Tollywood: నటన మీద ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరైనా సరే అది ఏ ఇండస్ట్రీ అయినా సరే చాలామంది హీరోయిన్లు అతి చిన్న వయసులో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాతే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఓ వెలుగు వెలుగుతూ ఉంటూ ఉంటారు. అయితే ఇలా సాధ్యం అవడం అందరికీ అవుతుందని చెప్పలేం.. అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీ లో ముందుకు సాగాలంటే అందం, నటన, అభినయం ఇది మాత్రం ఉంటేనే సరిపోదు. వీటన్నిటికీ పాటుగా లక్ అనేది కూడా మన రాతలో ఉంటేనే కొత్త వాళ్ళు ఎంతమంది హీరోయిన్లు వస్తున్నప్పటికీ వాళ్లందర్నీ తలదన్ని.. (Tollywood)
ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో ఒకే పొజిషన్ లో కొనసాగుతూ స్టార్డం సంపాదించుకోవడం స్టార్ట్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో ఎక్కువమంది సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది మాత్రం బాలనటులుగానే అడుగుపెట్టి ఆ తర్వాతే అంచలంచెలుగా ఎదుగుతూ పదహారేళ్లు నిండకముందుకే హీరోయిన్లు అయిపోయి కోట్లు సంపాదిస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంతెందుకు అలా సంపాదించిన వాళ్లలో అలనాటి శ్రీదేవి మొదలుకొని నేటి యువతరం హీరోయిన్లైనా శ్రీ లీల, కృతి శెట్టి వంటి హీరోయిన్లు కూడా అతి చిన్న వయసులో ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా పరిచయమై ప్రస్తుతం కోట్లు కొల్లగొడుతున్నారు. అలాంటి వాళ్ళు ఎవరో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం.
శ్రీదేవి:
అతిలోక సుందరి అందాల తారగా పేరు కైవసం చేసుకున్న దివంగత తార శ్రీదేవి తను ఆలనటిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దివంగత నటుడు నేత అయినటువంటి సీనియర్ ఎన్టీఆర్కి మనవరాలు కూడా నటించిన ఈమె ఆ తరువాత కేవలం 13 ఏళ్లకే ఇండస్ట్రీలో హీరోయిన్గా వచ్చి అదే ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించి అందర్నీ ఎంతగానో మెప్పించింది అలా నటననే తన ఆయుధంగా మల్చుకొని కొన్ని వందల కోట్ల ఆస్తికి వారసురాలుగా నిలిచింది.
మీనా:
ప్రముఖ హీరోయిన్ మీనా కూడా అతి చిన్న వయసులోనే బాల నటిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత 16 ఏళ్లకే హీరోయిన్ గా అవకాశాన్ని అందుకొని చాలా మంచి పాపులారి సంపాదించుకుంది. ప్రస్తుతం మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ తో మళ్ళీ తన దూకుడు నీకు కొనసాగిస్తుంది.
తమన్నా:
తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ అమ్మడు 2005వ సంవత్సరంలో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. హీరోయిన్ గా కొనసాగుతున్న తమన్నా కేవలం 15 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీకి పరిచయమై ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతుంది.
చార్మి కౌర్:
తెలుగులో దీపక్ హీరోగా వచ్చిన చిత్రం నీ తోడు కావాలి అనే సినిమాతో కేవలం 17 సంవత్సరాలకే హీరోయిన్ గా పరిచయం అయ్యింది చార్మి.
కృతి శెట్టి:
ఉప్పెన సినిమాతో ఓ ప్రభంజనాన్ని సృష్టిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత వరుస చిత్రాలతో గోల్డెన్ లెగ్ పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. కేవలం 17 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా మన ముందుకు వచ్చి ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది.