Home Cinema Top Telegu movies : 2023 లో తోపు తెలుగు సినిమా ఇదే.. నాని దశరా...

Top Telegu movies : 2023 లో తోపు తెలుగు సినిమా ఇదే.. నాని దశరా మూవీ తో లెక్కలు మారాయి.

Top Telegu movies : సినిమా ఇండస్ట్రీలో సినిమా తియ్యడం ఎంత కష్టమో.. దానిని సక్సెస్ చేసుకోవడం ఇంకా కష్టం. అందులోనూ భారీ బడ్జెట్ సినిమాలు ఫెయిల్ అయితే చాలామంది జీవితలు నాశనం అవుతాయి. హై బడ్జెట్ సినిమాలు చాలావరకు ఇంతకు ముందు ఎక్కువగానే ఫెయిల్ అయ్యేవి. కానీ ఇటీవల కొంత కాలంగా భారీ బడ్జెట్ సినిమాలు సక్సెస్ రేటు పెరిగింది. పైగా 2023 లో ( Top Telegu movies in 2023 ) అయితె నెలకు ఒక హిట్ సినిమా అయినా చూస్తూ వస్తున్నాము. 2023 మొదలయిన ఈ నాలుగు నెలల్లో హిట్ సినిమాలు ఎన్ని ఉన్నాయో చూద్దాం..

See also  Colors Swathi: త్వరలో కలర్స్ స్వాతి కూడా విడాకులు తీసుకోబోతుందా.? ఇందులో ఉన్న నిజమెంత.

top-telegu-movies-in-2023

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకతంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ ఏడాది మంచి హిట్ కొట్టింది. పండగల్లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టి 220 కోట్లు వసూలు చేసింది. అలాగే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమా కూడా మంచి హిట్ కొట్టింది. చెల్లెలి సెంటిమెంట్ తో తీసిన ఈ సినిమా క్లాస్ మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా దగ్గర దగ్గర 134 కోట్లు కలెక్షన్స్ తెచ్చింది.

See also  Akhil Akkinenis Agent: అఖిల్ కి మల్లి ప్లాప్.. డిసాస్టర్ అని మొత్తుకుంటున్నా జనాలు..

top-telegu-movies-in-2023

వెంకి అట్లూరి దర్శకత్వంలో.. ధనుష్ తెలుగులో చేసిన మొదటి సినిమా సార్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. విద్యను అమ్ముకోవడం కాదు, పంచుకుంటూ.. పెంచుకోవాలి అనే స్లోగన్ తో తీసిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా 115 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక ప్రియదర్శి హీరోగా వేణు దర్శకత్వంలో రూపొందిన సినిమా బలగం. ఈ సినిమా చాలా చిన్న బడ్జెట్ తో ( Top Telegu movies in 2023 )  తీశారు. అయినా కూడా ఈ సినిమా 25 కోట్లు పైన కలెక్ట్ చేసి హైలెట్ గా నిలిచింది.

See also  Keerthy Suresh : కీర్తి సురేష్ ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోమని అడిగింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

top-telegu-movies-in-2023

మనుషుల బంధాలను, అనుబంధాలను, రక్తసంబంధీకుల విలువలను చూపించిన సినిమా బలగం. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన దసరా సినిమా మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఇప్పటికే 54 కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టింది. ఇక వీకెండ్ సెలవుల కలెక్షన్ ఇంకా రాబడతాది. ఇప్పటివరకు 2023 లో తోపు సినిమా గా ఫస్ట్ ప్లేస్ లో చిరంజీవి సినిమా వాల్తేరువీర్యయ్య ఉండగా.. ఇప్పుడు మరి దసరా పూర్తి కలెక్షన్ తో లెక్కలు మారతాయేమో చూడాలి..