Nandamuri Balakrishna : సీనియర్ ఎన్టీఆర్ వారసుడు నందమూరి బాలకృష్ణ అంటేనే ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. ఆయనకున్న అభిమానుల ఆదరణ ఎంతో శ్రవణానానందంగా ఉంటాది. ఎందుకంటే.. ఆయన సినిమా అంటే చాలు జై బాలయ్య, జై బాలయ్య అంటూ నినాదాలు వినిపిస్తాయి. ఇక ఆయన వాక్ ( Nandamuri Balakrishna and Bahubali ) చాతుర్యం ముందు ఈ తరం హీరోలు అందరూ దిగదుడుపే అనిపిస్తాది. ఒక డైలాగ్ చెప్పడం మొదలు పెట్టాడు అంటే.. అసలు వినే మనకు ఆయాసం రావాలేమో గాని, ఆయన మాత్రం చెక్కు చెదరకుండా, ఆగకుండా అనర్గళంగా చెప్పే నటుడు. నటనలో హావభావాలతో అభిమానులను ఆకట్టుకోగలడు. బాలకృష్ణ సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.
అందులో 2001 లో బి. గోపాల్ దర్శకతంలో వచ్చిన నరసింహనాయుడు సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫ్యాక్షన్ మీద తీసిన ఈ సినిమా 105 కేంద్రాలలో 100 రోజులు పైగా ఆడింది. ఈ సినిమా తరవాత చాలా సంవత్సరాలు ఫ్యాక్షన్ మీద వరుసగా అనేక సినిమాలు వచ్చాయి. ఈ సినిమా సృష్టించిన ( Nandamuri Balakrishna and Bahubali ) రికార్డ్ కి బాలయ్య మీద క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ సినిమా సక్సెస్ కి బాలయ్యను అభినందించే క్రమంలో.. బాలయ్య స్నేహితుడు, భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాల్ రెడ్డి బాలయ్య దగ్గరకు వచ్చి ఒక ప్రాజెక్ట్ చెప్పాడట. అదేమిటంటే.. నరసింహనాయుడు సక్సెస్ తో ఇంత క్రేజ్ పెరిగింది కాబట్టి.. ఈ సమయంలో మనం హై బడ్జెట్ తో ఒక జానపదం సినిమా తీస్తే బాగుంటాదని చెప్పారట.
దానికి బాలకృష్ణ కూడా ఓకే అన్నాడట. అయితే సినిమాకి కథ రెడీ చేసి దానికి కోడిరామకృష్ణని దర్శకుడిగా సెలెక్ట్ చేసుకున్నారట. ఆ సినిమా కథ ఏమిటంటే.. మొత్తం బాహుబలి స్టోరీనే అంట. ఈ సినిమాలో బాలకృష్ణ డబల్ రోల్ అంట. ప్రతాప వర్మ, విక్రమ సింహ భూపతి అనే రెండు క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతాప వర్మ అడవుల్లో వాళ్ళ నాన్నమ్మ దగ్గర పెరుగుతూ ఉండగా.. అక్కడకు వచ్చిన బందిపోట్లు కు అడ్డంగా వెళ్లిన బాలయ్యని చూసి వాళ్ళు చేతులెత్తి దండం పెడతారట. ఇంతకీ వాళ్లేందుకు తనకు దండం పెడుతున్నారని ఆరా తీస్తే.. ప్రతాప వర్మ వాళ్ళ రాజ్యానికి యువరాజు. ఆ రాజ్యానికి రాజైన విక్రమ సింహ భూపతి కొడుకు. తన తండ్రిని విలన్స్ వెన్నుపోటు పొడిచి హతమారిస్తే.. వాళ్ళ నాన్నమ్మ ప్రతాప్ వర్మని అడవుల్లోకి తీసుకెళ్లి ఎవరికీ తెలియకుండా పెంచుకుంటుంది.
తరవాత ప్రతాప్ వర్మ వెళ్లి వాళ్ళ నాన్నకు అన్యాయం చేసిన వారిపై పగ తీర్చుకుంటాడు. 2001లో రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందట. కొద్దిపాటి షూటింగ్ జరిగిన తర్వత.. కొన్ని కారణాల వలన ఈ సినిమా ఆగిపోయి.. ఆ తర్వాత ఎస్ గోపాల్ రెడ్డి చనిపోయివడంతో పూర్తిగా మూల పడిపోయింది. ఆ రోజుల్లో ( Nandamuri Balakrishna and Bahubali ) ఈ సినిమాని అంత బడ్జెట్ తో తీసి ఉంటె.. సూపర్ హిట్ అయ్యేది. కానీ ఇప్పుడు బాహుబలి అదే అలాంటి కథతో రాదు.. వచ్చినా నిలబడదు అని నెటిజనులు అనుకుంటున్నారు. ఇప్పుడు బాహుబలి కి అంత రికార్డ్ రాసిపెట్టి ఉంది కాబట్టే అప్పట్లో బాలకృష సినిమా ఆగిపోయిందని అనుకుంటున్నారు..