సినిమా : విడుదల పార్ట్ 1 ( Vidudala Part 1 movie in Tekugu )
నటీనటులు: సూరి, విజయ్ సేతుపతి, భవానీ స్రే, గౌతమ్ వాసుదేవన్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్, ఇలవరసు, బాలాజీ శక్తివేల్ మొదలగువారు..
సంగీతం: ఇళయరాజా
కెమెరా: ఆర్ వెల్‌రాజ్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
నిర్మాత: ఎల్‌రెడ్ కుమార్
దర్శకత్వం: వెట్రిమారన్
విడుదల: 15 ఏప్రిల్ 2023 ( Vidudala movie release date ) ( These are the amazing scenes in the Vidudala Part 1.. Review and rating.
వెట్రిమారన్ దర్శకత్వంలో సూరి, విజయ్ సేతుపతి నటించిన విడుదల పార్ట్ 1 సినిమా మనముందుకు వచ్చింది. ఈ సినిమా తమిళ్ లో రిలీజ్ అయ్యి, మంచి పేరు తెచ్చుకుంది. వెట్రిమారన్ సినిమా పై తమిళ్ లో చాలా భారీ అంచనాలు ఉంటాయి. ఎందుకంటే తమిళ్ సినిమాలు సాధారణంగా రియాలిటీకి కొంచెం దగ్గరగానే ఉంటాయి. అందులోనూ ఈ దర్శుకుడు సినిమా అంటే ఇంకా రియల్ గా ఉంటాయి. ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకతంలో వచ్చిన అసురన్ సినిమా అక్కడ హిట్ అయ్యింది. అదే సినిమాని తెలుగు లో వెంకటేష్ తో తీయగా యావరేజ్ అయ్యింది. మరి ఇప్పుడు విడుదల పార్ట్ 1 సినిమా ఎలా ఉందొ తెలియాలంటే ముందు కథలోకి వెల్దాము..
కథ..
ఒక రైలు ఎటాక్ తో సినిమా మొదలవుతుంది. ఆ తరువాత కుమరేశన్ (సూరి) కథ మొదలవుతుంది. ఇతను పోలీస్ డిపార్ట్మెంట్ లో కొత్తగా జాయిన్ అవుతాడు. పోలీస్ ఉద్యోగం అంటే ఎంతో గౌరవంతో ఉంటాడు. కానీ అతని దురదృష్టం ఏమిటంటే.. అతన్ని కేవలం పోలీసులకు భోజనం క్యారేజీ లు తీసుకుని వెళ్లడం రావడం వీటికే పరిమితం చేస్తారు. అధికారులు సూరి చెయ్యని తప్పుకు సారీ చెప్పమని వేధిస్తారు. వాళ్ళు చేసే అవమానాన్ని, అజమాయిషీని, పనిషమెంట్స్ ని అన్నిటిని భరిస్తాడు తప్ప సారీ చెప్పడు. అయితే అక్కడ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పేరిట ఫ్యాక్టరీలు కట్టిస్తామని చెబుతూ.. పోలీస్ క్యాంపులని నడుపుతూ ఉంటారు. అలాగే ప్రజాదళం నాయకుడైన పెరుమాళ్ ( విజయ్ సేతుపతి) ని పట్టుకునేందుకు పోలీస్ దళం పనిచేస్తూ ఉంటుంది. పెరుమాళ్ ను పట్టుకునే ( These are the amazing scenes in the Vidudala Part 1.. Review and rating.) ప్రయత్నంలో పోలీసులు అక్కడ ఉన్న ప్రజలను నానా రకాలుగా హింసిస్తూ ఉంటారు. ఆ ఊర్లోనే ఒక అమ్మాయిని కుమరేశన్ ప్రేమిస్తాడు. ఆ ప్రేమించిన అమ్మాయి కూడా పోలీసుల కంట్రోల్ లోకి వెళ్తాది. కుమరేశన్ విజయ్ సేతుపతిని పట్టిస్తానని చెబుతాడు. పెరుమాళ్ ఆ ఊర్లో అందరికీ దేవుడితో సమానం. అసలు కుమరేశన్ ని అధికారులు ఎందుకు సారీ చెప్పమంటారు? అతని లవర్ ని ఎందుకు పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు? పెరుమాళ్ అంటే అక్కడ ప్రజలకు ఎందుకు దేవుడు? పెరుమాళ్ ని పట్టుకోగలను అని కుమరేశన్ ఎందుకు అంటాడు? చివరికి కుమరేశన్ పెరుమాళ్ ని పెట్టుకున్నాడా? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి.
