Home Cinema Varun Tej Lavanya marriage date : వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి డేట్...

Varun Tej Lavanya marriage date : వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి డేట్ ని మార్చేసిన చిరంజీవి..

varun-tej-lavanya-tripathi-marriage-date-was-changed-by-chiranjeevi

Varun Tej Lavanya marriage date : మొత్తానికి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి చాలాకాలంగా మా మధ్యన ఉన్నది కేవలం స్నేహం మాత్రమే, ప్రేమ కాదు అంటూ సాగించిన ఆ కథని మలుపు తిప్పి చివరికి అభిమానులు ఊహించినట్టుగానే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నామని బయటకు చెప్పి ఎంగేజ్మెంట్ చేసుకొని.. పెళ్లి పీటలు ( Varun Tej Lavanya marriage date ) ఎక్కడానికి అతి దగ్గరలోనే తొందరలో అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి బ్యాచిలర్ పార్టీ కూడా చేసుకుని.. ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి సందడి కోసం ఎప్పుడెప్పుడా అని మెగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Varun-Tej-Lavanya-tripathi-marriage-date

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి డెస్టినేషన్ మ్యారేజ్ జరుగుతుందని.. మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు. అది కూడా ఇటలీలో జరుగుతుందని అంటున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ( Varun Tej Lavanya marriage date ) వాళ్ళ ప్రపోజ్ చేసుకున్నది మొదటిసారిగా అక్కడేనని.. వాళ్ళిద్దర్నీ కలిపిన ఆ డెస్టినేషన్ మళ్లీ పెళ్లి రూపంలో కలపబోతుందని అంటున్నారు. ఏదేమైనా ఈ అందమైన జంటను చూసి అందరి కళ్ళు ఆనందంతో పొంగిపోతున్నాయి. వీళ్ళ పెళ్లి డేట్ నవంబర్ 1 వ తేదీ అని ఎప్పటినుంచో వినిపిస్తూ ఉంది.

See also  Rakesh Master : రాకేష్ మాస్టర్ది హత్య అంటూ తిరుగులేని సాక్షాలు లభ్యం! చంపింది ఎవరు అంటే..

Varun-Tej-Lavanya-marriage-date-changed

మొదట్లో ఆగస్టులో పెళ్లి జరుగుతుందని అన్నారు కానీ.. అప్పట్లోనే నిహారిక విడాకులు తీసుకున్న సంగతి బయటపెట్టారు. ఆ సమయంలో వెంటనే పెళ్లి చేయడమనేది సరైన పని కాదనే ఆపారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ( Varun Tej Lavanya marriage date ) నవంబర్ ఫస్ట్ ని వాళ్ళ పెళ్లి జరగబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే మెగా కుటుంబం నుంచి ఎవ్వరు కూడా మ్యారేజ్ డేట్ గురించి ఎక్కడ ఫిక్స్ చేసి అఫీషియల్ గా చెప్పలేదు కానీ.. ఇప్పుడు మళ్లీ వీళ్ళ పెళ్లి డేట్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏమిటంటే.. చిరంజీవి వీళ్ళ పెళ్లి డేట్ ని మార్చేశారని అంటున్నారు. మరి అది ఎలాగో ఏమిటో తెలుసుకుందాం..

See also  RRR OSCAR: ఆస్కార్ మీద 10 కోట్లు బెట్టు కట్టిన టాలీవుడ్ హీరో ఎవరు.?

Varun-Tej-Lavanya-marriage-date-chiranjeevi

నవంబర్ 1వ తేదీ బుధవారం పడిందని.. అది కాకుండా అక్టోబర్ 31న పెళ్లి డేట్ పెట్టుకోవడానికి ముహూర్తాలు ఉన్నాయా అని చిరంజీవి పట్టు పట్టి పూజారిని అడిగించారంట. వాళ్ళు చూసి అక్టోబర్ 31 కూడా పెళ్లి డేట్స్ ఉన్నాయి, ముహూర్తం ఉందని చెప్పారంట. దానితో ఆ రోజే ఫిక్స్ చేయమని చిరంజీవి చెప్పారట. కారణం.. మెగా కుటుంబానికి మంగళవారం అంటే చాలా ఇష్టం. ఆ రోజే ఏదైనా కూడా వాళ్లకు శుభం కలుగుతుందని గట్టి నమ్మకం. ఇప్పటికే పెళ్లిళ్లు విడాకులతో బాధని మిగులుస్తున్న మెగా కుటుంబంలో వరుణ్ తేజ్ పెళ్లి అలా కాకూడదని ఎంతో వైభవంగా ఆనందంగా జరగాలని.. జరిగిన తర్వాత నూరేళ్లు పాటు ఆ జంట హాయిగా ఉండాలని చిరంజీవి కోరుకుంటూ.. కచ్చితంగా మంగళవారానికి మార్చమని అడిగారంట. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త మాత్రం తెగ హల్చల్ చేస్తుంది.