Malli Pelli : సినిమా రంగంలో ఉండే గొప్పతనం ఏమిటంటే.. ఒక్కసారి అందులో జనాభిమానాన్ని పెంచుకోగలిగితే,వాళ్ళు ఎప్పుడు చిరంజీవిగా జనాల దృష్టిలో బ్రతికే ఉంటారు. అందుకే సినిమా రంగానికి ( Mahesh Babu in Malli Pelli ) ఇన్నేళ్లు అవుతున్న ఇంకా అంత క్రేజ్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ మరణించిన తర్వాత ఆయనపై బయోపిక్ వస్తే బాగుంటుందని ఆయన అభిమానులు ఎందరో అనుకున్నారు. ఎందుకంటే కృష్ణ జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు, ఎన్నో సక్సెస్ లు, ఎన్నో ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. కృష్ణ ప్రతి కష్టసుఖాల్ని ఛాలెంజింగ్ గా తీసుకొని నిలదొక్కుకున్నారు. అందుకే ఆయన్ని డేరింగ్ డాషింగ్ అండ్ డైనమిక్ హీరో అని అంటారు.
ఫస్ట్ కలర్ సినిమా, ఫస్ట్ స్కోప్ సినిమా అలాగే సింహాసనం లాంటి హై బడ్జెట్ సినిమా.. ఇలా ఎన్నో ధైర్యంగా చేయగలిగే మనస్తత్వం ఉన్న మనిషి కృష్ణ. అయితే కృష్ణ గారి మీద బయోపిక్ వస్తుందో రాదో తెలీదుగానీ, ఆయన చనిపోయిన తర్వాత ఆయన పాత్ర మాత్రమే ఒక సినిమాలో కనిపించబోతుంది అదేమిటంటే ( Mahesh Babu in Malli Pelli ) మళ్లీ పెళ్లి సినిమా. కృష్ణ భార్య విజయ్ నిర్మల కొడుకు నరేష్ మళ్లీ పెళ్లి అనే సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా నరేష్ రియల్ స్టోరీ అనుగుణంగా ఉంటుందని అంటున్నారు. కాకపోతే డైరెక్ట్ గా ఆ పేర్లు పెట్టకుండా కొంచెం మార్పు చేస్తూ నరేష్ బదులు నరేంద్రని అలా మార్చుకుంటూ పెట్టారు.
ఈ సినిమాలో కృష్ణ గారి పాత్ర కూడా ఉంటుందంట. ఎందుకంటే కృష్ణ చనిపోవటానికి చాలా కాలం ముందు నుంచి, విజయనిర్మల దగ్గరే ఉన్నారు. అదే ఇంట్లో నరేష్ కూడా ఉండటంతో.. ఇది నరేష్ రియల్ స్టోరీ ( Mahesh Babu in Malli Pelli ) కాబట్టి, నరేష్ కృష్ణ గారితో కలిసి ఉన్నాడు కాబట్టి, ఈ సినిమాలో కృష్ణ గారు పాత్రను కూడా పెట్టాల్సి వచ్చిందంట. కృష్ణ గారి పాత్రలో ఈ సినిమాలో శరత్ బాబు, విజయనిర్మల పాత్రలో జయసుధ నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే కృష్ణ గారి పాత్ర సినిమాలో ఉంటుంది అంటే మహేష్ బాబు పాత్ర కూడా ఉంటుందా అని కొందరి నెటిజనుల, అభిమానుల సందేహం.
అయితే చిత్ర బృంధం నుంచి వస్తున్న సమాచారాలను బట్టి.. ఈ సినిమాలో మహేష్ పాత్ర ఉంటుంది కానీ డైరెక్ట్ గా లేకుండా కేవలం మాటల్లో మాత్రమే మహేష్ బాబుని ప్రస్తావించే లాగా అతని పాత్ర ఉంటుందని అంటున్నారు. మళ్లీ పెళ్లి అనే సినిమాకి ఇప్పటికే చాలా క్రేజ్ వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో భాగంగా తీస్తున్న వీడియోలు అన్నీ కూడా నరేష్ పర్సనల్ లైఫ్ రిలేటెడ్ అయ్యి.. చాలా వైరల్ అయ్యాయి. అందువలన ఈ సినిమా క్రేజ్ సంపాదించుకుంది. సినిమాకి ముందు హైప్ అయితే బాగానే సృష్టించారు గాని, సినిమా రిలీజ్ అయిన తరవాత రిజల్ట్ ఎలా ఉంటాదో చూడాలి.