Tollywood: సినిమా రంగం అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో ఉన్న నటీనటులు అందరిపై ఎన్నో వార్తలు వస్తూనే ఉంటాయి. అందులో చాలా రూమర్స్ కూడా ఉంటాయి. ఆ రూమర్సే ( These Tollywood actresses were ) ఒక్కొక్కసారి నిజం కూడా అవుతూ ఉంటాయి. కొన్ని నిజమైన వార్తల్లా అనిపించినా.. అవి చివరకు రూమర్సు గానే మిగిలిపోతాయి. పలానా హీరో హీరోయిన్ ప్రేమించుకుంటున్నారని.. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందని ఎన్నో వార్తలు వస్తాయి. కానీ నిజానికి కొంతకాలానికి.. చూస్తే అసలు వాళ్ళిద్దరి జీవితాల్లో ఒకరితో ఒకరికి కనెక్షన్ ఉండదు. ప్రొఫెషనల్ గా తప్ప పర్సనల్గా కనెక్షన్ లేకుండా మిగిలిపోతారు. అలాగే కొందరు మీద ఊరికినే కావాలని రూమర్ క్రియేట్ చేస్తే..
మొదటిది నిజం కాదనుకుంటే చివరికి వాళ్ళిద్దరూ మేము ప్రేమించుకుంటున్నాము అని పెళ్లి చేసుకుంటున్నామని ఏదో పరమైన నిజమైన వార్త బయటకు వస్తాది. అలాగే టాలీవుడ్ లో కొందరు హీరోయిన్స్ కొందరు ( These Tollywood actresses were ) హీరోలతో ఎఫైర్ ఉందంటూ.. ఎన్నో వార్తలు మనం వింటూ ఉంటాం. అందులో కొన్ని నిజాలు ఉంటాయి.. అలాగే కొన్ని అపోహలు ఉంటాయి. కొన్ని కావాలని రూమర్స్ సృష్టిస్తారు కూడా.. అయితే అసలు ఏ ఏ హీరోయిన్స్ కి ఎవరితో ఎఫైర్ ఉందని రూమర్స్ వచ్చాయో.. అసలు అందులో ఎంతవరకు నిజం ఉందో ఒకసారి తెలుసుకుందాం.. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార.. నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అయిన ప్రభుదేవాని ప్రేమించిందని ఎన్నో వార్తలు వచ్చాయి.
వీళ్లిద్దరూ ఒకరి ప్రేమలో ఒకరు పడినప్పటికీ.. అప్పటికే ప్రభుదేవా పెళ్లైనవాడు అయినా.. వీళ్ళ ప్రేమ పబ్లిక్ కాకుండా ఉండలేకపోయింది. ప్రభుదేవా భార్యను వదిలేసి మరీ నయనతారను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడని వార్తలు ( These Tollywood actresses were ) కూడా వచ్చాయి. కానీ ప్రభుదేవా భార్య కోర్ట్ లో కేసెయ్యడం కూడా జరిగింది. ఇలాంటి కారణాల వలన నయనతారకి ప్రభుదేవా దూరం అవ్వాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. ఇవన్నీ అప్పట్లో బాగా హల్చల్ చేశాయి. అలాగే కొందరు హీరోయిన్స్ వాళ్లకి ఏ డైరెక్టర్ అయినా సూపర్ హిట్ ఇస్తే ఆ డైరెక్టర్ ప్రేమలో పడే అవకాశాలుంటాయి. అలాగే ఛార్మి కృష్ణవంశీ ప్రేమలో పడిందని తెగ వార్తలు వచ్చాయి.
చార్మి వలన కృష్ణవంశీ, రమ్యకృష్ణ మధ్య కూడా గొడవలు వచ్చాయని కూడా అన్నారు. అయితే ఆ తర్వాత చార్మి పూరి జగన్నాథ్ తో సెట్ అయిపోయింది అని అంటారు. పూరి జగన్నాథ్ భార్యకి విడాకులు కూడా ఇస్తాడు అని కూడా ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. అలాగే అనుష్క సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తల్లో నాగార్జునతో ఎఫైర్ ఉందని అనేవారు. అప్పటికే నాగార్జునకి మొదటి పెళ్లి అవ్వడం.. ఆమెతో విడాకులు తీసుకోవడం.. రెండో పెళ్లి అమలతో జరిగినా కూడా అనుష్కతో ప్రేమలో ఉన్నాడని.. వీళ్ళిద్దరి మధ్యన ఎఫైర్ నడుస్తుందని.. ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అది నిజమని మాత్రం తేలలేదు. ఇలా మన టాలీవుడ్ లో హీరోయిన్స్ కొందరు పెళ్లయిన స్టార్ హీరోలతో ఎఫైర్ ఉందంటూ ఎన్నోసార్లు రూమర్లు వచ్చాయి కానీ.. అందులో చాలా వరకు నిజాలు కాకుండానే మిగిలిపోయాయి.