Varun Lavanya wedding photos: ఇటలీలో ఈరోజు ఎంతో ఘనంగా వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠిల పెళ్లి జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా తెలుసుకోవాలని మెగా అభిమానులకి, సినీ అభిమానులకు ఎంతో ఆత్రుతగా ఉంది. ఎప్పుడెప్పుడు ఆ వేడుకకు ( Varun Lavanya wedding photos ) సంబంధించిన ఫోటోలు వస్తాయా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే అక్కడక్కడ ట్విట్టర్లో, ఇన్స్టా లో ఎవరో ఒకరు చిన్న చిన్న వీడియో క్లిప్స్, ఫొటోస్ పోస్ట్ చేస్తుంటే వాటిని చూసి ఆనంద పడుతున్నారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి సందడి ఇండియా నుంచే మొదలయ్యింది. వాళ్ళ పెళ్లికి అటెండ్ అవ్వడానికి వెళ్తున్న సెలబ్రిటీస్ ఏర్పోర్ట్ నుంచే విపరీతమైన సందడి చేశారు. అభిమానుల అందరిలోనూ నిజంగా ( Varun Lavanya wedding photos ) మెగా అభిమానులందరికీ.. వాళ్ళ సొంత మనుషుల పెళ్లి జరుగుతుందనే ఫీల్ ని చూపించగలిగారు. ఇటలీ చేరుకున్న తర్వాత అక్కడ కాక్ టెయిల్ పార్టీ, ఆ తర్వాత హల్దీ ఫంక్షన్, ఆ తర్వాత మెహందీ ఫంక్షన్ అన్నీ కూడా చక్కగా చేసుకుని.. వాటి ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది.
రాత్రి జరిగిన మెహిందీ ఫంక్షన్ లో చీకటిలో మంచి లైటింగ్ పెట్టుకొని, క్యాండిల్ లైట్లు లైటింగ్ కూడా పెట్టి ఒకపక్క కూర్చొని మెహందీ పెట్టుకుంటూ.. మరోపక్క డిన్నర్ అరేంజ్ చేసి ఎంతో చూడచక్కగా ఉండేలాగా ఆ సన్నివేశాన్ని క్రియేట్ చేసుకున్నారు. ప్రతి ఫంక్షన్లోని అల్లు అర్జున్ చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈరోజు ( Varun Lavanya wedding photos ) ఇంకా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరుణ్ తేజ్ ని ఊరేగింపుతో కారులో తీసుకెళ్తున్న వీడియో ట్విట్టర్లో వైరల్ అవుతుంది. ఇటలీ దేశం వెళ్లి కూడా భారతీయ సంప్రదాయ ప్రకారం అన్నిటినీ ఒక్కొక్కటి చక్కగా చేసుకుంటూ వస్తున్నారు.ఇక ఊరేగింపు అయిన తర్వాత కళ్యాణమండపం లోపలికి తీసుకెళ్లే ఫొటోస్ కూడా రిలీజ్ చేశారు.
వరుణ్ తేజ్ ని చిరంజీవి ( Chiranjeevi ) ఒకపక్క, మరోపక్క సురేఖ పట్టుకుని మండపం లోపలికి తీసుకెళ్తూ.. వరుణ్ ని పట్టుకుని వాళ్లిద్దరూ ఫోటో తీసుకున్న సన్నివేశం చాలా అద్భుతంగా తీశారు. చిరంజీవికి తన తమ్ముడి కొడుకుపై ఎంత ప్రేమ ఉంది అనేది ఈ ఫోటోలో కనిపిస్తుంది. అలాగే వరుణ్ తేజ్ కి వాళ్ళ పెదనాన్న, పెద్దమ్మ అంటే ఎంత గౌరవం, ఇష్టం ఉన్నాయా కూడా అక్కడ కనిపిస్తుంది. నిజంగా ఈ వేడుక మొత్తం అందరికంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నది చిరంజీవి, సురేఖ అన్నట్టే కనిపిస్తున్నారు. వయసుకు ఇచ్చే మర్యాద అనేది వయసును బట్టి రాదని.. పెద్దరికం అనేది మనస్తత్వం వల్ల, ఆచరించే పనులను బట్టి ఉంటుందని చిరంజీవి సురేఖల్ని చూస్తే అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ కుటుంబానికి ఎంత వెన్నుముకగా నిలబడి ఉండుంటే.. వీళ్లంతా అంత గౌరవం ఇస్తున్నారని కనిపిస్తుంది..