Tollywood Heroes : ప్రతి మనిషి సంపాదన కోసం పరుగులు పెడుతూ ఉంటాడు. అయితే ఆ సంపాదన కొన్ని రకాలుగా వస్తూ ఉంటుంది. మన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తి కొంత ఉంటుంది. అలాగే వ్యాపారాలు చేయగా, సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ వలన మన ఆస్తి అనేది పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా ( Tollywood Heroes latest value of assets ) డబ్బు ఎక్కువ సంపాదించాలంటే సినిమా రంగం,రాజకీయరంగం, వ్యాపారం రంగం, ఇతర దేశాలకు వెళ్లి సంపాదించుకునే ఎన్నారైలు సంపాదిస్తారని అందరం అంటూ ఉంటారు. అసలు మన టాలీవుడ్ హీరోలు ఇప్పటికి ఎంత సంపాదించారు వాళ్ళ ఆస్తులు విలువలు ఎంత అనేది తెలుసుకుందాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోల్ని ఎక్కువమందిని అందించిన మెగాస్టార్ చిరంజీవి ఆస్తి విలువ 5 వేల కోట్లు ఉంటుందని అంటున్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవికి ఎంతో విలువైన స్థలాలు ఉండటం వలన అవన్నీ ఒక్కసారిగా విపరీతంగా పెరగడం వలన,అంతేకాకుండా టీవీ షోస్, వ్యాపారాలు అంటూ ఖాళీ లేకుండా ఎప్పటికప్పుడు సంపాదన దారిలో ఉండే చిరంజీవి ఇప్పటికి 5000 కోట్ల ఆస్తిని చేకూర్చాడని అంటున్నారు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వంశానికి ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు. అందులో నందమూరి బాలకృష్ణ ( Tollywood Heroes latest value of assets ) అంటే గత ఎన్నో ఏళ్లగా ఆయన నటిస్తూనే ఉన్న సంగతి తెలుసు. నందమూరి బాలకృష్ణకి ఆయన సంపాదన మాత్రమే కాకుండా.. ఆయన తండ్రి నుంచి కూడా ఆస్తి అనేది సంక్రమించింది. అలా వచ్చిన తర్వాత ఆయన ఆస్తి విలువ ప్రస్తుతం 4 వేల కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. ఆయనకు ప్రతి సినిమాకి 25 కోట్ల రూపాయల పారితోషకం అందుకోగా.. ఇంకా ఆయన టీవీ షోస్ లో అన్ స్టాపబుల్ సీజన్ 3 షో కి పోస్టుగా కూడా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక సినిమా ఇండస్ట్రీలో రామానాయుడు కుటుంబం నిర్మాతలుగా ఎంత గట్టి పాదం వేసుకొని ఉన్నారో ఇండస్ట్రీలో మనందరికీ తెలిసిందే. రామానాయుడు కుటుంబం నుంచి వెంకటేష్ హీరోగా ఎంటర్ అయ్యి.. ఇప్పటికీ ఆయన ( Tollywood Heroes latest value of assets ) యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తూనే ఉన్నారు. వెంకటేష్ వారసత్వంగా వచ్చిన 2000 కోట్ల ఆస్తితోపాటు, వెంకటేష్ స్వయంగా సంపాదించుకున్న ఆస్తితో కలిపి 4 వేల కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. వెంకటేష్ సినిమా అంటే కుటుంబ కథా చిత్రంగా అనిపిస్తుంది. కుటుంబం అంతా కలిసి వెళ్లి ఖచ్చితంగా చూస్తారు. మినిమం గ్యారంటీ ఉన్న సినిమా అని వెంకటేష్ సినిమాని అంచనా వేస్తారు.
అలాగే ఇక సినిమా రంగంలో అటు సినిమాల వైపు, మరో వైపు స్టూడియోస్ వైపు చూసుకున్న కూడా అక్కినేని కుటుంబం స్ట్రాంగ్ గానే ఉంది. అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున మన్మధుడుగా పేరు సంపాదించుకొని.. ఇప్పటికి అయినా ఆయన కొడుకులు కంటే యాక్టివ్గా నటిస్తూనే ఉన్నారు. నాగార్జునకు వారసత్వంగా వచ్చింది.. ఇంకా ఆయన అనేక సినిమాల్లో నటించి, వ్యాపారాలు చేసి, యాడ్స్ లో నటించి మొత్తం అంతా కలిపి ఆయన ఆస్తులు 2 వేల కోట్లకు పైగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా మన హీరోలు ఇప్పటికీ ఎండలో కష్టపడి, వానికి తడిచి నటించేది కేవలం ఆస్తులు కంటే విలువైన.. అభిమానల అభిమానం అనే ఆస్తిని కాపాడుకోవడానికే అని అందరికీ అర్థం అవుతూనే ఉంది.