
Sreeleela : ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళు కాల్షీట్స్ కోసం అందరూ వెయిట్ చేస్తారు. డిమాండ్ ఉన్న హీరో లేక హీరోయిన్ ఎవరైనా కూడా వాళ్ళు కాల్షీట్ ఇస్తే చాలు.. సినిమా ( Sreeleela Cheated Vijay Devarakonda ) ప్రాజెక్ట్ అంతా నడిపించొచ్చు అన్నంత క్రేజ్ కూడా ఉంటుంది. కొందరు హీరోయిన్స్ అందరికీ కాల్ షీట్స్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఖాళీ లేదని డేట్లు ఖాళీ లేవు అని చెప్పి వాటిని వదిలేస్తూ రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి క్రమంలోనే రష్మిక మందన్నా కూడా కొంతమంది హీరోలకి కాల్షీట్ ఇచ్చి ఆ తర్వాత ఖాళీ లేదని ఆ సినిమాలు చేయనవి కూడా ఉన్నాయి.
ఆ లిస్టులోకి ఇప్పుడు శ్రీలీల కూడా చేరింది. శ్రీలీల డిమాండ్ ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆమె చేతిలో దగ్గర 12 సినిమాలు ఒప్పుకొని ఉన్నాయని అంటున్నారు. ఇదే నిజమైతే ఆమె ఎంత బిజీ అనేది ఊహించుకోవచ్చు. అయితే ఇలాగే ఆమె విజయ్ దేవరకొండ తో కలిసి సినిమా నటిస్తానని మాట ( Sreeleela Cheated Vijay Devarakonda ) ఇచ్చిందంట. అయితే ఆ సినిమా కోసం విజయ్ దేవరకొండ వేరే హీరోయిన్ కూడా రిజెక్ట్ చేసి కేవలం శ్రీలీల కావాలని తీసుకున్నాడు అంట. తీరా ఇప్పుడు చూస్తే శ్రీలీల నాకు ఖాళీ లేదు చేయడం అవ్వదు అంటుందంట. దీంతో విజయ్ దేవరకొండ మరి ఎలా ఫీల్ అయి ఉంటాడో చూడాలి. విజయ్ దేవరకొండ హీరోగా, విజయ్ తిన్నూరి దర్శకత్వంలో రూపొందిన సినిమాకి శ్రీలీల హ్యాండ్ ఇచ్చిందట.
దీనితో శ్రీలీలకి బాగా పెరిగింది.. స్టార్ హీరోలను సైతం రిజెక్ట్ చేస్తుంది అని కామెంట్ చేస్తున్నారు. మరి ఆమె రిజెక్ట్ చేయడం వెనుక ఏముంది అనేది అందరికీ అర్థం కాదు. టైం బాగున్నపుడు.. కలిసివచ్చే టైంలో సంపాదించేసుకోవాలి, చక్కదిద్దుకోవాలని అందరికీ ఉంటుంది. అలాగే మరి ఆమె ఒప్పుకున్న ప్రాజెక్ట్లో .. ఆమె ( Sreeleela Cheated Vijay Devarakonda ) రెమ్యునిరేషన్ ఎంత ఉంటుందో.. ఆమె రిజెక్ట్ చేసింది దానికి ఎంత తేడా ఉంటుందో అనేది మనకు తెలియదు కదా.. ఏదైనా ఎవరు లాభం కోసం వాళ్ళు నచ్చిన నిర్ణయాన్ని తీసుకోవడం అనేది చాలా సహజం. మరి ఈ విషయంలో విజయ్ దేవరకొండ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది అభిమానులు అనుకుంటున్నారు.
గత కొంతకాలంగా విజయ్ దేవరకొండకి బ్లాక్ బస్టర్ లేకపోయినప్పటికీ ఖుషి సినిమాతో కొంత ఆయన అభిమానులకు ఖుషి వచ్చింది. ఆ సినిమా కొంతవరకు మంచి పేరు సంపాదించుకుంది. ఇకనుంచి విజయ్ దేవరకొండకి జోష్, మంచి రోజులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అని ఆయన అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. మరి వాళ్ళ నమ్మకం ప్రకారమే విజయ్ దేవరకొండ కి శ్రీలీల నో చెప్పినా కూడా ఆ ప్రాజెక్టులో అంతకంటే గొప్ప హీరోయిన్ వచ్చి అతనికి సక్సెస్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే శ్రీలీల తను బిజీగా ఉన్నా కూడా చేయని అనుకుంది కానీ.. చేయడానికి అవకాశం లేనప్పుడు ఏం చేస్తది అని ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు.