Varun Tej : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ ఎవరికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు సినీ అభిమానులు ( Varun Tej Bachelor party details ) అందరూ వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని, ప్రేమించుకుంటున్నారని చెప్తూనే ఉన్నారు. చివరికి వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు అనుకున్నవన్నీ జరిగిన తర్వాత, ఇంట్లో పెద్దవాళ్ళను బాగా ఒప్పించుకున్న తర్వాత, అప్పుడు బయటపెట్టి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ నాగబాబు ఇంట్లో ఎంతో ఘనంగా జరిగింది. మెగా కుటుంబం మొత్తం చిరునవ్వుల సందడితో వాళ్ళిద్దరిని ఏకం చేయడానికి నాంది పలికారు.
అప్పటినుంచి మెగా అభిమానులు అందరూ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఎప్పుడు చూస్తున్నారు? ఈలోపు ఎంగేజ్మెంట్ అవ్వగానే ఈ జంట ఇతర దేశాలకు వెళ్లి.. వాళ్ళ పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ( Varun Tej Bachelor party details ) ఎంజాయ్ చేశారు. అంతేకాకుండా ఆగస్టులో చేద్దామని అనుకుంటే కొన్ని అనివార్య కారణాల వలన దాన్ని పోస్ట్ పోన్ చేశారు. అప్పటినుంచి అభిమానులు వీళ్ళ పెళ్లి జరిగే వరకు టెన్షన్ లోనే ఉన్నారు. ఎందుకంటే.. అఖిల్ కూడా ఇలాగే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయారు కానీ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ మాత్రం గట్టి జంటే..
నిశ్చితార్థం చేసుకున్న తర్వాత నుంచి వీళ్ళిద్దరూ వాళ్ళ పెళ్లి కావలసిన పనులన్నీ స్వయంగా చూసుకోవడం మొదలుపెట్టారు. కాకపోతే వీళ్ళ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత.. నిహారిక విడాకులు కావడంతో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు. అంతే ఇప్పుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఎప్పుడు జరగబోతుంది అనేది వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ( Varun Tej Bachelor party details ) వస్తున్న వార్తలు ప్రకారం.. వీళ్లిద్దరు పెళ్లి నవంబర్ ఫస్ట్ వీక్ లో చేస్తారని అంటున్నారు. వీళ్లిద్దరు పెళ్లి ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు అంట. అందుకే అక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి అన్ని వసతి సౌకర్యాలను అరేంజ్ చేయడానికి స్వయంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వెళ్లి చేసుకున్నారు.
వరుణ్ తేజ్ తన పెళ్లి డేట్ ఫిక్స్ అవ్వగానే మొదటిగా చేసిన పని బ్యాచిలర్ పార్టీ ఇచ్చాడంట. అది కూడా ఇక్కడ అక్కడ కాదు స్పెయిన్ లో ఇచ్చాడంట. ఆ పార్టీకి తన ఫ్రెండ్స్ అందర్నీ పిలుచుకున్నాడంట. ఈ పార్టీకి సాయిధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ ఇద్దరు కూడా స్పెయిన్ వెళ్లారు అంట. వెళ్లి అక్కడ బాగా అందరూ కలిసి బ్యాచిలర్ పార్టీని ఎంజాయ్ చేశారంట. అయితే.. బ్యాచిలర్ పార్టీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పై తనకున్న ప్రేమ.. పెళ్లి జరగడానికి ముందు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న కమిట్మెంట్స్.. పెళ్లయిన తర్వాత కూడా ఎలా ఉండాలనుకుంటున్నారో.. ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలి.. ఎలా ప్రేమించుకోవాలి.. ఎలా హాయిగా బతకాలి అనుకుంటున్నారో ఇవన్నీ చెప్పాడంట. అయితే ఎన్ని చెప్పినా కూడా అయ్యో మామ నీ జీవితం బుగ్గ అయిపోతుందా అని బ్యాచిలర్స్ అందరూ ఎలాగో పాట పాడుతారు..