Home Cinema Rambha: ఆ ఒక్క తప్పు చేయడం వల్లే హీరోయిన్ రంభ కెరీయర్ మొత్తం నాశనమయ్యిందా.? అప్పుల...

Rambha: ఆ ఒక్క తప్పు చేయడం వల్లే హీరోయిన్ రంభ కెరీయర్ మొత్తం నాశనమయ్యిందా.? అప్పుల పాలయ్యిందా.?

Rambhas Career: అలనాటి స్టార్ హీరోయిన్ అచ్చ తెలుగు ఆడపిల్ల రంభ గురించి ప్రత్యేకించి పరిచయాలు అవసరం లేదు. తొంభై వ దశకంలో తన నటనతో ఎంతగానో అలరించి అందరిని ఆకట్టుకుంది. స్టార్ హీరోల చెంత చిందులేసుంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది రంభ. మన తెలుగు అమ్మాయి అయినప్పటికీ రంభ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది మాత్రం స్వర్గం అనే మలయాళ చిత్రంతో హీరోయిన్ గఘ తన సినీ కెరియర్ ను కొనసాగించింది. ఇదే చిత్రం సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో ఆ తర్వాత రంభకు వరుసగా సినిమా అవకాశాలు లభించ సాగాయి. ఇక ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమంలో కూడా రంభ వరుస సినిమాలో అవకాశాలు రాసాగాయి. అలా తెలుగులో తను తొలి సారిగా నటించిన చిత్రం రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు. ఈ చిత్రం ద్వారానే రంభ తెలుగు సినీ పరిశ్రమ కు పరిచయమైంది. ఈ చిత్రం కూడా అప్పట్లో మంచి ఘన విజయానికి కైవసం చేస్తుంది.

See also  Khushi: ఖుషి సినిమాలో ఆ హీరోయిన్ ని తప్పించి సమంతని ఎందుకు పెట్టారో తెలిస్తే అయ్యయ్యో అంటారు.

Rambhas Career

అలా వరుస సినిమాల్లో నటిస్తున్న తరుణంలో ముద్దుల ప్రియుడు చిత్రంతో రంభ క్రేజ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఇక క్రేజ్ అనంతరం మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున వంటి స్టార్ హీరోలతో చిందులేసే అవకాశం లభించింది. అలా కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ భాషలలో ఎన్నో చిత్రాలలో ఆడి పాడింది. ఆ తర్వాత బాలీవుడ్ లో సైతం పలు చిత్రాల్లో నటించింది రంభ. ఆ తర్వాత కెరియర్ ముగుస్తున్న సమయంలో రంభ చేసిన తప్పు వల్ల ఆమె కెరియర్ మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 2003 వ సంవత్సరంలో రంభ సినీ గ్రాఫ్ మొత్తం పూర్తిగా డౌన్ అయిపోయింది.

See also  Kalki 2898 AD : ప్రభాస్ సినిమా కల్కి లో రామ్ చరణ్.. ఆ క్యారక్టర్ లో..

rambhas-entire-career-as-a-star-heroine-was-ruined-because-of-that-one-mistake-stuck-in-debt

చేతిలో ఒక్క చిత్రం కూడా లేదు.. అవకాశాల ఊసే లేదు.. దాంతో ఏం చేయాలో తెలియక మళ్లీ ఎలాగైనా ఫామ్ లోకి రావాలని ఆశపడ్డ రంభ తనే ఓ చిత్రాన్ని స్వయంగా నిర్మించి అందులో నటించాలని ఆలోచించిందట. అందులో భాగంగానే తమిళంలో త్రీ రోజెస్ అనే ఓ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది. ఇక ఈ చిత్రంలో రంభతో పాటు జ్యోతిక మరియు లైలా ప్రధాన పాత్రలను పోషించగా యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కింది. ఈ చిత్రం ను నిర్మించడానికి తను ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఇళ్ళునే అమ్మవలసి వచ్చింది.

3 Roses Movie Rambha Laila Jyothika

అయితే త్రీ రేజెస్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవడంతో భారీ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఆ ఒక్క తప్పు చేయకుంటే రంభ లైఫ్ వేరేలా ఉండేది. ఇక అప్పుల బాధ తట్టుకోలేక ఒత్తిడి భరించలేక తను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు ని కూడా అమ్మేసింది. అయినప్పటికీ రంభకు ఇంకా అప్పులు తీరలేదు. దాంతో అడపాదడపా వచ్చే అవకాశాలతో సర్దుకుంటూ పలు చిత్రాలు ఐటెం సాంగ్స్ కూడా చేసి అప్పు తీర్చింది. అలా ఇన్నేళ్లు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి సంపాదించుకున్న ఆస్తి అంతా ఒక్క సినిమాతో పోగొట్టుకుంది. ఇక కెరీయర్ పూర్తిగా డౌన్ ఐన సమయంలో 2010 సంవత్సరంలో చెందిన వ్యాపారవేత్త ఇంద్ర కుమార్ ను పెళ్లాడింది. ఆ తర్వాత నటనకు పూర్తిగా బై బై గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది రంభ (Rambhas Career) తనకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు.