Home Cinema BalaKrishna: బాలయ్యతో ప్రాణం పోయిన సినిమా చేయను.. ముఖంమీదే చెప్పేసిన హీరోయిన్ ఎవరు.

BalaKrishna: బాలయ్యతో ప్రాణం పోయిన సినిమా చేయను.. ముఖంమీదే చెప్పేసిన హీరోయిన్ ఎవరు.

Soundarya Rejected Balakrishna: నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరో తో సినిమా అవకాశం వస్తే ఏ హీరోయిన్ మాత్రం వదులుకుంటుంది? నిన్నటి తరం స్టార్ హీరోలలో అత్యంత మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఆయన. అందులోనూ ఆయన సినిమాలో నటించి పొరపాటున ఆ చిత్రం హిట్ అయితే మాత్రం, అందులో నటించిన నటీనటులకు కూడా మంచి క్రేజ్ వస్తుంది అనే సెంటిమెంట్ ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో ఉంది. అందుకే బాలయ్య బాబు తో సినిమా చేసే అవకాశం వస్తే ఎట్టిపరిస్థితిలోను వదులుకోరు నటీనటులు. అయితే ఒక హీరోయిన్ మాత్రం బాలయ్య సరసన నటించను అని మొహం మీదనే చెప్పేసిందట, ఆ హీరోయిన్ మరెవరో కాదు, అది సౌందర్య గారే.

See also  Keerthy Suresh : తన పెళ్లి గురించి కీర్తి సురేష్ ఎంత మాటన్నదంటే..

bala-krishna-soundharya

గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో SV కృష్ణా రెడ్డి దర్శకత్వం లో ‘టాప్ హీరో’ అనే చిత్రం విడుదల అయ్యింది. కామెడీ ఎంటర్టైనర్ గా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘నర్తనశాల’ అనే చిత్రం విడుదల అయ్యింది. అయితే ఆ సమయం లోనే సౌందర్య హెలికాప్టర్ ప్రమాదానికి గురై చనిపోవడం తో ఈ చిత్రం కొంతభాగం షూటింగ్ చేసుకొని మధ్యలోనే ఆగిపోయింది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి ముందే బాలయ్య మరియు సౌందర్య కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉందట.

See also  Rajamouli - Rama : రమా రాజమౌళిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అసలు విషయం బయట పెట్టిన ప్రత్యక్ష సాక్షి..

balakrishna-soundarya

ఆ సినిమా పేరే చెన్నకేశవ రెడ్డి. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి గా ఆడింది. అయితే గత ఏడాది రీ రిలీజ్ లో మాత్రం ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య బాబు డ్యూయల్ రోల్ లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో ఒక పాత్ర కి టబు జోడీ గా నటించగా, మరో పాత్ర కి శ్రీయ జోడీ గా నటించింది. అయితే టబు పాత్రకు ముందుగా సొందర్య ని తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఈ చిత్రం లో బాలయ్య కి జోడిగా మాత్రమే కాదు, తల్లిగా కూడా ఆమె కనిపించాల్సి ఉంటుంది.

See also  Roja Husband: సీనియర్ హీరోయిన్ మంత్రి రోజా భర్త కు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్..కారణం.?

Balakrishna-hero

బాలయ్య కి తల్లి గా కనిపించేందుకు తాను అస్సలు ఒప్పుకోనని, ఈ సినిమా నేను చేయలేనని మొహం మీదనే చెప్పేసిందట(Soundarya Rejected Balakrishna). అప్పట్లో ఈ వార్త ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా నిల్చింది. ప్రస్తుతం బాల కృష్ణ భగవత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది, ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసుకుంది బృందం. ఈ సినిమా అక్టోబర్ 20న రిలీజ్ చేదాం అని అనుకుంటున్నారు సినిమా బృందం. అనిల్ రావిపూడి డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమాపై అభిమానులు మంచి అంచనాతో ఉన్నారు.