Breakups in Tollywood: ప్రేమ గురించి ఒక్కొక్కరు వాళ్లకు అర్ధమైన ప్రేమను బట్టి రకరకాల భావాలు వ్యక్తం చేస్తుంటారు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎందరో కడవరకు వారి దాంపత్య జీవితం సాఫీగా సాగాయి కొందరి జీవితాలు అర్ధాంతరహితంగా ఆగిపోయాయి. కొందరు తొలిచూపులోనే ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు ఉన్నారు. మరికొందరు వెంటపడి తిరిగి తిప్పించుకొని ఆ తర్వాత ప్రేమకు ఒప్పుకొని పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. ఇలా పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళలో కొందరు సంతోషంగా హాయిగా వారి దాంపత్య జీవితం కొనసాగిస్తుంటే మరికొందరు మాత్రం వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. అయితే పెళ్లిదాకా వచ్చి పెటాకులైన టాప్ ఫైవ్ టాలీవుడ్ జంటలు వాళ్ళ బ్రేకప్ వివరాలు తెలుసుకుందాం..
Rashmika Mandanna: నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక తెలుగుతోపాటు అటు బాలీవుడ్ లోనూ పాపులర్ హీరోయిన్గా మారిపోయింది. అసలు ఆమె డేట్స్ ఖాళీగా ఉండటమే లేదు. తన ఫస్ట్ సినిమా తన మదర్ టంగ్ కన్నడలో కిరాక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఆ సినిమాలోని హీరో రక్షిత్ శెట్టితో రష్మిక ప్రేమలో పడింది. వీళ్లిద్దరూ పిచ్చిపిచ్చిగా ప్రేమించుకున్నారట, ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత కరోనా టైం లో రష్మికకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తడంతో రష్మిక పెళ్లి వాయిదా వేసుకోవడంతోపాటు వీరి ఏడడుగుల వేయకుండానే వీరి బంధం పెళ్లి పీటలు ఎక్కకుండా వీళ్ళ పెళ్లి పటాపంచలయింది.
Mehreen: తెలుగు చిత్ర పరిశ్రమలో తన నటనతో అందంతో ఒక ఊపు ఊపుతున్న హీరోయిన్ మెహరీన్. తను హర్యానాకు చెందిన ఓ యువ రాజకీయ నాయకుడు అయినటువంటి భవ్య బిష్ణోయ్ తో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. వీళ్లిద్దరి ప్రేమ అప్పట్లో చాలా వైరల్ అయింది చాలా రోజులపాటు చట్టపట్టాలేసుకొని తిరిగారు. ఆ తర్వాత ఫోటోషూట్స్ కూడా చాలా ఘనంగా చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమిందో తెలియదు వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు.
Akkineni Akhil: అక్కినేని నాగార్జున రెండవ తనయుడు అఖిల్. జీవీకే ఫ్యామిలీకి చెందిన మనవరాలు శ్రియా భూపాల్ మీరిద్దరు ఘాడంగా ప్రేమించుకున్నారు. వీరి ఎంగేజ్మెంట్ కూడా అట్టహాసంగా జరిగింది. వీరి పెళ్లికి ఇటలీలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో హైదరాబాద్లో ఓ ఫంక్షన్లో జరిగినటువంటి చిన్న ఇష్యూ పెద్దదిగా మారింది. చివరకు శ్రియాతీరుతో చిర్రెత్తిన నాగార్జున ఫ్యామిలీ తీవ్రంగా హర్ట్ అయింది అన్న టాకు వినిపించింది దాంతో పెళ్లికి ముందే వీరిద్దరి బంధం బ్రేకప్ అయిపోయింది.
Trisha: త్రిష దాదాపు ఇద్దరు ముగ్గురు తో ప్రేమ వ్యవహారాలు నడిపిన తర్వాత చెన్నైకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి వరుణ్ మనియన్ తో ప్రేమలో పడ్డ తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఇద్దరూ రింగులు తొడుగుతున్నారు. అనుకున్న విధంగానే అట్టహాసంగా పెళ్లి అన్నారు. కానీ పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదని వరుణ్ త్రిష కు కండిషన్ పెట్టడంతో, అలా రకరకాల ఆంక్షలు విధించడం వల్ల త్రిష తట్టుకోలేకపోవడంతో చివరకు త్రిష పెళ్లి వద్దనుకుంది.
Nayanatara: ఇక నయనతార విషయానికొస్తే ప్రేమ బ్రేకప్ అంటూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. అప్పట్లో యంగ్ హీరో అయినటువంటి శింబుతో ప్రేమ వ్యవహారం నడిపిన తర్వాత తనకు బ్రేకప్ చెప్పి ఆ తర్వాత ప్రభుదేవాను ప్రేమించింది. దాని తర్వాత ప్రముఖ డైరెక్టర్ అయినటువంటి విగ్నేష్ శివను ప్రేమించి ఏడు సంవత్సరాలు రిలేషన్ లో ఉన్న తర్వాత పెళ్లాడింది. ఇటీవలే వీళ్ళకి సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఇలా టాలీవుడ్ లో సెన్సేషనల్ గా బ్రేకప్ లు అయినా జంటలు ఇవి హైలెట్ గాని ఉన్నాయి.