సినిమా ఎలా ఉందంటే..
వెట్రిమారన్ దర్శకత్వం లో వచ్చిన సినిమా అంటేనే రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాదని అందరికీ తెలిసినదే. ఈ సినిమా కూడా రియాలిటీకి దగ్గరగానే ఉండటం మాత్రమే కాకుండా.. మనకు తెలియని రియాలిటీని కూడా చూపించాడు. సినిమా మొదలు ట్రైన్ దాడి జరిగిన తరవాత సీన్ తో మొదలు పెట్టాడు. అసలు ఆ సీన్ ని సాధారణంగా గట్టి హైప్ మ్యూజిక్ తో అందరూ హడావిడిగా అటు ఇటు తిరిగి, ఎదో ప్రెస్ మీట్ కనిపించి అలా ఆసన్నివేశాన్ని 5 నిముషాల్లో ముగించేలా తియ్యలేదు దర్శకుడు. ( These are the amazing scenes in the Vidudala Part 1.. Review and rating.) అసలు ఆ సీన్ చూస్తే.. ఆ ప్రదేశంలో మనం ఉన్నట్టు ఫీల్ వస్తాది. అలాంటి ప్రమాదం జరిగితే ప్రమాదం గురైన వాళ్ళు ఎలా బాధలో ఉంటారు, వాళ్ళని సేవ్ చేసేవాళ్ళు ఎలా పనిచేస్తారు, పోలీసులు, పత్రిక వాళ్ళు ఎలా మూవ్ అవుతూ ఉంటారు, మొత్తం చాలా సహజంగా తీసాడు. కాకపోతే దానికి టైం ఎక్కువసేపు తీసుకున్నాడు.
ఆ తర్వాత హీరో ని ఇంతకాలం ఒక కమెడియన్ గా చూసిన ప్రేక్షకులకి ఇలాంటి పాత్రలో అతన్ని ఒప్పించిన ఘనత దర్శకుడిదే. మొదట ఒప్పించగలను అని అతని నమ్మకం.. ఒప్పించగలడం రెండు అభినందనీయమే. ఈసినిమాలో సూరి పాత్ర చాల బాగుంది. అధికారుల చేతుల్లో, జూనియర్స్ ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటారో చూపించడమే కాకుండా.. అలాంటి సమయంలో కూడా ఆ పాత్ర హీరోయిజం కాకుండా సామాన్యంగా వాటిని సహించే పాత్ర చక్కగా చేసాడు. అలాగే ఈ సినిమా సూరి, భవానీ స్రే మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. భవానీ స్రే ని అంత సామాన్యంగా చూపించిన దర్శకుడు అభిరుచి ఈ సినిమాలో కనిపిస్తాది. ఎక్కడా హీరో హీరోయిన్ మధ్య ఒక్క ఓవర్ సీన్ కూడా లేకుండా తీసినా కూడా వారి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. హీరో గిఫ్ట్ గా ఇచ్చిన గాజులు చూపించే స్టైల్.. ఆ సమయంలో వాళ్ళిద్దరి నటన చాల బాగా కుదియింది. అలాగే హీరోయిన్ లాస్ట్ లో ఆపదలో ఉన్న సమయంలో.. అసలు హీరో ఆ టైం లో అలంటి నిర్ణయం తీసుకుంటాడని.. దానికి ఎన్నుకున్న మార్గం.. లాస్ట్ భాగంలో హీరోతో దర్శకుడు చేయించిన పెర్ఫామెన్స్ చాలా సహజంగా చక్కగా ఉంది.
