపడతారు. అలాగే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కూడా వాళ్ళు పెళ్లి చేసుకోవాలని నిర్ధారించుకున్న తర్వాతే.. కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాతే బయటపడడం జరిగింది.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల ప్రేమ ఇటలీలోనే మొదలైందంట. అందుకే అక్కడే పెళ్లి చేసుకోవాలి అని.. వాళ్ళిద్దరూ దంపతులు అవ్వాలని తలచుకొని.. ఆ ప్రకారంగానే పెళ్లి చేసుకోవడం జరిగింది. దానికి మెగా కుటుంబం నుంచి ( Lavanya Tripathi reception saree ) అందరూ ఒప్పుకొని ఎంతో వైభవంగా, ఆనందంగా, సరదాగా ఈ పెళ్లిని చేయడం జరిగింది.ఇటలీలో మూడు రోజులు పాటు జరిగిన ఈ పెళ్లిలో మెహందీ, హల్ది , కాక్ టెయిల్ పార్టీ అన్ని చేసుకొని, పెళ్లి కూడా చేసుకొని హైదరాబాద్ తరలి వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కి సినీ రంగం నుంచి ఎందరో, ఇంకా రాజకీయ రంగం నుంచి కూడా ఎందరో రావడం జరిగింది.
ఎంతో కళకళలాడుతూ వైభవంగా జరిగిన ఈ రిసెప్షన్లో.. లావణ్య త్రిపాఠి కట్టుకున్న చీర హైలెట్గా నిలిచింది. ఈ చీరను చూసిన చాలా మంది ఈ చీర ఇంతకు ముందు ఎక్కడో చూసామని అనుకున్నారు. ఆల్రెడీ ఒక ఈవెంట్లో ఈ చీరని సుహానా కట్టుకుంది. షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఆల్రెడీ ఒకసారి ఈ చీర కట్టుకోవడం జరిగింది. లావణ్య.. సుహానా ఖాన్ కట్టుకోగా ఆ చీర చాలా నచ్చిన లావణ్య త్రిపాఠి అదే డిజైన్తో కావాలని చేయించుకుంది. ఈ చీరను మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. అయితే ఈ చీర ఖరీదు 3 లక్షల 75 వేల రూపాయలు అయింది అంట. కేవలం రిసెప్షన్ కట్టుకునే చీర మూడు లక్షల 75 వేల రూపాయలు పెట్టి కొన్నాది. అంటే మెగా కోడలా మజాకా అని అందరూ అనుకుంటున్నారు.