ఒకప్పుడు ఒక అబ్బాయి అయినా, అమ్మాయి అయినా సినిమాల్లోకి వెళ్లాలనే ఆశతో హైదరాబాద్ కి వచ్చి అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగే వారు. అలా కాళ్ళు అరిగేలా తిరిగినా అవకాశాలు వస్తాయనే గ్యారంటీ లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారాయి(Dristy Talwar). టాలెంట్ ఉంటే చాలు అదృష్టం తలుపులు తడుతుంది. సోషల్ మీడియా ఆ స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఈమధ్య మేకర్స్ ప్రత్యేకించి ఆడిషన్స్ చేయడం కంటే ఎక్కువగా, ఇంస్టాగ్రామ్ రీల్స్ ని చూసి సరికొత్త టాలెంట్స్ ని తమ సినిమాల కోసం ఎంచుకుంటున్నారు.
ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ ని కూడా అలాగే ఎంచుకున్నారు. ఇదే ఫార్ములా ని ఉపయోగించుకొని మరో ఇంస్టాగ్రామ్ సెలబ్రిటీ ని కూడా సినిమాల్లోకి తీసుకొచ్చి ఆమెని బిజీ ఆర్టిస్టుగా మలిచారు దర్శక నిర్మాతలు. ఆమె మరెవరో కాదు దృష్టి తల్వార్(Dristy Talwar). ఈమె 1998 ఆగస్టు 30 న జన్మించింది. ఇంస్టాగ్రామ్ లో ఎల్లప్పుడూ తనకి సంబంధించిన ఫోటోలను వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉండే ఈమె, నేడు పంజాబీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 2022 వ సంవత్సరంలో ఈమె ‘చొబ్బర్’ అనే చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసింది.
ఆ తర్వాత గత ఏడాది న్యాచురల్ స్టార్ నాని(Nani) హీరో గా నటించిన సూపర్ హిట్ చిత్రం హాయ్ నాన్న లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి చెల్లి గా నటించింది. ఈమెని చూసిన ఆడియన్స్, హీరోయిన్ మృణాల్ కంటే ఈమెనే బాగుందే అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ కూడా వినిపించాయి. అలా తెలుగు ఆడియన్స్ లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈ అమ్మాయిని బిగ్ బాస్ టీం వారు సంప్రదించినట్టు వార్తలు వినిపించాయి. కానీ ఈమెకి సినిమాల్లో వరుసగా ఆఫర్స్ రావడంతో ఆ షో చేయలేనని చెప్పేసింది. ప్రస్తుతం ఈమె పంజాబీ లో 5 సినిమాలు చేస్తుంది.
అలాగే తెలుగు లో ఈమెకి రెండు సినిమాల్లో నటించేందుకు ఆఫర్లు వచ్చాయి. వీటితో పాటుగా యాడ్స్, మధ్యలో ప్రైవేట్ మ్యూజిక్ వీడియోస్ కూడా చేస్తూంటాది. రీసెంట్ గానే ఆమె ‘ఫ్లై’ అనే పంజాబీ పాటలో కలిపించింది. యూట్యూబ్ మరియు ఇంస్టాగ్రామ్ రీల్స్ లో ఈ పాట తెగ వైరల్ గా మారింది. ఒకపక్క మ్యూజిక్ వీడియోస్, మరోపక్క సినిమాలు, ఈ రెండిటిని బ్యాలన్స్ చేస్తూ ఆమె తన కెరీర్ లో దూసుకుపోతుంది.