అలాగే సినిమాలో విజయ్ సేతుపతి కలిపించేది చాలా తక్కువ. కనిపించిన కొద్దీసేపు మాట్లాడింది ఇంకా తక్కువ గాని, అతని మార్క్ మనకు ఎప్పటికప్పుడు చూపిస్తాడు. అయితే పోస్టర్ లో విజయ్ సేతుపతిని చూసి అతని కోసమే సినిమాకి మాత్రం వెళ్తే నిరాశచెందక తప్పదు. ఈ సినిమాని దర్శకుడిని చూసి వెళ్ళాలి తప్ప.. ఇంకేమి ఆలోచించకూడదు. లాస్ట్ 20 నిమషాలు సినిమా ఏమౌతాది? ఎలా తెలుస్తాడు అనేది ప్రశ్నార్ధకంగా ఆశక్తికరంగా తీసాడు. అలాగే సినిమాలో ఆడవారిని పోలీసులు అవమానించే తీరు అంత పచ్చిగా చిత్రీకటించిన సీన్స్ దర్శకుడి ధైర్యాన్ని చూపిస్తుంది. కాకపోతే సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా హీరో ఫీలింగ్స్ మీద, అధికారుల అజమాయిషీ మీద చాల స్లో గా సాగదీసినట్టు అనిపిస్తుంది. అది తమిళ్ వాళ్లకు అయితే బాగుంటుంది కానీ, మన తెలుగు వాళ్ళు అంత సహనంగా చూడలేరు.
బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సినిమాలో మ్యూజిక్ బాగానే ఉంది కానీ, పాటలు హైలెట్ ఏమీ కావు. ఇక హీరో హీరోయిన్ లలో ఎటువంటి మేకప్ లేకుండా.. సినిమాని మన తెలుగు వాళ్ళు ఒప్పుకోరు అనడానికి ఏమి లేదు.. ఇటీవల రైటర్ పద్మనాభమ్, బలగం.. ఇలా కొన్ని సినిమాలో కథకి స్క్రీన్ ప్లే కి ప్రాధాన్యత ఇచ్చారు తప్ప.. స్టార్ నటీ నటుల కోసం, మేకప్, హంగామా కోసం ఆడియన్స్ చూసుకోకుండా సినిమాని ఆదరించారు. మరి ఈ సినిమాని ఎంతవరకు ఆదరిస్తారో తెలీదు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాల సింపుల్ కథలో సహజత్వాన్ని ఇష్టపడతారు గాని.. మరి ఇలాంటి కథతో ఎంత వరకు ఇష్టపడతారో చూడాలి. ఏది ఏమైనా సినిమాను తియ్యడంలో దర్శకుడు.. అతనికి దగ్గట్టుగా నటించడంలో నటులు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సినిమా కొంచెం స్పీడ్ పెంచి.. ఒకే పాయింట్ ని ఎక్కువసేపు లాగకుండా.. తిరుగుబాటు సీన్స్.. ఒక సంఘర్షణ, కొంత లాజిక్ చూపించి ఉంటె సినిమా ఇంకా బాగున్ను అనిపిస్తాది. మరి ఇవన్నీ సెకండ్ పార్ట్ లో ఉంటాయేమో చూడాలి.
రేటింగ్ : 2.5/ 5
ఈ సినిమా రివ్యూ మరియు రేటింగ్ ఒక ప్రేక్షకుడి దృష్టితో చూసినది మాత్రమే..
అసలైన రివ్యూ మీకు మీరే ఇవ్వాలి..