Home Health WOW. యాలకులతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.?

WOW. యాలకులతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.?

యాలకులతో కలిగే ప్రయోజనాలెన్నో ఎన్నెన్నో…

యాలకులంటే సుంగధ ద్రవ్యాలలో ఒకటి అతి ఖరీదైన వాటిలో ఇవి కూడా ఒకటి, కేజీ ధర వేలల్లో ఉంటుంది. వాటి నాణ్యతను బట్టి కేజీ వెయ్యి నుండి ఆరు వేలకు పైగా ఉంటుంది. యాలకులను ఏలకులు అని కూడా కొన్ని ప్రాంతాల్లో పలుకుతుంటారు. అతి ప్రాచీనమైన కాలం నుండే మన దేశంలో యాలకుల వాడుకలో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా వీటిని పండిచేది మన భారతదేశం.

  • యాలకులను టీ లో వేసి తాగితే మంచి ఉంటుంది. టీ రుచిగా ఉండాలంటే ఈ యాలకులను ఉపయోగించండి
  • ఎన్నో రకాల స్వీట్లు తయారీలో స్వీట్లు యొక్క రుచి అద్భుతంగా రావాలంటే యాలకులను ఉపయోగించాలి.
  • వంటకాలు రుచి సువాసన రావాలంటే కచ్చితంగా యాలకులు లేనిది రుచి రావడం కష్టం.
  • యాలకులలో ఎన్నో రకాల అద్భుతమైన పోషక విలువలు దాగి ఉన్నాయి, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి ఉపయోగపడతాయి.
  • దీని సువాసన ఎంతో గాను ఆకర్షించడం వలన గరం మసాలాలో వంటకాలలో బిర్యానీలలో రకరకాల అయినటువంటి ఆహార పదార్థాలలో వీటిని వినియోగిస్తుంటారు.
  • మూడు శుభ్రంగా ఉండాలంటే రోజు భోజనం తిన్న తర్వాత ఒక మూడు యాలకులను నమిలితే గొప్ప మౌత్ వాషర్ గా ఇది ఉపయోగపడుతుంది.
  • రకరకాల ఫేస్ వాష్ వాడి ముఖాన్ని ఖరాబ్ చేసుకునే దానికంటే యాలకుల నూనె తో ముఖం చాలా అందంగా తయారవుతుంది, లేదా యాలకులను పొడిలాగా చేసుకునే దానిలో తేనెను కలిపి ఆ ప్యాక్ ని ముఖానికి పూసుకుని గంటసేపటి తర్వాత కడుక్కోవాలి అలా చర్మం నిగారింపు అద్భుతంగా ఉంటుంది.
  • పెదాలను మృదువుగా ఉంచడంలో కూడా ఈ యాలకులను ఉపయోగిస్తారు అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు, పాలకులను పొడిగా చేసుకుని వాటికి తేనె కలుపుకొని 15 నిమిషాల పాటు పెదాలపై మరదలు చేసి తర్వాత కడుక్కోవాలి ఇలా చేయడం వల్ల మాటిమాటికి పెదాలు చాలా మృదువుగా మారుతాయి.
  • యాలకులను క్రమం తప్పకుండా తిన్నట్లయితే మన శరీరంలో ఏర్పడ్డ విషపూరిత పదార్థాలను ఇది శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇలా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన చర్మం కూడా ఎంతో తేజస్సుగా ఉంటుంది కామం తప్పకుండా యాలకులను తినండి.
  • ఉబ్బసం వ్యాధితో బాధపడే వారికి యాలకులు ఒక దివ్య ఔషదం అని చెప్పాల్సిందే.
  • యాలకుల ని బాగా నూరి పొడిగా చేసుకొని ఆ పొడిని నుదుటికి రుద్దుకుంటే తలనొప్పి చిటికెలో మాయమైపోయింది.
  • యాలకుల కషాయం సేవిస్తే చిటికెలో దగ్గు మాయమైపోతుంది.
  • దంతాలు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే యలకులను అప్పుడప్పుడు నములుతూ ఉండాలి తద్వారా నోటి దుర్వాసన నుంచి విముక్తి పొందడమే కాకుండా నోరు శుభ్రంగా ఉంటుంది.
  • యాలకులను పొడిగా చేసి దెబ్బలు తగిలిన చోట పెడితే కాయలు త్వరగా మానుతాయి
See also  చిన్న బెల్లం ముక్క ఎంత పనిచేస్తుందో తెలుసా?