Home Cinema నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రోడ్యూసర్ గా నిర్మించినటువంటి సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇళ్ళు తాకట్టు...

నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రోడ్యూసర్ గా నిర్మించినటువంటి సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇళ్ళు తాకట్టు పెట్టాడా.?

YS Rajasekhar Reddy: మనందరికీ ఈ విషయం తెలియందుకు కాదు.. రాజకీయ నాయకులందరూ తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు అనేది నిర్మించడం కొత్తేమి కాదు. గతంలో ఎందరో ఎందెందరో సినిమాలు నిర్మించి సూపర్ డూపర్ బంపర్ హిట్స్ లు కైవసం చేసుకున్నాడు. అలాగే అలనాటి ఆంద్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజ్ శేఖర్ రెడ్డి కూడా అప్పట్లో పలు చిత్రాలకు పెట్టుబడి దారుడిగా, పంపిణీ దారుణిగా మరదేవిధంగా నిర్మాతగా కూడా పలు చిత్రాలు కూడా నిర్మించసాగాడు.  ఐతే ఆయన తనయుడు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్ట ముఖ్యమంత్రి వై యస్ జగన్ కి ఆ రోజుల్లో..

did-the-then-chief-minister-ys-rajasekhar-reddy-mortgage-the-houses-after-the-disaster-of-a-movie-produced-as-a-producer

సినిమాలు అంటే ఎంతో మక్కువ ఎక్కువ ఉండేది. జగన్ అప్పట్లో నందమూరి బాలకృష్ణ కు వీరభిమాని.. అంతే కాకుండా అప్పట్లో వై.యస్ జగన్  నందమూరి బాలకృష్ణ కడప జిల్లా ప్రెసిడెంట్ గా కూడా పనిచేసారు. అప్పట్లో నందమూరి బాలకృష్ణ చిత్రం విడుదల ఐనప్పుడుల్లా భారీ కటౌట్లతో ప్లేక్సీలు కొట్టించి మరి థియేటర్ మొత్తం నింపేసేవాడట. అప్పట్లో బాలయ్య ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా వై ఎస్ జగన్ గారు వ్యవహరించినప్పుడు అప్పట్లో పేపర్స్ యాడ్స్ కూడా వేసినట్టుగా సోషల్ మీడియా లో సైతం ఎన్నో రకాల ప్రచారాలు వైరల్  అయ్యాయి. ఇదంతా కూడా బాలయ్య మీద అభిమానంతో అప్పట్లో

See also  Payal Rajput: నాకు దక్కాల్సిన అవకాశాన్ని కీర్తీ సురేష్ కొట్టేసిందటూ పాయల్ సంచలమైన వాఖ్యలు..

did-the-then-chief-minister-ys-rajasekhar-reddy-mortgage-the-houses-after-the-disaster-of-a-movie-produced-as-a-producer

జగన్ ఓ చిత్రాన్ని సైతం కొనుగోలు కూడా చేసాడంట. ఇక ఆ చిత్రం మరేదో కాదు, ఆ చిత్రమే సీమ సింహం. ఇక ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి జగన్ తన తండ్రితో గొడవపడి మరీ ఆ చిత్రాన్ని కొనుగోలు చేసాడట. కానీ తీరా చూస్తే ఆ చిత్రానికి మొదటి రోజు నుండే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుని అతి పెద్ద ఫ్లాప్ అయ్యింది. రాయలసీమ ప్రాంతమంతా అంతా మొత్తం కలిపి ఆ చిత్రం యొక్క రన్నింగ్ పూర్తయ్యాక ఒక్క రూపాయి కూడా మిగల లేదు. దీంతో రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) గారు అప్పుల పాలవ్వడంతో తన భవనాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తీర్చాల్సి వచ్చిందట. కాగా ఆ తర్వాత మళ్ళీ ఇక ఆ కుటుంబం మొత్తం సినిమాల వైపే చూడలేదట.

See also  Rashmika Mandanna : రష్మిక కు ఇంతటి అవమానం తట్టుకోవడం కష్టమే..

did-the-then-chief-minister-ys-rajasekhar-reddy-mortgage-the-houses-after-the-disaster-of-a-movie-produced-as-a-producer

కానీ ఆ తర్వాత చాలా రోజులకు వై.ఎస్ రాజ శేఖర్ రెడ్డి గారి కూతురు వై.ఎస్ షర్మిల యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ ని హీరోగా పెట్టి యోగి అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం సైతం అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కాగా ఈ చిత్రం ఈ నెల 18వ తారీఖున రెండు తెలుగు రాష్ర్టాలలో రీ రిలీజ్ అవ్వబోతుంది, చూద్దాం ఎలా రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇటీవల ఈ మధ్య రీ రిలీజ్ చిత్రాలు చాలా మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. ఈ చిత్రం కూడా మంచి కలెక్షన్లు వసూళ్ళు చేయ్యాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు.