చిత్రం సినిమా తో సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్ అతి చిన్న వయసులోనే ఒక వెలుగు వెలిగాడు. నువ్వు నేను, మనసంతా నువ్వే ఇలాంటి సినిమాలతో అమ్మాయిల మనసంతా ఉదయ్ కిరణ్ నే ఉండేవాడు. యూత్ ముఖ్యంగా అమ్మాయిలు ఉదయకిరణ్ అంటే ప్రాణం పెట్టేవారు. అలాంటిది సడన్ గా మనందరినీ, తనకిష్టమైన సినిమా ఇండస్ట్రీ ని వదిలి వెళ్లిపోయాడు.
ఏ రంగంలో అయినా పోటీ అనేది ఉంటాది కానీ సినిమా రంగం లో మాత్రం ఒక ఆర్టిస్ట్ కి ఫేమ్ రావడం, పోవడం అన్ని చాలా స్పీడ్ గా అయిపోతూ ఉంటాయి. సక్సెస్ వచ్చినప్పుడు దానిని కాపాడుకోవడం, ఫేల్యూర్ వచ్చినప్పుడు దానిని తట్టుకోవడం మరిచిపోకూడదు. సక్సెస్ లో మనకు పెద్దగా కావాల్సిన వారు కాకపోయినా కూడా మన చుట్టూ ఉంటారు. అదే ఫేల్యూర్ వస్తే మాత్రం, మనకు బాగా అయిన వారు కూడా మన దగ్గర ఉండరు. అదే జీవితం అంటే..
అలాగే ఉదయ్ కిరణ్ కి కూడా ఎంత స్పీడ్ గా సక్సెస్ వచ్చిందో, అలాగే కొంత కాలానికి తనకి ఆఫర్స్ దొరకడం కూడా కష్టం అయిపొయింది. అలాంటి టైం లో తాను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని అందుకే జీవితం గురించి అలాంటి నిర్ణయం తీసుకున్నాడని అనేవారు. ఉదయ్ కిరణ్ కి ఆఫర్స్ దొరకకపోవడానికి సినిమా ఇండస్ట్రీ లో కొందరు పెద్దలు కారణం అని కూడా వార్తలు వచ్చేవి.
ఇప్పుడు ఇంతకాలం తరవాత ఉదయ్ కిరణ్ మరణం గురించి కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక రోజు షూటింగ్ లో ఒక పాము వస్తే, దానిని ఉదయ్ కిరణ్ కొట్టి చంపేశాడని, ఆ పాము శాపం తగిలే అతను సడన్ గా చనిపోయారని అంటున్నారు. అసలు పాము ఎవ్వరిని కాటెయ్యకుండా, కాపాడినందుకు ఏదైనా మంచి జరగాలి గాని అలా ఎందుకు అవుతాదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఉదయ్ కిరణ్ ని మల్లి తేలేము కానీ, ఇలాంటి గాలి వార్తలు వలన ఒకసారి ఆ హీరోని తలచుకోవచ్చు.