Home Cinema Venkatesh Movie: మన దేశంలోనే ఎక్కువ సినిమా టికెట్లు అమ్ముడుపోయిన మన తెలుగు సినిమా ఏదో...

Venkatesh Movie: మన దేశంలోనే ఎక్కువ సినిమా టికెట్లు అమ్ముడుపోయిన మన తెలుగు సినిమా ఏదో తెలుసా.? దాన్ని మరే సినిమా బీట్ కూడా చేయలేదు

Venkatesh Movie: విక్టరీ వెంకటేష్ సినిమాలు అప్పట్లో ఇటు లవ్ బర్డ్స్ కి అటు ఫ్యామిలీ జోనర్ వాళ్లకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయేది. మంచి కుటుంబ కథ చిత్రం కచ్చితంగా చూసేలా కథలను ఎంపిక చేసుకునే హీరో ఇండస్ట్రీలో మరెవ్వరూ లేరనే చెప్పాలి. అలా ఒక పక్క ఫ్యామిలీ జోనర్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూనే మరొక పక్క లవ్ చిత్రాలలో నటిస్తూ ఉంటాడు వెంకీ మామ. ఇక కేవలం ఇవే కాక మాస్ సినిమాలు, యూత్ ఫుల్ లవ్ స్టోరీలు మరియు ఫ్యాక్షన్ జోనర్ల లో కూడా ఎన్నో చిత్రాలలో నటించాడు విక్టరీ వెంకటేష్. ఇక మీ అందరికీ తెలియని విషయం అసలు దగ్గుబాటి ఇంటి పేరు ఉన్న వెంకటేష్ కి విక్టరీ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా.?

venkatesh-movie-our-telugu-movie-which-has-sold-the-most-movie-tickets-in-the-country-has-not-been-beaten-by-any-other-movie

వరుసగా హ్యట్రిక్స్ కొట్టి వెంకటేష్ కైవసం చేసుకోవడంతో అలా వెంకటేష్ కి విక్టరీ అనే బిరుదు లభించింది. దాంతో దగ్గుబాటి వెంకటేష్ కాస్త విక్టరీ వెంకటేష్ గా మారిపోయాడు ఇండస్ట్రీలో.. ఇక ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ పోతే తెల్లారే దాకా ముచ్చట్లే ఉంటాయి. కనుక అసలు విషయంలోకి వెళ్తే అసలు ఫ్యామిలీ జోనర్లు వెంకటేష్ కి మంచి కాసుల వర్షం కురిపించి ఆయన క్రేజ్ ను వంద రెట్లు ఎక్కువ చేసి చూపిన చిత్రం కలిసుందాం రా. ఇక ఈ చిత్రం యొక్క దర్శకుడు ఉదయ శంకర్ నిర్మించినటువంటి ఈ చిత్రం అప్పట్లో టాలీవుడ్ లో మొట్ట మొదటి ఇరవై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ ను రాబట్టిన చిత్రంగా సరికొత్త రికార్డుని సృష్టించింది.

See also  Niharika : నిహారిక నిర్ణయానికి మెగా ఫామిలీ ఆగ్రహమా.. అనుగ్రహమా?

venkatesh-movie-our-telugu-movie-which-has-sold-the-most-movie-tickets-in-the-country-has-not-been-beaten-by-any-other-movie

ఇక ఈ చిత్రానికి (Venkatesh Movie) సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ మురుగ దాసు కూడా స్క్రిప్ట్ రైటింగ్ విభాగంలో ఒకరిగా పనిచేసాగాడు. కాగా ఈ చిత్రంలో మొదట హీరోయిన్ గా అంజనా జువేరిని అనుకున్నారు. కానీ ఆమె తో ఫొటో షూట్ చేసిన తర్వాత డైరెక్టర్ ఎందుకో పెద్దగా ఆసక్తి చూపలేదట. దాంతో వెంటనే సిమ్రాన్ ని సంప్రదించి ఆమెని చిత్రంలో హీరోయిన్ గా తీసుకున్నాడట. నాలుగు కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో డైభ్బై ఎనమిది కేంద్రాలలో సంక్రాంతి కానుకగా బరిలోకి దిగి కుటుంబ సత్తా చిత్రం అవడంతో అందుకు తోడు మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య చిత్రం కూడా విడుదలవడంతో ఇంత తక్కువ సెంటర్స్ లో విడుదల అవ్వాల్సి వచ్చింది

See also  విడాకుల అనంతరం తొలిసారిగా కలవబోతున్న సమంత చైతులు.. అభిమానులు కలలో కూడా ఊహించని విషయం ఇది.

venkatesh-movie-our-telugu-movie-which-has-sold-the-most-movie-tickets-in-the-country-has-not-been-beaten-by-any-other-movie

కానీ విడుదలైన డెభ్బై ఎనమిది కేంద్రాలలో కూడా వంద రోజులు ఆడిందంటే అది ఆశ్చర్య పోవాల్సిన విషయమే. ఇక అప్పట్లో ఎన్టీఆర్ నటించిన లవకుశ చిత్రం మాత్రం ఈ స్థాయిలో విడుదలై అన్ని కేంద్రాలు ఆడింది. ఇక ఆ తర్వాత అలా ఆడిన ఏకైక చిత్రంగా కలిసుందాం రా చిత్రం నిలిచింది. అలాగే 14 సెంటర్లలో 175 రోజులు 4 సెంటర్లలో 200 రోజులు ఆడిన చిత్రంగా ఈ చిత్రం నిలవడమే కాకుండా ఆ పాతిక కోట్ల రూపాయల గ్రాస్ ను కొల్లగొట్టిన చిత్రంగా ఆల్ టైం ఇండియన్ స్టేటస్ ని కొల్లగొట్టింది. ఇకపోతే అప్పట్లో ఈ చిత్రానికి రెండు కోట్ల 50 టికెట్స్ అమ్ముడు పోయాయని ఇది ఆ రోజుల్లో ఆల్ ఇండియాలోనే ఆల్ టైం రికార్డ్ గా ప్రస్తుతం ఇప్పటికి చరిత్రలో రికార్డు స్థాయిలో సృష్టించింది. ఇలా ఎన్నో రికార్ట్ లను బద్దలు కొట్టి ఇప్పటికి ఈ చిత్రాన్ని మరే చిత్రం కూడా బీట్ చేయలేదంటే అది మామూలు విషయం కాదు.