Priyamani: తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎవరే అతగాడు అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ హీరోయిన్ గా మారిపోయింది ప్రియమణి. ఇక ఆ తర్వాత వరుస సినిమాలతో మొదట ఇండస్ట్రీని ఊపు ఊపినప్పటికీ ఆ తర్వాత ఆమెకు సరైన అవకాశాలు అంతగా అందలేదు. ఇక అందిన చిత్రాలతో నైనా సరి పెట్టుకుందాం లే అనుకుంటూ హిట్స్..ఫ్లాప్స్.. అనేవి సంబంధమే లేకుండా వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ప్రియమణి. ఈ క్రమంలోనే బడా స్టార్ హీరోలు అయినటువంటి నాగార్జునతో.. ఎన్టీఆర్ సరసన కూడా నటించింది. ఇక ఆ తర్వాత కుర్ర హీరోయిన్లకు దీటుగా పోటీ ఇయ్యలేక కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి పీటలు ఎక్కేసింది. (Latest News About Priyamani)
తను ముస్తఫా అనే అతని తో వివాహం చేసుకొని సినిమా ఇండస్ట్రీ కి దూరమైంది. అలా కొన్ని రోజులు దూరమైనప్పటికీ ప్రస్తుతానికి మాత్రం తన సెకండ్ మొదలు పెట్టింది. చిత్రాలలో పలు క్యారెక్టర్స్ లలో నటిస్తూ.. వెబ్ సిరీస్ లలో కీలక పాత్రలు పోషిస్తూ వస్తుంది. వరుస చిత్రాలతో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న ప్రియమణి పలు టీవీ షో కార్యక్రమాలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తూ తనదైన శైలిలో ముందుకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. కాగా ఇటీవలే తన పుట్టినరోజు వేడుక జరుపుకుంది. కానీ ఎందుకో తెలియదు చాలా సింపుల్ పద్ధతిలో కేవలం బంధుమిత్రుల సమక్షంలో మాత్రమే సెలబ్రేట్ చేసుకుంది. ఇక వాళ్లందరితోనే కేక్ కట్ చేసుకొని ఆరోజు సరదాగా గడిపింది..
ప్రస్తుతం ఆ ఫోటోలన్నీ తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. కానీ.. ప్రియమణికి ఈ విషయంలో ఇలా జరుగుతుందని ఆమె కూడా అసలు ఊహించకున్నాలా.. అదేంటంటే? ఆ ఫోటోలో ఎక్కడా కూడా తన భర్త ముస్తఫా తో ఫోటోలు లేకపోవడంతో ప్రస్తుతం అవి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఇదే కాకుండా ఈ ఫోటో పై స్పెషల్ మూమెంట్స్ ని ముస్తఫా నిన్ను నేను మిస్ అవుతున్నాను ట్యాగ్ చేయడం మరింత హాట్ ట్రెండ్ అయ్యే విషయం. గత కొంత కాలంగా వీళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయని.. అందుకే వీళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారని..
త్వరలో విడాకులు కూడా తీసుకోబోతున్నారని గతంలో రకరకాల ప్రచారాలు అయితే జరిగాయి. కానీ అలాంటిది ఏమీ లేదని తన భర్త పనిమీద ఇతర దేశాలలో ఉన్నాడని.. నేనేమో షూటింగ్స్ లలో బిజీగా ఉన్నానని.. అందుకే మా మధ్య కొంచెం దూరం వచ్చిందని వార్త అయితే వైరల్ గా మారింది. కాగా ఇదే క్రమంలో నెట్టింట కొందరు ఆకతాయిలు మాత్రం ప్రియమని మొగుడు ఉన్నా లేనట్టే అంటూ ఘోరాతి ఘోరంగా దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు ఆమె పై.. దీంతో ప్రియమణి కి ఇన్ని కష్టాలు వచ్చాయా.. అసలు ఇలా దొరికిపోయింది ఏంటి? అసలు ఈ విషయంలో ప్రియమణికి ఇలా జరుగుతుందని ఆమె కూడా ఊహించి ఉండదు కదా అంటూ ఆమె ఫాన్స్ ఆమెపై జాలి పడుతున్నారు. (Latest News About Priyamani)