బాహుబలి, బాహుబలి 2 తో ప్రభాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించతగ్గ హీరో గా పేరు పొందాడు. మామూలుగానే ప్రభాస్ సినిమా అంటే ఒక అంచనా ఉంటాది, అలాంటిది బాహుబలి తరవాత నుంచి అంచనాలు భారీగా ఉంటున్నాయి. అలాగే ప్రభాస్ పెళ్లి గురించి ప్రతీ ఇంటర్వ్యూ లో అందరూ ప్రశ్నిస్తూనే ఉంటారు గాని, అప్పుడే కాదు అంటూ తప్పించుకుంటాడు. రీసెంట్ గా అన్ స్టాపబుల్ లో బాలయ్య కూడా ఈ ప్రశ్న అడగ్గా, సల్మాన్ ఖాన్ కి అయిన తరవాత చేసుకుంటాను అంటూ ప్రభాస్ తప్పించుకున్నాడు.
ఇక సమంత విషయానికి వస్తే, సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటాది. సమంత కు సంబంధించిన ప్రతీ చిన్న విషయం గురించి నెటిజనులు చాలా స్పీడ్ గా రియాక్ట్ అవుతుంటారు.సమంత నాగ చైతన్య తో విడిపోయిన తరవాత సినిమాలతో చాలా బిజీ గా దూసుకుపోతుంది. అయితే రూమర్స్ మాత్రం ఎవ్వరిని వదిలి పెట్టవు. అందులోనూ సినిమా సెలెబ్రెటీస్ ని అస్సలు వదలవు. అలాగే ఇప్పుడు ప్రభాస్ సమంతలు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. చాలామంది హీరోలతో నటించిన సమంత ఇంతవరకు ప్రభాస్ తో ఎప్పుడు నటించలేదు.
అలాంటిది వీరిద్దరి మధ్య ఇంతటి పరిచయం, ఇలాంటి నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు అని అందరిని ఆశ్చర్య పరిచింది. అయితే ఇది కేవలం రూమర్ మాత్రమే. ఇలాంటి రూమర్స్ వలెనే నిజమైన వార్తలు కూడా జనాలు నమ్మలేని పరిస్థితి నెలకుంటుంది. ఈ రూమర్ ప్రభాస్ వరకు వెళ్లిందట. ఎప్పుడూ కూల్ గా ఉండే డార్లింగ్ ఒక్కసారిగా చాలా కోపం చూపించాడంట. ఆ రూమర్ పబ్లిష్ చేసిన వారిపై యాక్షన్ కూడా తీసుకున్నాడంట. ఇక ఈ రూమర్ విన్న నెటిజనులు ఛీ ఛీ ఈ మధ్య కాలంలో ఇంత నీచమైన రూమర్ రాలేదు అంటూ వాపోతున్నారు.