మెరుగైన ఆరోగ్యం కోసం తప్పకుండా తినవలసిన ఐదు సూపర్ ఫుడ్స్ ఇవేనట.!
మనం నిండు నూరేళ్లు హాయిగా బతకాలంటే ముందు మన ఆరోగ్యం మంచిగా ఉండాలి. ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలి అప్పుడే మనం హాయిగా జీవించగలుగుతాం. మరి అలా అంటే ఆరోగ్యకరమైన జీవితం పొందాలంటే మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవన శైలి కూడా ఉండాలి. ముఖ్యంగా మన ఆహారం పోషక విలువలతో పుష్టికారంగా ఉండేలా చూసుకోవాలి కదా. ఇలాంటి పౌష్టికరమైన ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరంలోని రోగం నిరోధక శక్తి చాలా చురుగ్గా ఉంటుంది.
చాలామంది చాలా రకాల డైట్స్ చేస్తూ ఉంటారు. రకరకాల సీజన్లో రకరకాల వ్యాధులు మన దరి చేరుతుంటాయి అలాంటి వాటిని మన దరిచేరకుండా ఉండాలంటే రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు కొందరు ఖరీదైన ఫుడ్ తీసుకుంటూ మేము ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటారు. మీ శరీరాకృతిని మార్చుకోవడానికి ఖరీదైన ఫుడ్ కాకుండా పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
శరీరానికి మంచి పోషక విలువలు అందించే ఐదు రకాల ఆహార పదార్థాలు మీకోసం
1. వంటలో వాడే నూనెలు :
నిత్యం మనం ఏ వంటలు వండాలన్న అందులో వాడేది వంటనూనెలు, ఆ వంటనూనెలు ముఖ్యమైనవి. మీరు మీ ఆరోగ్యం ఎల్లప్పుడూ ఆరోగ్యవంతంగా ఉండాలంటే నూనెలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. మార్చడం అంటే వాడే బ్రాండ్ లను కాదు, పదే పదే మరిగించి అదే నూనే వాడకూడదు అలా వాడడం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా వంటల్లో వాడడానికి ఉపయోగించే నూనె పల్లినూనె, ఆలీవ్ నూనె, ఆవ నూనె మొదలైనవి వాడవచ్చు.
2. తృణధాన్యాలు:
మన శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం అలాంటి ప్రోటీన్ మెండుగా ఉన్నది తృణ ధాన్యాల్లోనే. మీరు మీ డైట్ లో భాగం గా మొలకలు తినడం ఉత్తమం. ఇవే కాకుండా నానబెట్టిన పప్పు ధాన్యాలు తినడం మంచిది.
3. రొట్టెలు:
మనం రొట్టెలు అనగానే గోధుమ రొట్టెలే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం. గోధుమ రొట్టెలు మాత్రమే కాకుండా వారితోపాటు రాగులు, సజ్జలు, జొన్నలు మొదలగునవి తినడం చాలా ఉత్తమం. గోధుమ రొట్టెలు చేయడం సులభం జొన్న రొట్టెలు సజ్జలతో రొట్టెలు చేయడం చాలా కష్టం అందుకోసమే మీరు గోధుమపిండిలో తగు పాలలో జొన్నపిండి లేదా సజ్జల పిండి కలుపుకొని రొట్టెలు చేసి వాటిని తినండి.
4. కూరగాయలు మరియు సీజనల్ ఫ్రూట్స్:
మీరు పరిపూర్ణమైన ఆరోగ్యం పొందాలంటే ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో కచ్చితంగా తినాలి ఎందుకంటే వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా మనకు ఆయా కాలంలో ఆయా పండ్లు లభిస్తాయి వాటిని తినడం వల్ల ఆ వాతావరణానికి మన శరీరం వాతావరణానికి తగ్గట్టుగా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కూరగాయలు కూడా తినాలి. ఇలా తినడం వల్ల మన శరీరంలో ఏర్పడే మార్పులను కట్టడి చేయొచ్చు.
5. పాలల్లో పసుపు:
పసుపు అంటేనే మనకు రోగ నిరోధక శక్తిని మన శరీరానికి చేకూర్తుంది. దయచేసి వాళ్లు మాత్రం తప్పనిసరిగా పాలల్లో పసుపు కలుపుకొని తాగండి దానివలన మనకు కావలసినంత కాల్షియం అందుతుంది. పాలల్లో పసుపు కలుపుకుని తాగడం వలన మన దరికి ఎలాంటి రోగాలు దాపరించవు.