ఇటీవల కాలంలో మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో జంటలు పట్టుమని పది కాలాల పాటు సంసార జీవితం సాగించకుండా ఏవేవో మనస్పర్ధల కారణం చేత ఒకరినొకరు విడిపోతూ విడాకులు తీసుకుంటున్నారు. ఈ సంఖ్య రోజుకు మరింత పెరుగుతూ వస్తుంది. ఎంతో ఇష్టంతో ప్రేమించి అంగరంగ వైభవంగా వివాహం చేసుకొని సడన్ గా విడాకులు తీసుకుంటూ ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. ఇక ఇలాంటి కోవకి చెందిన వారిలో ఎక్కువగా ప్రేమించి ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్లు ఉండడం గమనార్ధం. అలా ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు డివోర్స్ తీసుకుని ఒంటరిగా వాళ్ల జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అలా ఇప్పటికే ఆ లిస్టులోకి సౌత్ స్టార్ హీరోయిన్ సమంత, మెగా డాటర్ నిహారిక కొణిదెల చేరారు. (Nihatika Swatis Mistake)
ప్రస్తుతం ఇదే లిస్టులోకి చేయడానికి సిద్ధంగా ఉన్నది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా రాణించిన కలర్స్ స్వాతి సైతం విడాకులు తీసుకోబోతుందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఓ సారి ఇలాంటి వార్తలు వైరల్ కాగా అందుకు కలర్స్ స్వాతి స్పందించి అలాంటి వార్తలలో నిజం లేదని ఖండించింది. కానీ మళ్ళీ మరొక సారి ఇలాంటి వార్తలు వైరల్ అవుతుండడంతో కలర్ స్వాతి స్పందించకపోవడంపై ఈ వార్తలు నిజమేనని అంతా భావిస్తున్నారు నెటినన్స్.. ఇక ఈ వార్తలపై ఆమె స్పందించకపోవడంతో నేరుగా పలు మీడియా సంస్థలు ఆమె ముందుకు వెళ్లి మీరు విడాకులు తీసుకోబోతున్నారా అంటూ నేరుగా గా ఆమెను ప్రశ్నించగా.?
ఆమె ఇచ్చిన సమాధానం అలాంటి వార్తలలో నిజం లేదు అంటూ తెలిపింది. కాగా కలర్స్ స్వాతి మీడియాలో ప్రచారం అయ్యే వార్తలు అన్నీ ఫేక్ అని తెలిపిందిశ కానీ నేను విడాకులు తీసుకోబోతున్నానన్న విషయం పై ఏ మాత్రం క్లారిటీ తెలియజేయలేదు. గతంలో లాగా అలాంటి వార్తలను కొట్టి పడేయలేదు. మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ అబద్ధాలు అంటూ చెప్పిందే తప్ప నేను విడాకులు తీసుకుంటున్నాను అనే విషయం గురించి ఆమె ఎక్కడా వెల్లడించలేదు. ఏదైనా ఉంటే కచ్చితంగా నేనే వెల్లడిస్తాను అని చెప్పిందే కానీ విడాకుల విషయం గురించి కొట్టి పడేయలేదు. సేమ్ టు సేమ్ (Nihatika Swatis Mistake) ఇటీవల కాలంలో విడాకులు తీసుకున్న నిహారిక సైతం విడాకులు తీసుకునే ముందు ఇలాంటి కామెంట్స్ చేసింది.
ఆమె కూడా సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అబద్ధమని తెలిపింది. కానీ మేము విడాకులు తీసుకుంటున్నామని మాత్రం వెల్లడించలేదు. కలర్ స్వాతి సైతం ఇలాంటి సమాధానాలు చెప్పడంతో త్వరలో నిహారిక లాగా కలర్ స్వాతి కూడా పెద్ద బాంబు పేల్చబోతుందని మనకు అర్థం అవుతుంది. మరి ఈ వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్న వేళ చూడాలి మరి మరొకసారి కలర్స్ స్వాతి ఏ విధంగా ఇలాంటి వార్తల పై స్పందిస్తుందో.. కాగా ఇటీవలే కలర్ స్వాతి తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారిన విషయం మనందరం చూసాం.