మన పూర్వీకులనుండే తేనె వాడకం ఎంతో ప్రాచుర్యంలో ఉంది. తేనె అతి పురాతనమైన ప్రాచుర్యం పొందిన ఆయుర్వేద మూలిక కూడా, ఆయుర్వేదంలో తేనెకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఎలాంటి ఆయుర్వేద మూలికలనైనా తేనెతో కలిపి తీసుకుంటే అది మంచిగా పని చేయడమే కాకుండా మంచి ఫలితాన్నిస్తుంది. దీని వలన ఔషదాలు అధ్భుతంగా పనిచేస్తాయి.
సాధరణంగా తేనె ను మనం గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవాలి ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల తేనె కలుపుకుని తాగాలి. ఇలా త్రాగడం వలన చాలా ప్రయోజనాలున్నాయి అవి
తెనెను కలిపిన గోరువెచ్చని నీరు గ్లాస్ త్రాగడం వలన జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకాన్ని ధరిచేరనివ్వద్దు ఇంకా అజీర్తి, గ్యాస్ సంబధిత సమస్యలను దూరం చేస్తుంది. మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధమైన కొవ్వును ఇది కరిగిస్తుంది. ఈ మిశ్రమాన్ని రోజూ తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ర్టాల్ ను కరిగించి గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. రక్తాన్ని శుభ్రం చేస్తుంది.
మరి ఎప్పుడు తాగాలి.? ఉదయం లేదా రాత్రి నా.? ఎప్పుడు తాగితే మంచిదని చాలా మందికి సందేహం ఉండొచ్చు.! అందుకే ఆహర నిపుణులు కొన్ని సలహలు ఇస్తున్నారు. అవేంటో మరిప్పుడు చూద్దామా.?
ఉదయం పరిగడపున తాగితే : గోరువెచ్చని నీటిలో తెనె కలిపిన మిశ్రమాన్ని కలిపి తాగడం వలన రోజంతా ఉత్సాహంగా ఉంటారు, నిస్సత్తువ అనేది లేకుండా చేసి మన శరీరంలోని శక్తి స్థాయిలను పెంచుతుంది. రోజు మొత్తం అసలటగా ఉందని ఫీలయ్యే వాళ్ళు డైలీ పరిగడపున ఇది తాగండి రోజంతా యాక్టీవ్ గా ఉంటారు.
రాత్రి పడుకునే ముందు తాగితే : రాత్రి పడుకునే గంట ముందు ఈ మిశ్రమాన్ని తాగితే మంచి నిద్ర పడుతుంది. నిద్ర లేమి ఉన్న వారికి ఇది ఒక అద్బుతమైన చిట్కా అని సూచించవచ్చు. డాక్టర్ సలహలతో ఏ వయసు వారు ఎంత మితంగా తాగాలి అనేది వారు చెప్పినట్టు వింటూ తగిన మోతాదులో కలుపుకుని తాగండి. దీని వలన ఇతర ఆరోగ్య సమస్యల నుండి పరిష్కారం పొందవచ్చు.