Home Cinema Ram Surprise: బేబీ హీరోయిన్ ఇంటికి స్వయంగా రామ్ పోతినేని సర్ ప్రైజ్ గిఫ్ట్. అది...

Ram Surprise: బేబీ హీరోయిన్ ఇంటికి స్వయంగా రామ్ పోతినేని సర్ ప్రైజ్ గిఫ్ట్. అది ఏంటో తెలుసా.?

Ram Surprise: మొదట యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ మంచి గుర్తింపు సాధించుకుంది వైష్ణవి. కానీ ఆ తర్వాత బిగ్ స్క్రీన్ పై కనిపించినప్పటికీ పలు చిత్రాలలో చేసినప్పటికీ కేవలం సైడ్ క్యారెక్టర్ ల వరకే ఆమె పరిమితమయ్యింది. కాగా ఇటీవలే ఆమె నటించిన బేబీ చిత్రంతో వైష్ణవి చైతన్య జాతకం ఒక్క సారిగా మారిపోయింది. ఇక తను హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం బేబీ తోనే కెరియర్ మొదలు పెట్టి తొలి చిత్రంతో సంచలమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని కైవసం చేసుకుంది. ఇక ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అలాగే విరాజ్ అశ్విన్ లు హీరోలుగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.

See also  Prabhas : ప్రభాస్ కాకూండా ఇంకొకరిని భర్తగా ఊహించుకోలేను అంటున్న ఆ స్టార్ హీరోయిన్!

what-will-be-the-surprise-gift-of-ram-pothineni-himself-to-the-baby-heroines-house

మరి ముఖ్యంగా యూత్ లో నుండి ఈ చిత్రానికి భారీ స్పందన లభించింది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా గా ఎవరు ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. చాలా సింపుల్ గా సాదాసీదాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తూ విడుదలైన తొలి వారంలోనే యాభై కోట్ల మార్కును టచ్ చేసిన బేబీ చిత్రం ప్రస్తుతం వంద కోట్ల క్లబ్ లో చేరేందుకు బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. ఇక ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య గురించి మాట్లాడుకోకుండా మాత్రం అస్సలు ఉండలేరు. ఎందుకంటే ఒక యూట్యూబర్ అయిన వైష్ణవి చైతన్య ఇంత అద్భుతంగా నటిస్తుందని ఎవ్వరూ ఊహించను కూడా ఊహించలేదు.

See also  Chay and Sam: పాపం చైతూ..సమంతతో డివోర్స్ తర్వాత వెక్కి వెక్కి ఏడ్చాడంట.. అసలు నిజా నిజాలు వెలుగులోకి..

what-will-be-the-surprise-gift-of-ram-pothineni-himself-to-the-baby-heroines-house

దాంతో ఒక్కసారిగా వైష్ణవి చైతన్య పేరు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. చాలా మంది ఎవరీ వైష్ణవి చైతన్య అంత బాగా నటించిందని ఆమె నటనకు ఫిదా అవుతూ ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం సినీ ప్రియులే కాక సెలబ్రిటీలు సైతం వైష్ణవి చైతన్యకు ప్రశంసలు కురిపించారు. ఇక ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఆమెను ప్రత్యేకంగా అభినందించ సాగాడు. తాజాగా బేబీ మూవీ చూసినటువంటి రామ్ పోతినేని కి సైతం వైష్ణవి చైతన్య యాక్టింగ్ పిచ్చిపిచ్చిగా వచ్చేసిందట. దీంతో ఆమెకు స్పెషల్ కంగ్రాట్యులేషన్ తెలుపుతూ.. రామ్ (Ram Surprise) తాజాగా ఆమెకు ఓ స్మాల్ గిఫ్ట్ తో సర్ప్రైజ్ చేశాడట. మరి ఆ గిఫ్ట్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం..

what-will-be-the-surprise-gift-of-ram-pothineni-himself-to-the-baby-heroines-house

ఒక భారీ ఫ్లవర్ బొకేను వైష్ణవ చైతన్య ఇంటికి పంపి బెస్ట్ విషెస్ తెలియజేశాడు. ఇక రామ్ తన కోసం పంపిన ఫ్లవర్ బొకేతో ఉప్పొంగిపోయిన వైష్ణవి చైతన్య తన ఆనందాన్ని ఆపుకోలేక తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకోగా.. ఈ విషయం ఒక్క సారిగా వైరల్ అయింది. ఈ అందమైన ఫ్లవర్ బొకేతో తనను మరియు బేబీ చిత్ర టీం ను అభినందించినందుకు థాంక్స్ రాము గారు అంటూ వైష్ణవి చైతన్య స్పెషల్ థాంక్స్ చెప్తూ పోస్ట్ పెట్టింది. వైష్ణవి చైతన్య నటించిన తొలి చిత్రంతోనే సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ హీరోలు అందరినీ తన వైపుకు తిప్పుకునేలా చేసుకున్న వైష్ణవి చైతన్యకు ఇక మున్ముందు ఎన్నో మరెన్నో క్రేజీ ఆఫర్లు క్యూ కట్టబోవడం ఖాయం అనిపిస్తుందని భావిస్తున్నారు సినీ ప్రియులు.