Navaratri : ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రతి ఇంట, ప్రతి వీధిలో, దేశమంతటా కూడా నవరాత్రుల ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ నవరాత్రులని శరన్నవరాత్రులను అని కూడా అంటారు. ఇంకా దసరా నవరాత్రులు అని ( Navaratri nine days for God’s grace ) కూడా అంటారు. ఈ నవరాత్రులని జరుపుకునే క్రమంలో అందరూ కూడా భక్తిశ్రద్ధలతో ఆ అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో అలంకరించి, పూజించి అమ్మవారి కృప కోసం ఆమెను వేడుకుంటారు. ఈ తొమ్మిది రోజులు భారతదేశం మొత్తం ఎంతో ఆనందంగా అమ్మవారిని పూజించే క్రమంలో వాళ్ల పరిస్థితిని బట్టి.. సమయాన్ని, డబ్బుని ఖర్చు చేస్తారు.
ఈ సంవత్సరం 15వ తారీకు అక్టోబర్ నుంచి శరన్నవరాత్రులు మొదలయ్యాయి. ఈ తొమ్మిది రోజులు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని పనులు చేయకూడదు. అవి చేయడం వలన లేనిపోని దరిద్రం జీవితంలో చుట్టుకుంటుంది. దరిద్రం ( Navaratri nine days for God’s grace ) అంటే కేవలం డబ్బు లేకపోవడం మాత్రమే కాదు. మన మనసుకి బాధను కలిగించేవి. మన జీవితంలో కావాలనుకునేవి దూరమై పోవడం.. ఇలా ఎవరి జీవితానికి అనుగుణంగా వాళ్ళకి ఏది కష్టంగా, బాధగా అనిపిస్తుందో అదే జరగడం కూడా జరగొచ్చు. అందుకే మన పూర్వీకులు శాస్త్రం ప్రకారం ఈ తొమ్మిది రోజులు కొన్ని పనులు అసలు చేయకూడదని పెద్దలు చెప్తున్నారు. ఇంతకీ అవి ఏమిటో తెలుసుకుందాం..
ఈ తొమ్మిది రోజులు ఎవ్వరూ కూడా చెడు మాటలు మాట్లాడకూడదు. ఎవరిని బూతులు తిట్టడం గాని ఎవరికైనా చెడు జరిగే.. తప్పుడు మాటలు చెప్పడం కానీ చేయకూడదు. అలాగే ఈ తొమ్మిది రోజులు ఆడవాళ్లను చాలా గౌరవించాలి. అసలు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఒక్కొక్క రూపంలో పూజిస్తూ ఉంటాం. ప్రతి స్త్రీలోనూ ( Navaratri nine days for God’s grace ) అమ్మవారు ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళని అగౌరవించే మాటలు మాత్రం మాట్లాడకూడదు. ఈ తొమ్మిది రోజులు స్నానం చేసిన తర్వాత గోర్లు కత్తిరించడం కానీ, హెయిర్ కట్ చేసుకోవడం కానీ చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఈ రెండిటికీ ఈ తొమ్మిది రోజులు దూరంగా ఉంటేనే మంచిది. అలాగే ఈ తొమ్మిది రోజులు మాంసాహారం అసలు ముట్టుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాన్ని తినకూడదు.
ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి వేరువేరు నైవేద్యాలు వండి పెడతాము. వాటిలో ఉల్లిపాయ గాని వెల్లుల్లి గాని వేయకూడదు. ఈ తొమ్మిది రోజులు మధుపానం కి దూరంగా ఉండాలి. అలాగే ఈ తొమ్మిది రోజులు ఆహారాన్ని వృధా చేయడం గాని పారివేయడం గాని చేయకూడదు. అలాగే ఈ తొమ్మిది రోజులు ఎవరిని అవమానించడం గాని,బాధ పెట్టడం గాని చేయకూడదు. ఇక ఉపవాసాలు ఇలాంటివి చేసేటప్పుడు వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి డాక్టర్ని కన్సల్ట్ చేసి.. ఎంతవరకు ఉపవాసం చేయచ్చో తెలుసుకొని మాత్రమే చేయాలి. శక్తి కొద్ది భక్తి అనే మన పెద్దలు చెబుతూ ఉంటారు. మన శక్తి ఎంతో అంత మేరానే చూసుకొని అది ఉపవాసమైన, ఖర్చైనా, ఆడంబరాలైనా ఏదైనా కూడా చేసుకోవాలి. మన దగ్గర బాగా ఉంటే ఎంత బాగా చేసుకుంటే మంచిది. మన దగ్గర ఎంత తక్కువ ఉంటే అంత తక్కువలో చేసుకుంటే మంచిది. అన్నిటికంటే ముఖ్యమైనది అమ్మవారి మీద భక్తి , నమ్మకం ఈ రెండే మనల్ని కాపాడతాయి.