Varun Tej – Lavanya Tripathi : ఇటీవల ఎక్కడ చూసినా వరుణ్ తేజ్, లావణ్యల ఎంగేజ్మెంట్ ఫోటోలు వీడియోలు కనిపిస్తూనే ఉన్నాయి. మిస్టర్ సినిమా.. శ్రీనువైట్ల దర్శకత్వంలో చేసిన ఈ సినిమా తో వరుణ్ తేజ్, లావణ్య పరిచయం మొదలయ్యి.. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యి.. ఆ తర్వాత నెమ్మదిగా ( Varun Lavanya signed a divorce ) ప్రేమించుకోవడం జరిగింది. కానీ ఇన్నేళ్లు వీళ్ళ ప్రేమని ఎవరికీ తెలియకుండా.. బాగానే జాగ్రత్తగా దాచుకొని.. చివరికి మంచి గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్పటినుంచో మెగా అభిమానులు.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటే బాగున్ను.. ఈ జంట చాలా బాగుంటుందని అందరూ అనుకుంటూనే ఉన్నారు. అందరి ఆశల్ని తీర్చేందుకు చూడముచ్చటగా ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫొటోస్ చూస్తే.. మెగా అభిమానులకు పట్టలేని ఆనందంగా ఉంది.
అసలు లావణ్య త్రిపాఠి తెలుగు బాగానే మాట్లాడుతుంది కాబట్టి.. ఇక్కడ అబ్బాయిని ఎవరినైనా చూసుకొని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండిపోవచ్చుగా.. అని ఆరోజు చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అరవింద్ గారు అన్నమాట.. ఎక్కడో దేవతలు తధాస్తు అని వాళ్ళ ఫ్యామిలి లో అబ్బాయిని చేసుకునేలా చేశారు. ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమ ఎంత గొప్పదంటే.. ఎప్పటి నుంచో ప్రేమించుకుని.. ఆ ప్రేమను ( Varun Lavanya signed a divorce ) నిలబెట్టుకుని.. ఇరువురి కుటుంబాల్ని ఒప్పించుకుని ఎంతో ఆనందంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే వరుణ్ తేజ్ పెళ్లి నిర్ణయానికి ఇంతకాలం ఎందుకు పట్టింది అంటే.. మెగా కుటుంబం లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదు అని కండిషన్ పెట్టిందని అంటున్నారు.
ఆ నిర్ణయానికి ఒప్పుకోవడానికి లావణ్య త్రిపాఠి కొంత టైం తీసుకుని.. తనకి అన్ని రకాలుగా ఓకే అనుకున్న తర్వాతే తను ఈ పెళ్లికి అంగీకరించిందని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా తన ప్రేమ కోసం ప్రేమించిన ఆ హీరో కోసం తన కెరీర్ ని కూడా పక్కనపెట్టి వరుణ్ తేజ్ తో నూరేళ్లు నడవాలని లావణ్య త్రిపాఠి తీసుకున్న నిర్ణయం మెగా అభిమానులకు చాలా ఆనందాన్ని కలిగించింది. మహేష్ బాబు భార్య నమ్రత.. ఇలా ( Varun Lavanya signed a divorce ) ఎంతోమంది స్టార్ హీరోల భార్యలు పెళ్లి తర్వాత వాళ్ళ సినిమా కెరీర్ ని వదిలేసి.. తన భర్త కెరీర్నే తన కెరీర్ గా చూసుకొని.. సంసారాన్ని, వాళ్ళ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దిన హీరోయిన్లు అయితే లేకపోలేదు. అలాంటి కోవకే లావణ్య త్రిపాఠి కూడా వెళ్లాలని.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి హాయిగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలపై ఒక కొత్త రకం వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. ఎంతో కొంత అనుమానం లేకుండా అయితే ఏది రాదు కదా అని కొందరు అంటున్నారు. ఇంతకీ ఏమిటంటే.. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లికి ముందే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి.. ఎప్పుడైనా బ్రేకప్ చేసుకోవాలనుకుంటే విడాకులు కావలసిన కాగితాలు ఇద్దరు సంతకం పెట్టుకున్నారు అంట. దానికి కారణం కూడా కొన్ని జంటలను చూసి.. నాగచైతన్య, సమంత అలాగే పవన్ కళ్యాణ్ ఆయన భార్యలు..నిహారిక కూడా ఆమె భర్త తో విడిపోతారేమో అని.. ఇలా ఎప్పుడైనా పడక.. విడిపోవాలనుకుంటే ఆ సమయంలో అనవసరమైన గొడవలు, బాధలు లేకుండా వెంటనే కాగితాన్ని వాడుకొని ఇద్దరు విడిపోయేలాగా.. ఇద్దరికీ అవకాశం ఉండేలాగా ముందే బ్రేకప్ కాగితంపై సంతకాలు పెట్టుకున్నారంట. ఇది తెలిసిన అభిమానులు ఇది నిజం కాకూడదని వాళ్ళిద్దరు ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడదని ఆ దేవుడికి దండం పెట్టుకుంటున్నారు.