Home News Taraka Ratna: తారకరత్న చివరి కోరిక తీరకుండానే చనిపోయాడంటూ కన్నీరు మున్నీరవుతున్న కుటుంబం.

Taraka Ratna: తారకరత్న చివరి కోరిక తీరకుండానే చనిపోయాడంటూ కన్నీరు మున్నీరవుతున్న కుటుంబం.

Taraka Ratna Last Wish: నందమూరి తారకరత్న జనవరి 27 అనగా నిన్న రాత్రి శనివారం రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి మనందరికీ దూరంగా వెళ్లారు. ఆయన గుండె పోటుతో దాదాపు 23 రోజులపాటు ప్రాణాలతో కొట్టు మిట్టాడుతూ చివరికి శనివారం రాత్రి చివరి శ్వాస విడిచారు. ఇక ఆయన మరణం వార్త తెలియగానే ఇటు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కంటతడి పెట్టుకున్నారు. ఇంత చిన్న వయసులో తిరిగిరాని లోకాలకు వెళ్లాడని అభిమానంతో సహా ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. మరి ముఖ్యంగా అతని భార్య, పిల్లలకు ఆయన చనిపోవడం ఓ పెద్ద విషాదమనే చెప్పవచ్చు.

See also  లక్షల్లో ఆఫర్స్ చేసినా కేవలం వారి ఇద్దరి వల్లే జబర్దస్త్ వదిలేసిందా అనసూయ.?

the-family-is-in-tears-as-tarakaratna-died-without-fulfilling-his-last-wish

మరో పక్క తారకరత్న తల్లిదండ్రులకు ఇది తీరని కడుపు కోతగా మిగిలిపోయింది.. ఇకపోతే బాబాయ్ బాలకృష్ణ సైతం తారకరత్న గుండెపోటుకు గురైనప్పటినుంచి ఆసుపత్రిలోనే ఉంటూ అన్ని చూసుకుంటూ తన సినిమాలు సైతం అన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉన్న బాలకృష్ణ కన్నీరు పర్యంతరం అవుతున్నారు. నా కొడుకు ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేడేసి కాపాడుకుంటానని చెప్పిన బాలకృష్ణ ఆ మాటలు తలుచుకుంటూ చాలా ఏడుస్తున్నాడు. ప్రస్తుతానికి ఎంతోమంది నందమూరి కుటుంబసభ్యులతో పాటు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, నందమూరి తారకరత్నకి సంతాపం తెలియజేశారు.

the-family-is-in-tears-as-tarakaratna-died-without-fulfilling-his-last-wish

అయితే ఇదిలా ఉండగా ఆయన చనిపోయిన కొద్ది గంటలకి ఆయన చివరి కోరిక (Taraka Ratna Last Wish) తీరకుండానే చనిపోయాడంటూ వార్త వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆయన చివరి కోరిక ఏంటో ఇప్పుడు చూద్దాం. నందమూరి తారకరత్న ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాతో సినిమా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. ఇదే కాక ఈ ఒక్క సినిమానే కాక ఒకే రోజు ఏకంగా తొమ్మిది సినిమాలను ప్రకటన చేస్తూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ కూడా ఎక్కాడు. ఏ హీరో అందుకోలేని అరుదైన ఘనత ప్రపంచ రికార్డు సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆయన నటించిన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలోని పాటలు బాగా పాపులర్ అయినప్పటికీ సినిమా మాత్రం అంతగా హిట్ సాధించలేకపోయింది.

See also  Andhra Pradesh : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

the-family-is-in-tears-as-tarakaratna-died-without-fulfilling-his-last-wish

దాంతో చాలామంది నిర్మాతలు తారకరత్నతో సినిమా చేయడానికి వెనకడిగే వేశారు. దీంతో సినిమా రంగంలో కేవలం కొన్ని సినిమాలకే పరిమితమైన తారకరత్న ఆ తర్వాత చాలా రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉండి రాజకీయాల్లో కీలకపాత్ర వహించడానికి ఈ మధ్యనే రాజకీయాల్లోకి వచ్చారు. తాను కూడా తన తాత, బాబాయ్ లాగే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి ప్రజాసేవ చేయాలనే కోరిక ఉండేదట. తారకరత్న చివరి కోరిక కూడా ఇదేనట.. కానీ తన చివరి కోరిక తీరకుండానే తారకరత్న చనిపోయాడు అంటూ తెలిసి కుటుంబ సభ్యులతో పాటు నందమూరి అభిమానులు ఇటు తెలుగు ప్రేక్షకులు కన్నీరు మున్నీరవుతున్నారు.