గీతాగోవిందం సినిమాతో రష్మిక మందన అంటే అబ్బాయిలకి, విజయ్ దేవరకొండ అంటే అమ్మాయిలకి ఎంతటి క్రేజ్ వచ్చిందంటే చేసుకుంటే అలాంటి అమ్మాయిని చేసుకోవాలని అబ్బాయిలు. నాకు విజయ్ దేవరకొండ లాంటి వరుడు కావాలని అమ్మాయిలు తల్లితండ్రులను డిమాండ్ చేసేంత క్రేజ్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా తరవాత అబ్బాయిలు అమ్మాయిల దగ్గర అమాయకంగా నటించడం ఇంకా ఎక్కువ అయిపొయింది.
ఎందుకంటే అమ్మాయిలు ఆ సినిమాలో విజయ్ దేవరకొండలా వినయంగా ఉండే అబ్బాయిలని ఇష్టపడతారని ఫీలింగ్. రష్మిక, విజయ్ ల కామినేషన్ లో తరవాత వచ్చిన సినిమాలు అంతగా హిట్ కొట్టలేకపోయాయి. అయినా రష్మిక కి మంచి ఆఫర్స్ వచ్చాయి. ఇటు టాలీవుడ్ మాత్రమే కాకుండా, బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంది. అయితే బాలీవుడ్ లో రిలీజ్ అయిన గుడ్ బాయ్, మిషన్ మజ్ను రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.
అసలే రష్మిక ఈ బాధలో ఉంటె, ఇంతలో వేణుస్వామి కన్ను రష్మిక మీద పడింది. ఈ మధ్య వేణుస్వామి సోషల్ మీడియాలో చాలా హుషారుగా ఉంటున్నారు. అటు రాజకీయనాయకుల గురించి ఇటు సినిమా వాళ్ళ గురించి అడగకపోయినా వాళ్ళ జాతకాలు చెబుతున్నారు. చైతు, సమంత ల పెళ్లి గురించి అప్పుడు, రీసెంట్ గా ప్రభాస్ గురించి ఆయన చెప్పినట్టే… ఇప్పుడు రష్మిక జాతకం మీద కన్ను వేశారు. ఆమె సినిమా ల ఫెల్యూర్ కి విజయ్ దేవరకొండ కారణం అని అన్నారు.
వేణుస్వామి రష్మిక గురించి మాట్లాడుతూ… ఆమెను విజయ్ దేవరకొండతో స్నేహం చెయ్యద్దని ఎప్పుడో చెప్పాను . వినకుండా అతనితో స్నేహాన్ని వదల లేదు. అతని దరిద్రం ఆమెకు పట్టింది. విజయ్ కు ముందు ముందు చాలా కష్టాలు ఉన్నాయి. అతన్ని వదిలితే ఈమెకు మంచిది. లేదంటే దరిద్రం తప్పదు అన్నారు. వేణుస్వామి జాతకాన్ని నమ్మిన కొందరు నెటిజనులు కష్టాలు తెచ్చే ఆ రిలేషన్ రష్మిక కి అవసరమా అని వాపోతున్నారు.