ఆరోగ్యానికి అద్బుతాల గని కివీ పండు — యాపిల్ కంటే ఐదు రెట్లు మిన్న
మనకు ప్రతి పండు ఆ ప్రకృతి ప్రసాదించిన ఓ వరమనే చెప్పాలి ఎందుకు అంటే కొన్ని పండ్లు వాతావరణానికి అనుకుణంగా పండుతాయి అవి ఖచ్చితంగా తినాలి అప్పుడే వాతావరణానికి తగినట్టుగా మన శరీరం కూడా ఉంటుంది అలాగే ఆ పండ్ల నుండి మన శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. మరి అదే 27 పండ్లలోని పోషకాలు ఒకే పండులో దొరికితే.? వాతావరణానికి సంబందం లేకుండా 365 రోజులు మనకు లభిస్తే.? డాక్టర్లు సైతం ఈ పండును వండర్ ఫ్రూట్ అని పిలుస్తారు అదే కివీ ఫ్రూట్.! మరి ఈ పండు ఎందుకు ఇంత ప్రత్యేకత.? తెలుసుకుందాం చలో….
ఆరింజ బత్తాయి మరియు ఆపిల్ లాంటి పండ్ల కంటే ఇందులో విటమిన్ సి అధిక మోతాదులో ఉంది.
ఆపిల్ కంటే ఎక్కువ పోషకాలు ఇందులో కలిగి ఉంది, అవి విటమిన్ సి, విటమిన్ ఈ, పొటాషియం, ఫోలిక్ ఆసిడ్, యాంటీ ఆక్సిడెంట్ లు మొదలైనవి ఎక్కువగా ఉన్నాయి.
కివి పండు తింటే మన శరీరానికి సమతుల్యమైన ఆహారం అందినట్టే.
రక్తనాళాల్లో రక్తం సరఫరాకు ఆటంకాలు ఏర్పడితే అలాంటి వారు కివి పండు తినడం వలన రక్తనాళాల్లో రక్తం సరఫరా మెరుగవుతుంది.
రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గించడానికి ఈ పండులో ఉండే విటమిన్స్ బాగా ఉపయోగపడే కంట్రోల్ చేస్తాయి.
మలబద్ధక సమస్యలు ఉన్నవాళ్లు కివి పండు తినడం వల్ల ఇందులో ఉండే పిండి పదార్థం మలబద్దకాన్ని దూరం చేయడంలో ఎంతో సహాయపడుతుంది.
ఈ పండ్లను ఎక్కువగా తినడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయటమే కాకుండా సుఖ విరోచనాలు అవుతాయి.
కంటి చూపులు మెరుగుపరచడమే కాకుండా కంటి సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
వయసు పెరగడం వల్ల వచ్చే కణాల క్షీణతను ఈ పండు తగ్గిస్తుంది