తొలి సినిమాతో చిత్ర పరిశ్రమలో పాతుకుపోయిన హీరోయిన్లు వీళ్ళే
- సమంత :
తొలి నాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత ఆ తర్వాత 2010 లో విడుదల అయిన ఏం మాయ చేసావే సినిమా లో అవకాశం రావడం తో మంచి హిట్ తన సొంతం చేసుకుంది. అయితే తను మొదట 2007లో తమిళ సినిమా చేస్తానని ఒప్పుకున్నప్పటికీ ఆ తర్వాత ఆ సినిమా చేయకుండా తెలుగు సినిమాలో చేసింది…
వరస ఆఫర్లతో ఏకకాలంలో తెలుగు హీరోయిన్ గా తనకుంటూ ఓ ముద్ద వేసుకుంది వరుసగా వస్తున్న ఆఫర్లు దాంతో హిట్స్ తన సొంతమయ్యాయి అలా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదంటూ ఓ బలమైన పాత్ర పోషించింది.
- సాయి పల్లవి :
తమిళనాడులోని ఊటీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న ఊరిలో జన్మించింది ఈ బుట్ట బొమ్మ.
తాను ఒక పక్క వైద్యరంగంలో తన వృత్తిని చేపడుతూనే ఇటు సినిమా రంగంలో తన ప్రతిభను చాటుతూ తెలుగులో ఫిదా సినిమాతో అడుగుపెట్టి సంచలనాలు క్రియేట్ చేసింది.
ఆ తర్వాత మంచి సినిమాలతో ఇండస్ట్రీలో తన స్థాయి ఎంటో నిరూపించుకుంది.
సినిమా కంటెంట్ నచ్చితే ఎంత రిస్కైనా సాయి పల్లవి చేస్తుంది కానీ ఇప్పటివరకు ఏ సినిమాలో ఎక్స్పోజింగ్ చేయడం అంటే తనకు తెలియదు నచ్చదు.
అందుకే తను చాలా మందికి ఇష్టమైన హీరోయిన్ అయిపోయింది మన తెలుగు ప్రజలకు.
- రాసి కన్నా :
చూడగానే ముద్దొచ్చే ముద్దుగుమ్మ తన అందంతో అందర్నీ మైమర్చిలా చేస్తుంది చాలా బబ్లీగా ఉంటుంది.
దానికి తోడు తన హైట్ తన ఫిజిక్ తన స్ట్రక్చర్ ఏ టు జెడ్ పర్ఫెక్ట్ గా ఉంటాయి.
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే చిత్రంతో మంచి హిట్ టాక్ అందుకుంది.
దాంతో అమ్మడుకి కూడా వరుస ఆఫర్లు రావడం మొదలయ్యాయి రాసి కన్నా పేరుకు తగ్గట్టు చాలా అందంగా ఉంటుంది.
- రకుల్ ప్రీత్ సింగ్ :
తెలుగులో నటించకు ముందుకే తను హిందీ చిత్రాలలో మరియు తమిళ చిత్రాలలో నటించింది ఇంటర్ చదివే సమయంలోనే తన కొన్ని సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత పై చదువుల కోసం వెళ్లి డిగ్రీ కంప్లీట్ చేసి ఆ తర్వాత తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ద్వారా తెలుగు సినీ చిత్ర పరిశ్రమకు పరిశ్రమయి మంచి హిట్ అందుకుంది.
ఇంకేముంది చూడ్డానికి అచ్చం తెలుగమ్మాయిలాగా కనిపించే రకుల్ ప్రీత్ సింగ్ ఇక్కడ ఆఫర్లతో బిజీ బిజీ అయిపోయింది ప్రస్తుతానికి మాత్రం హిందీలో సినిమాలు చేస్తుంది.
- పాయల్ రాజ్ పుత్ :
చిన్నతనం నుంచి పాయల్ రాజ్ పుత్ నటనపై మక్కువ ఎక్కువ అలా తన విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత చిన్నచిన్న సీరియల్ లలో యాక్ట్ చేసింది.
ఆ తర్వాత తొలిచిత్రమైన తెలుగులో ఆర్ఎక్స్ 100 తో ఎంటర్ అయింది ఈ రాజ్ పుత్ ఆ తర్వాత సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ పెద్దగా హిట్స్ రావడం లేదు.
అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని చేజార్చకుండా చేస్తూనే ఉంది. చూడాలి మరి మళ్ళీ ఆర్ఎక్స్ 100 లా మరేం హిట్టు తన గడప తొక్కునందో వేచి చూడాలి మరి.