Home Cinema Chiranjeevi – Diwali : చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకలలో ఆ స్టార్ హీరోలో మరో...

Chiranjeevi – Diwali : చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకలలో ఆ స్టార్ హీరోలో మరో కోణం చూసారు..

venkatesh-went-to-chiranjeevi-house-for-diwali-celebrations

Chiranjeevi – Diwali : 2023 నవంబర్ 12వ తేదీన భారతదేశం మొత్తం దీపావళి వేడుకను ఎంతో ఘనంగా చేసుకుంది. ఇక పేదవాడి నుంచి గొప్ప వాళ్ళ వరకు అందరూ కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు దీపావళి వేడుకను ( Chiranjeevi and Diwali celebration ) జరుపుకున్నారు. అలాగే సినీ సెలబ్రిటీస్ ఇళ్లల్లో కూడా దీపావళి వేడుకను ఎంతో బాగా చేసుకుని వాటిని మళ్లీ అభిమానులు చూసేలా సోషల్ మీడియాలో షేర్ చేయడం నిజంగా అభిమానులకు చాలా ఆనందం కలిగిస్తుంది. మెగా కుటుంబం నుంచి దీపాలు వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది.

Chiranjeevi-Diwali-2023-ntr-ram-charan-mahesh

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుక ఘనంగా జరిగింది. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనలకు.. క్లింకార పుట్టిన తర్వాత.. అంతకుముందు కంటే కూడా ఇప్పుడు వస్తున్న పండుగలు, వేడుకలు అన్నీ కూడా ( Chiranjeevi and Diwali celebration ) ఎంతో గొప్పగా చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే దీపావళి వేడుకను కూడా రామ్ చరణ్, ఉపాసన ఇద్దరు ప్లాన్ చేసి.. పలువురు సెలబ్రిటీస్ ని పిలిచి.. ఆ వేడుకను ఆనందంగా వాళ్ళ ఇంట్లో చేసుకున్నారు. చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుక అనగానే అక్కడికి ఆయన పిలిచిన సెలబ్రిటీస్ అందరూ కూడా హాజరయ్యి ఎంతో ఆనందంగా జరుపుకున్నారు.

See also  Siddu Jonnalagadda: ఆ డైరెక్టర్ తో రిలేషన్ షిప్ లో ఉన్నది నిజమే.. సంచలన విషయాలు తెలిపిన డి జే టిల్లు..

Chiranjeevi-Diwali-2023-Venkatesh-Allu-Arjun

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరుపుకుంటున్న దీపావళి వేడుకలకు అక్కినేని నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్ ,సాయిధర్మతేజ్,వైష్ణవ తేజ్, వరుణ్ తేజ్, మహేష్ బాబు,ఎన్టీఆర్ ఇలా అందరూ హాజరయ్యారు. పలువురు హీరోలు బ్యాచిలర్స్ బ్యాచిలర్స్ గా వస్తే.. ఫ్యామిలీతో ఉన్నవాళ్లు వాళ్ళు సతీమణులతో కలిసి వచ్చి మరీ చిరంజీవి ఇంట్లో ( Chiranjeevi and Diwali celebration ) ఎంజాయ్ చేశారు. తారలు ఒకచోటకు చేరి దీపాలను వెలిగించుకుని దీపాల పండుగ చేసుకుంటే.. ఆ కాంతి మరింత కాంతిగా ఉంటుంది. ఆ కాంతి వెలగంటే ఆ అభిమానులకు నిజంగా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి వేడుక కూడా అందరికీ అంత ఆనందాన్ని కలిగించింది.

See also  Custody: కస్టడీ సినిమా టార్గెట్ ఎంతో తెలుసా?

Chiranjeevi-Diwali-2023-Upasana-heroes-wives

అయితే చిరంజీవి ఇంట్లో జరిగిన దీపాలు వేడుకలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కలిసి ఫోటో తీసుకోవడం. అలాగే హీరోల భార్యలు అందరూ, ఉపాసన కలిసి ఫోటోలు తీసుకోవడం జరిగింది. ఇంకా వెంకటేష్, అల్లు అర్జున్ కూడా కలిసి ఫోటో తీసుకోవడం జరిగింది. అయితే వెంకటేష్ అల్లు అర్జున్ కలిసి తీసుకున్న ఫోటోలు వెంకటేష్ చేతిలో ఒక ఫోన్ ఉంది. ఆ ఫోన్ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే విరిగింది. సాధారణంగా సామాన్యులే ఈ రోజుల్లో ఫోన్ చిన్నగా డ్యామేజ్ అయితే.. మార్చేసి ఇంకొకటి తీసుకుంటున్నారు. సెలబ్రిటీస్ ఇంకా ఎంత క్షణాల్లో మారుస్తారో చెప్పనక్కర్లేదు. అలాంటిది వెంకటేష్ చిన్నగా పగిలి ఉన్న ఆ ఫోన్ అంత జాగ్రత్తగా వాడుతున్నాడు అంటే జాగ్రత్త పరుడు అనుకోవాలా? లేకపోతే సింప్లిసిటీ ఉన్న మనిషి అనుకోవాలా? లేకపోతే వెంకటేష్ అంత పిసినారోడనుకోవాలా? అని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి చిరంజీవి ఇంట్లో వేడుకల్లో.. వెంకటేష్ లో మరో కోణం చూసాం అన్నమాట అని అంటున్నారు.