Anchor Rashmi Gautams: ఎంతో మంది కమెడీయన్స్ కి లైఫ్ ఇచ్చినట్లు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో లో యాంకర్ గా రష్మీ గౌతమ్ కి ఇండస్ట్రీలో ఓ రెంజ్ లో గుర్తింపు అయితే దక్కిందని చెప్పాలి. మరి ముఖ్యంగా బుల్లి తెర ప్రేక్షకులకు అయితే తన గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతున్న ఈ అమ్మడు మొదట్లో హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ పలు రకాల చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా కూడా చేసినప్పటికీ కానీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు అయితే అందుకోలేక పోయింది. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే జబర్దస్త్ ద్వారా యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిందో ఓ వైపు బుల్లితెరలో పలు రకాల షోలకి యాంకర్ గా వ్యవహరిస్తూనే చాలా బిజీ అయిపోవడంతో మంచి పేరు గుర్తింపు రావడంతో ఆ తర్వాత పలు సినిమాలలో కూడా అవకాశాలు రాసాగాయి.
కానీ ఆశించిన స్థాయిలో ఆ సినిమాలు ఫలితాలను ఇవ్వకపోగా మళ్లీ యాంకర్ గా బిజీ అయిపోతూ ఎక్స్టా జబర్దస్త్ కు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తుంది ఈ అమ్మడు. ఇక ప్రతి ఆదివారం మధ్యాహ్నం వచ్చే ఈ శ్రీ దేవి డ్రామా కంపెనీకి పెద్ద ఎత్తున ప్రేక్షకుల నుండి భారీ స్థాయిలో భారీ స్థాయిలో స్పందన రావడమే కాకుండా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. తాజాగా ఆదివారం ప్రసాదమయ్యే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలవుగా.. ఎప్పటిలాగే కమెడియన్స్ వాళ్ళ పంచులతో డైలాగులతో అందరినీ ఆకట్టుకుంటూ అలరించగా..
మొన్నటి వరకు హైపర్ ఆది డబుల్ మీనింగ్స్ తో రెచ్చిపోగా.. ఇప్పుడు ఆయనకు తోడు ఆటో రాంప్రసాద్ కూడా వచ్చి చేరాడని చెప్పాలి. కాగా ఈ క్రమంలో ఆటో రాంప్రసాద్ తన స్కిట్ లో భాగంగా రష్మిని ఏకంగా రాత్రికి రమ్మని పిలిచాడు. దీంతో ఒక్కసారిగా రష్మీ (Anchor Rashmi Gautams) నన్నెందుకు రమ్మంటున్నావని ప్రశ్నించడంతో ఆటో రాంప్రసాద్ రాత్రి ఎందుకు రమ్మంటారో తెలియదా అంటూ తెగ సిగ్గు పడిపోయాడు. స్కిట్లో భాగంగానే రష్మిని పట్టుకుని రాత్రి రా అని రాంప్రసాద్ చెప్పడంతో అక్కడే ఉన్నటువంటి ఇంద్రజ సడన్ గా ఏయ్ అనేసరికి వెంటనే తేరుకుని ఆటో రాంప్రసాద్ ఊర్లో జాతర అందుకే పిలిచామండీ అంటూ కవర్ చేయడం మరింత హైలెట్ గా నిలిచింది.
ఈ కార్యక్రమానికి విడుదలైన ప్రోమో చాలా వైరల్ గా మారడంతో పలువురు ఎప్పటిలాగే ఈ ప్రోగ్రాం పై పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. తరచూ ఇదే రిపీట్ అవుతుండడం మరి అదే విధంగా ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్ తో పంచులు వేయడం వల్ల నెటిజన్స్ విసిగిత్తి పోయి తరచూ ఇలాంటి కార్యక్రమాలపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ నిర్వాహకులపై మండిపడుతుండడం గమనార్థం. కామెడీని కామెడీ లాగా చూడాలి కానీ ఏంటి డబల్ మీనింగ్ డైలాగులు వాటిని ఆపాలి అంటూ కొన్ని వర్గాల ప్రేక్షకు సైతం కోరుతున్నారు.