Valentines Day: మన తెలుగు తారల ప్రేమ పెళ్లిళ్లు.. ఎవరెవరిది సక్సెస్ రేట్ ఎలా ఉందొ చూద్దాం.
ఈరోజు ప్రేమికులరోజు.. ఈరోజంటే ప్రేమించుకునే ప్రతీ ఒక్కరికీ చాల ఇష్టం. దీనిని చాలా స్పెషల్ గా చేసుకుంటారు. ఎంత పేదవాడైన, డబ్బున్నవాడైన తనదైన శైలిలో తన లవర్ ని ఈరోజు స్పెషల్ గా ట్రీట్ చేస్తాడు. ఇప్పుడు ప్రేమలో ఉన్నవారే కాదు, వయసు మీద పడిన వారు కూడా ఆ రోజుల్లో తమ ప్రేమ గురించి కొన్ని జ్ఞాపకాలను ఈరోజు నెమరువేసుకుంటారు. ఎందుకంటే వయసు శరీరానికి వస్తుంది కానీ, ప్రేమించే మనసుకు కాదు.
1. అక్కినేని నాగ చైతన్య – సమంత : వీళ్ళిద్దరూ ప్రేమించుకుని, వారి వారి కుటుంబాలను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని కారణాలు వలన కేవలం నాలుగు సంవత్సరాలకే విడిపోయారు. వీళ్ళ ప్రేమపెళ్లి ఫెయిల్ అయినట్టే..
2. అల్లు అర్జున్-స్నేహ రెడ్డి: వీళ్లిద్దరు ఒక పార్టీ లో కలసి ప్రేమించుకుని. అటు అరవిందు, మెగా ఫ్యామిలీ నే కాకుండా అమ్మాయి తరుపు కుటుంబాన్ని కూడా ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు పిల్లపాపలతో హాయిగా ఉంటూ.. ప్రేమ వివాహాన్ని సక్సెస్ చేసుకున్నారు.
3. మహేష్-బాబు నమ్రత: వీళ్ళిద్దరూ సినిమా షూటింగ్ లో ప్రేమలో పడి, అతికష్టం మీద పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మహేష్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లో కూడా భార్య సలహాలను గౌరవిస్తూ ఒకరికి ఒకరు మేడ్ ఫర్ ఈచ్ అధర్ లా బ్రతుకున్నారు.
4. శ్రీకాంత్-ఊహ: వీళ్ళిద్దరూ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. కొడుకుని హీరోని కూడా చేసి, చక్కటి సినిమా జంట అనిపించుకున్నారు.
5. పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్: పవన్ మొదటి భార్యను వదిలి, రేణుదేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఆమెను కూడా వదిలి మూడవ పెళ్లి చేసుకుని ప్రేమ వివాహాన్ని అట్టర్ ప్లాప్ చేసారు.
6. నాగార్జున-అమల: వీళ్ళిద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగార్జున మొదటి భార్యతో కొన్ని కారణాలు వలన విడిపోయినా, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలతో చాలా అన్యోన్యంగా కలసి ఉండి.. లవ్ మ్యారేజ్ వేల్యూ నిలబెట్టారు.
7. కృష్ణ-విజయనిర్మల : కృష్ణకు మొదట భార్య ఉండగా, విజయ నిర్మలను ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా కడవరకు అన్యోన్యంగా గౌరవంగా బ్రతికి, ప్రేమ వివాహం విలువ నిలిపారు.
8. సీనియర్ ఎన్టీఆర్-లక్ష్మీ పార్వతి : వీళ్లద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని, అది అట్రాక్షన్ కాదు, అదొక మంచి అభిమానం అని 74 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ నిరూపించి.. ప్రేమ వివాహానికి ఒక పీఠం వేశారు.