Home News Vizag software employee : ఆన్లైన్లో ఆమెకు అడ్డంగా దొరికిపోయిన వైజాగ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి..

Vizag software employee : ఆన్లైన్లో ఆమెకు అడ్డంగా దొరికిపోయిన వైజాగ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి..

Vizag software employee faced online cheating

Vizag software employee: ఆన్లైన్ ప్రపంచం వచ్చిన తర్వాత ప్రతిదీ మనిషికి చాలా ఈజీ అయిపోయింది. చివరకు వర్క్ ఫ్రొం హోమ్ అంటూ ఇంట్లోనే కూర్చొని లక్షల సంపాదించే పరిస్థితి కూడా ఏర్పడింది.వీటన్నిటిని చూసి ఎంత ( Vizag software employee faced online cheating ) ఆనందిస్తామో, ప్రతిదీ ఎంత సులభం అయిపోయిందని అనుకుంటామో.. అలాగే ఆన్లైన్లో మోసపోవడం కూడా చాలా సులభం అయిపోయింది. మోసం చేసే వాడికి మోసం చేయడం అతి సులభంగా కనిపిస్తుంది. కేవలం మనిషిలో ఉండే అత్యాశ వలన, సులభమైన మార్గాన్ని వెతుక్కోవడమే మోసపోవడానికి కారణం అని అనిపిస్తుంది. వైజాగ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇటీవల ఆన్లైన్లో ఘోర మోసాన్ని ఎదురుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. చిన్నప్పటినుంచి కష్టపడి చదువుకుని, తమ కాళ్ళ మీద తాను నిలబడి, చివరికి మంచి మంచి కంపెనీలలో ఉద్యోగాలను సంపాదించి, లక్షలకు లక్షల జీతాలు సంపాదించే సాఫ్ట్వేర్లు ఉద్యోగుల సైతం.. వాళ్ల చదువు, తెలివితేటలని పక్కనపెట్టి, కేవలం మోసం చేయడానికి పుట్టిన వాళ్లకి వీళ్ళు దొరకడం అంటే నిజంగా బాధాకరమైన చెప్పుకోవాలి.

See also  Virus: 24 గంటల్లో ప్రాణాలు తీసే ఈ వైరస్ ఆఫ్రికా మీదగా ఇండియాలోకి.. ఈ లక్షణాలు ఉంటే వెంటనే టెస్ట్ చేసుకొండి.

Vizag software employee faced online cheating

చదువు లేని వాళ్ళో, లోకజ్ఞానం లేని వాళ్ళో, అమాయకులో ఎవరికైనా మోసపోయారు అంటే అర్థముంది గాని.. అన్నీ తెలిసి చాలా అనుకూలంగా ఎదుటి వాళ్లకు మోసపోవడం అంటే.. వీళ్లకు ఉన్న ఆశను, బలహీనతను అవతల వాళ్ళు వాడుకుంటున్నారని కచ్చితంగా అర్థమవుతుంది. విశాఖపట్నం కి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇలాగే ఆన్లైన్లో మోసపోయాడు. పెళ్లయిన కొన్ని రోజులకి తన భార్యతో మనస్పర్ధలు వచ్చి, విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ( Vizag software employee faced online cheating ) రెండో పెళ్లి చేసుకోవాలని, తనకు తోడు కావాలని ఆలోచించిన అతను ఆన్లైన్ లో వెతకడం మొదలు. పెట్టాడు ఆన్లైన్లో ఒక ఆమె తనకు తగిలింది. కేవలం చాటింగ్ లోనే తన ప్రేమను, తీయటి మాటలను ఎంతో చక్కగా చూపించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కానీ ఎప్పుడు వీడియో కాల్ లో కనబడడం గాని, డైరెక్ట్ గా కనిపించడం కానీ చేయలేదు. ఫోన్ చేస్తే కూడా ఇంట్లో వాళ్ళు ఉన్నారని చెబుతూ.. కేవలం వాట్సాప్ కాల్స్ మాత్రమే లిఫ్ట్ చేసేది. అలా ఇద్దరి మధ్యన విపరీతమైన చనువు ఏర్పడి, ఒకరి పర్సనల్స్ ఒకరితో ఒకరు పంచుకోవడం ప్రారంభించారు.

See also  నా కూతురు పై ఇలాంటి వార్తలు వస్తున్నాయి అవ్వన్నీ వినడానికి నాకు ఇష్టం లేదు.

Vizag software employee faced online cheating

కొన్ని రోజుల తర్వాత ఆమె తన గురించి చెప్పడం మొదలు పెట్టింది. తనకొక లవర్ ఉండేవాడని, చెడ్డవాడని తెలిసి బ్రేకప్ చేసిన తర్వాత.. తనని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, అతనికి డబ్బులు సెటిల్ చేయకపోతే కష్టమని చెప్పడంతో.. ఆమెను అప్పటికే పీకల్లోతు ప్రేమిస్తున్న ఈ ఉద్యోగి.. ఆమెకి నెమ్మదిగా డబ్బులు అందించడం మొదలుపెట్టాడు. చివరికి అది మోసం అని తెలుసుకుని.. పోలీసులను ఆశ్రయించగా.. ఆమె ఆ ఉద్యోగి ( Vizag software employee faced online cheating ) దగ్గర 22 లక్షల రూపాయల తీసుకొని.. ముఖం చాటేయాలని ప్రయత్నిస్తుంది అని తెలిసింది. ఆమె 33 ఏళ్ల వయసున్న ఆంటీ అని తెలిసింది. ఆన్లైన్లో ఆమె ఫేస్బుక్ చూస్తే ఎందరినో ఇలా చాటింగ్ చేసి మోసం చేసిందని పోలీసులు కనిపెట్టారు. వారం రోజులు పాటు శ్రమించి విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు ఈమె గురించి మొత్తం తెలుసుకున్నారు. సిబిఐ క్రైమ్ సిఐ భవాని ప్రసాద్ ఈ కేసు గురించి పూర్తిగా వివరాలు చెప్పారు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికైనా యువత ఆన్లైన్లో అమ్మాయిలు వెనక పడటం మానేస్తే మంచిదని అందరూ అనుకుంటున్నారు.