Star Director: ప్రస్తుతం ఇప్పుడు స్టార్ హోదాని అనుభవిస్తున్న స్టార్ హీరోలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సూపర్ స్టార్ గా ఎదిగినటువంటి వారు మన తెలుగు చిత్ర పరిశ్రమలో లేకపోలేదు. కానీ వాళ్లు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్ల మొదట్లో ఎన్నో ఇబ్బందులకు చిత్ర హింసలకు గురయ్యారు అన్న విషయం మీకు తెలుసా.? అలాంటి ఘోరమైన అవమానాలను ఎన్నింటినో దిగమింగుకొని వచ్చిన ప్రతి అవకాశాన్ని చేజార్చకుండా నేడు ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరో హోదాని దక్కించుకున్నారు. దశాబ్దాల తరబడి మన తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతూ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంటూ తనేంటో నిరూపించుకుంటున్నారు.
మరి ఆ హీరో ఎవరు అనుకుంటున్నారు తను ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. అవును మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న విషయం అంతా కూడా ఒకరకంగా చెప్పాలంటే ఆయన గురించే.. ఆయన గతంలో పడ్డ ఇబ్బందులు గుణపాఠంగా మరల్చి నేడు కోట్ల మందికి ఆదర్శంగా నిలిచి ప్రతి ఒక్కరూ తన వలే స్వయం కృషితో పైకి రావాలని ఆదర్శంగా నిలిచినటువంటి ఏకైక వ్యక్తి చిరంజీవి. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. కానీ మెగాస్టార్ చిరంజీవి అది చేసి చూపించాడు. అలా రెండు మూడు హిట్స్ కొట్టిన తర్వాత కూడా కృష్ణ, శోభన్ బాబు చిత్రాలలో పలువురు దర్శక, నిర్మాతలు విలన్ క్యారెక్టర్ అవకాశం ఇస్తే
కాదనకుండా ఇష్టం లేకపోయినప్పటికీ కూడా విలన్ గా కూడా చేయవలసి వచ్చింది అంటూ ఇటీవలే జరిగిన భోలా శంకర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఈ విషయాన్ని మనందరికీ వెల్లడించాడు మెగాస్టార్ చిరంజీవి. ఇలా చెప్పుకుంటూ పోతే మెగాస్టార్ మీద ఒక పుస్తకమే రాయచ్చు. అందుకే అసలు మన టాపిక్ విషయంలోకి వచ్చినట్లయితే.. ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ తులసి అప్పట్లో మెగాస్టార్ చిరంజీవిని ప్రముఖ దర్శకుడు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పెట్టినటువంటి టార్చర్ గురించి వెల్లడించింది. ఆ రోజుల్లో చిరంజీవి, వాసు వీళ్లిద్దరూ కలిసి తిమ్మారెడ్డి భరద్వాజ (Star Director) నిర్మించినటువంటి కోతల రాయుడు అనే సినిమాలో నేను చిన్న పాత్రలో నటించాను.
ఇక ఈ చిత్రం 1979 వ సంవత్సరంలో విడుదలై ఘన విజయాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ చిత్రం యొక్క నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కి ఓరోజు చిరంజీవి షూటింగ్స్ పార్టీ కాస్త లేటుగా వచ్చినందుకు విపరీతమైన కోపం వచ్చిందట.. దాంతో ఆయన ఆలస్యంగా వచ్చినందుకు గాను చిరంజీవి గారికి ఆరోజు మొత్తం ఎండలో నిల్చోవాలని ఆదేశించాడంట. దాంతో చిరంజీవి ఆశిక్షని మనస్ఫూర్తిగా అంగీకరించి ఆ రోజు మొత్తం ఎండలో నిలబడ్డాడట.. ఇక ఈ విషయం గురించి ఇటీవల ఏమి ఇద్దరం కలిసి ఆ సంఘటన గుర్తు చేసుకుని మరి చిరంజీవి గారు మేము చాలా నవ్వుకున్నామంటూ చెప్పుకొచ్చింది తులసి. కాగా ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో ఆమె నటించిన సంగతి మనందరికీ తెలిసిందే..