Home Cinema Yatra 2 First Look Poster : యాత్ర 2 పోస్టర్ లో చెప్పకనే చెప్పిన...

Yatra 2 First Look Poster : యాత్ర 2 పోస్టర్ లో చెప్పకనే చెప్పిన కొన్ని డీటెయిల్స్.. రిలీజ్ డేట్ కూడా హింట్ ఇచ్చారు.

yatra-2-movie-first-look-poster-review-and-release-date

Yatra 2 First Look Poster : దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి తెలియని తెలుగువాళ్లంటూ ఎవరూ ఉండరు. ఆయన పరిపాలన విధానం, ఆయన కనిపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజుకి ఏ పేదవాడు మర్చిపోలేడు. ఆరోగ్యశ్రీ అంటూ ఆపదలో అనారోగ్యంతో ఉన్న అందరిని అక్కున చేర్చుకునే ( Yatra 2 First Look Poster ) గొప్ప పథకాన్ని కనిపెట్టిన మహా నాయకుడు. ఆయనపై 2019లో ఆయన యాత్ర పాదయాత్ర ఆధారంగా యాత్ర అనే సినిమాను తీయడం జరిగింది. ఈ సినిమా ఇప్పుడు ఎంతో విజయవంతమైంది. ఆయన మీద ఉన్న అభిమానంతో.. ఆయనని మళ్ళీ కల్లారా చూసిన ఆనందాన్ని కలిగించుకునేందుకు జనాలు తరలి వెళ్లారు.

Yatra2-first-look-poster-details

యాత్ర సినిమా అంత సక్సెస్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్ గా యాత్ర 2 సినిమా తీస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించగా.. వైయస్ జగన్ గారి పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవ నటిస్తున్నారు. యాత్ర సినిమాలో జగన్ పాత్ర అనేది ( Yatra 2 First Look Poster ) కనిపించలేదు కానీ.. ఇప్పుడు యాత్ర 2 లో జగన్ పాత్ర కూడా కనిపించబోతుంది. ఈ సినిమాకి వైయస్ రాజశేఖర్ రెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరి పాత్రలు కనిపించేలా ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసారు.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే రాజశేఖర్ రెడ్డి, జగన్ అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. తండ్రి కొడుకులను మళ్ళీ ఒకచోట చూసినంత ఆనందం కలుగుతుంది.

See also  Mahesh Babu:14 ఏళ్ల వయసులోనే అలాంటి పని చేసిన మహేష్ బాబు పోలీసులకు దొరికిపోయ్యడు.. టాప్ సీక్రెట్ లీక్..

Yatra2-first-look-poster-release-date

యాత్ర సినిమా 2019లో ఫిబ్రవరి 8వ తేదీన విడుదలైంది. అలాగే ఇప్పుడు యాత్ర 2 సినిమాను కూడా 2024 ఫిబ్రవరి 8వ తేదీన సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని ఫిబ్రవరి 8న రిలీజ్ చేసేందుకు అన్ని సిద్ధం చేసుకుంటూ.. మిగిలిన అన్ని పనులను శరవేగంగా పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నారంట. మరి ఇది ఎలక్షన్ కు ముందుగానే సినిమా రిలీజ్ అయితే ఈ సినిమా ప్రభావం ఎలక్షన్ మీద ( Yatra 2 First Look Poster ) ఎలా ఉంటుందో చూడాలి. అంతేకాకుండా అదే డేట్ లో సినిమాలు రిలీజ్ చేసి మళ్లీ సెంటిమెంట్ గా అంత సక్సెస్ సాధించాలని అనుకోవచ్చు. యాత్ర సినిమాని రాజశేఖర్ రెడ్డి గారు తన పాదయాత్రకి ముందు కొంచెం తీసి, ఆ తర్వాత మొత్తం సినిమా అంతా ఆయన పాదయాత్ర మీదే.. అందులో ఆయన ఏమేమి తెలుసుకున్నారు, దానిమీద ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు, ఆ తర్వాత ఆయన గెలవడం, గెలిచిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ సినిమా ఆగిపోతుంది.

See also  Sai Pallavi: తన పై వస్తున్న పెళ్లి వార్తలపై స్పందిస్తూ దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చిన సాయి పల్లవి..

Yatra2-first-look-poster-review

ఆ సినిమాలో ముఖ్యంగా ఆయన పాదయాత్ర ఎలా గడిచింది ఏమి అనేదానిమీద తీశారు. ఇప్పుడు 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా యాత్ర 2 సినిమాని తీస్తున్నారు అంట. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని.. అలాగే ఆయన ఎదుర్కొన్న అనేక సంఘటనలను అన్నిటినీ ఆధారంగా తీసుకొని ఆయన ప్రజల గురించి ఏమీ ఆలోచించి వాళ్ళకి ఏం చేయాలనుకున్న తీరులో ఆయన గెలిచారు అనేది.. ఇలాంటి సంఘటనలతో ఈ సినిమా తీస్తున్నారని వార్తలు వస్తున్నాయి. యాత్ర 2 ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుని.. ప్రజల శ్రేయస్సు కోసం ఎంత మొండిగా అయినా అనుకున్నది సాధిస్తాను అని ఫీల్ కలిగించేలా పోస్టర్ ఉంది.